రకుల్‌ మాస్కులు

ఉదయాన్నే ప్రత్యేకంగా ఇదే పద్ధతి పాటించాలన్న నియమం పెట్టుకోదట రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అయితే.. నిద్రపోయే ముందు మాత్రం మేకప్‌ పూర్తిగా తొలగించి తప్పక క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ చేస్తానంటోంది. ఇంకా.. ‘ఖాళీ సమయం దొరికితే

Published : 09 Oct 2021 02:35 IST

ఉదయాన్నే ప్రత్యేకంగా ఇదే పద్ధతి పాటించాలన్న నియమం పెట్టుకోదట రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అయితే.. నిద్రపోయే ముందు మాత్రం మేకప్‌ పూర్తిగా తొలగించి తప్పక క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ చేస్తానంటోంది. ఇంకా.. ‘ఖాళీ సమయం దొరికితే ఇంట్లో దొరికే వస్తువులతోనే మాస్కులు ప్రయత్నిస్తా. వాటిల్లో రెండు నా ఫేవరెట్‌. ఒకటి.. టేబుల్‌ స్పూను చొప్పున సెనగపిండి, పెరుగుకు చిటికెడు పసుపు, కొంత నిమ్మరసం కలిపి పూత వేస్తా. సెనగపిండి స్క్రబ్‌లా, పసుపు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తే నిమ్మ డీటాన్‌ చేస్తుంది. ఇక రెండోది.. బాగా పండిన అరటిపండు గుజ్జుకి అరచెక్క నిమ్మరసం, టేబుల్‌ స్పూను తేనె కలిపి ముఖానికి పట్టించాలి. అరటిలోని పొటాషియం చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. నిమ్మ నల్లమచ్చలను తొలగించి ముఖాన్ని కాంతిమంతం చేస్తుంది. అంతేకాదు ఇదో నేచురల్‌ యాంటీ ఏజెనింగ్‌ మాస్క్‌’ అంటోంది. మీకు నచ్చినదాన్ని ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్