నిద్రపుచ్చే మొక్కలు!
చాలామంది నిద్ర పట్టడం లేదని వాపోతుంటారు. అలాంటివారు కొన్ని రకాల మొక్కలను పడగ్గదిలో పెట్టుకుని చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.
చాలామంది నిద్ర పట్టడం లేదని వాపోతుంటారు. అలాంటివారు కొన్ని రకాల మొక్కలను పడగ్గదిలో పెట్టుకుని చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.
కలుషితమైన గాలి వల్ల జలుబు, రకరకాల అలర్జీలు వస్తాయి. కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల అవి ఆ గాలిని శుభ్రం చేస్తాయి. దీంతో జబ్బులకు దూరంగా ఉండొచ్చు. వాటిని పడక గదిలో పెడితే స్వచ్ఛమైన వాయువులను పీలుస్తూ హాయిగా నిద్రపోవచ్చు.
* లావెండర్... ఈ మొక్క వెలువరించే సువాసనలు గదంతా వ్యాపించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. దాంతో చక్కగా నిద్రపడుతుంది. ఈ పూల పరిమళాలు మీలోని ఒత్తిడి, గుండె దడలను తగ్గిసాయి. పడగ్గదిలో సూర్యరశ్మి పడే చోట ఈ మొక్కను పెట్టండి. వెలుతురు పడే అవకాశం లేకపోతే కనీసం ఫ్లోరోసెంట్ లైట్‌ను అమర్చండి.
* కలబంద... ఇది రాత్రుళ్లు ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో పాటు పరిసరాల్లోని వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది. దాంతో మీకు తెలియకుండానే హాయిగా నిద్ర పడుతుంది.
* జెర్బరా.. ఈ పూల మొక్క ఎక్కడుంటే అందం, ఆకర్షణీయతా అక్కడే. ఇవి గదికి కొత్తందాన్ని ఇస్తాయి. గదిలోని గాలిని శుభ్రం చేసి నిద్రపట్టేలా చూస్తాయి.
* లెమన్ బామ్... ఔషధ గుణాలున్న మొక్క. దీని ఆకుల నుంచి తీసిన నూనెను మర్దనాకు ఉపయోగిస్తారు. దీని వాసన ఒత్తిడి, ఆందోళనా, డిప్రెషన్ లాంటి వాటిని నియంత్రిస్తుంది. ఈ మొక్క ఆకులను నలిపి వాసన చూడండి. హాయిగా అనిపించడమే కాకుండా నిద్రా పడుతుంది.
* మల్లె... ఈ మొక్కను గదిలో కిటికీ దగ్గర చిన్న కుండీలో పెట్టి చూడండి. ఇది ఆందోళనలు, ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. అంతే కాదు హాయిగా నిద్ర పుచ్చుతుంది కూడా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
ఆరోగ్యమస్తు
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
అనుబంధం
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకంబట్టి ఎదుగుతారు.!
- నాన్నంటే భయపడుతున్నారు..!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
యూత్ కార్నర్
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!