జుట్టు పట్టులా...

శిరోజాలకు నూనె మర్దనా ఎంత ముఖ్యమో, తల స్నానం తర్వాత కండిషనర్‌ కూడా అంతే ముఖ్యమంటున్నారు సౌందర్య నిపుణులు. సహజసిద్ధమైన కండిషనర్‌ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని సూచిస్తున్నారు.

Updated : 10 Oct 2021 06:15 IST

శిరోజాలకు నూనె మర్దనా ఎంత ముఖ్యమో, తల స్నానం తర్వాత కండిషనర్‌ కూడా అంతే ముఖ్యమంటున్నారు సౌందర్య నిపుణులు. సహజసిద్ధమైన కండిషనర్‌ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని సూచిస్తున్నారు.

* మెరిసేందుకు...
ఒక గిన్నెలో నాలుగు చెంచాల కలబంద గుజ్జును తీసుకుని, అందులో చెంచా నిమ్మరసం వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తలకు రాసుకుని అయిదు నిమిషాలపాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేసి, జుట్టును పట్టులా మెరిసేలా చేస్తుంది.

*  వెనిగర్‌తో..
రెండు కప్పుల నీటిలో రెండు చెంచాల యాపిల్‌సిడార్‌ వెనిగర్‌, చెంచా తేనె వేసి కలిపిన మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టేలా రాయాలి. రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.

* ప్రొటీన్లతో...
ఒక గిన్నెలో గుడ్డు కొట్టి చెంచాతో బాగా కలపాలి. ఇందులో ఆరు చెంచాల పెరుగు వేసి మరొకసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 15 నుంచి 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మృదువుగా మర్దనా చేస్తూ జుట్టును శుభ్రం చేసుకుంటే చాలు. పెరుగులోని ప్రొటీన్లు, లాక్టిక్‌ యాసిడ్‌ మాడును శుభ్రపరిచి శిరోజాలను బలంగా ఉంచుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్