మొక్కల పెంపకంతో మతిమరపు మాయం

మొక్కల పెంపకంతో ఫలసాయం కాకుండా బోల్డన్ని లాభాలున్నాయట. అవన్నీ తెలిస్తే ఇంటి పనులు కొన్ని తగ్గించుకుని మొక్కలు పెంచేందుకు మీరే సిద్ధమవుతారు...

Published : 16 Jun 2021 00:46 IST

మొక్కల పెంపకంతో ఫలసాయం కాకుండా బోల్డన్ని లాభాలున్నాయట. అవన్నీ తెలిస్తే ఇంటి పనులు కొన్ని తగ్గించుకుని మొక్కలు పెంచేందుకు మీరే సిద్ధమవుతారు...

మొక్కలు పెంచడం చాలా ఆరోగ్యకరమైంది. నీళ్లు పోయడం, కుదుళ్లలో మట్టిని గుల్ల చేయడం, కలుపు తీయడం లాంటి పనులు శరీరానికి వ్యాయామం. వేళకు ఆకలి వేస్తుంది. తిన్న ఆహారం సవ్యంగా జీర్ణమవుతుంది.

* గార్డెనింగ్‌ మన సామర్థ్యాలను పెంచి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
* ఎండలో తోటపని చేయడం వల్ల శరీరానికి తగినంత డి విటమిన్‌ అందుతుంది.
* ఊబకాయం సమస్య ఉత్పన్నం కాదు. సమ బరువుతో శరీరం దృఢంగా ఉంటుంది.  
* నిద్రలేమి సమస్య తలెత్తదు.
* మొక్కల్లో గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతత, ఆనందం చేకూరతాయి.
* కొరియాలో డిమెన్షియా చికిత్సలో భాగంగా రోగులకు కొన్నాళ్లపాటు తోట పనులు పురమాయించారు. అందువల్ల వారి జ్ఞాపకశక్తి చాలా మెరుగుపడింది.
* నెదర్‌ల్యాండ్స్‌, నార్వేల్లో పలువురు డిమెన్షియా రోగులపై జరిపిన అధ్యయనాల్లో వారికి మొక్కల పనులు అప్పగించడం వల్ల చికిత్సలో ఎంతో పురోగతి ఉందని తేలింది.
* వ్యసనపరుల కోసం నిర్వహించే రికవరీ ప్రోగ్రాముల్లో మొక్కల పెంపకం ఒకటి.
* ఆందోళన తగ్గించుకోవడానికి, మనల్ని మనం మోటివేట్‌ చేసుకోవడానికి మొక్కల వ్యాపకాన్ని మించింది లేదు. ఎంత కష్టంలో ఉన్నా కాసేపు తోటలో గడిపి సేదతీరొచ్చు.
* మానసిక రోగులకు హార్టీకల్చర్‌ థెరపీ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పరిశోధనలు రుజువు చేశాయి.
* ఇళ్లు, స్కూళ్లు, ఆఫీసులు ఎక్కడ వీలైతే అక్కడ వీలైనన్ని మొక్కలు నాటమంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. ఈ అలవాటు వ్యక్తులకే కాదు, మొత్తం వ్యవస్థకే మేలుచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్