పైసాపై అదుపుంటేనే జీవితంపై ధీమా

రమ్య ఉన్నతోద్యోగి. తన జీతంలో దాదాపు 80 శాతం ఖర్చవుతుండగా, మిగతాది బ్యాంకు రుణానికి సరి. తనకన్నా తక్కువ సంపాదించే స్నేహితురాలు మాత్రం పొదుపు చేసి సొంతంగా ఇంటిని కొంది. అలా పొదుపు చాలా సమస్యలకు పరిష్కారాల్ని చూపిస్తుందంటున్నారు నిపుణులు.

Updated : 02 Jan 2022 06:53 IST

రమ్య ఉన్నతోద్యోగి. తన జీతంలో దాదాపు 80 శాతం ఖర్చవుతుండగా, మిగతాది బ్యాంకు రుణానికి సరి. తనకన్నా తక్కువ సంపాదించే స్నేహితురాలు మాత్రం పొదుపు చేసి సొంతంగా ఇంటిని కొంది. అలా పొదుపు చాలా సమస్యలకు పరిష్కారాల్ని చూపిస్తుందంటున్నారు నిపుణులు.

ఎంత సంపాదిస్తున్నాం అనేదే కాకుండా, ఎంత ఖర్చు అవుతుందో కూడా అవగాహన ఉండాలి. దీనికో డైరీని పెట్టుకోవాలి. జీతం వివరాల నుంచి రోజు వారీ చిన్న చిన్న ఖర్చుల వరకూ రాయాలి. ఆన్‌లైన్‌ షాపింగ్‌, బిల్లుల చెల్లింపులను ట్రాక్‌ చేసి సమాచారాన్నిచ్చేలా ఉచిత యాప్స్‌ ఉన్నాయి. ఒకటి డౌన్‌లోడ్‌ చేసుకోండి. వారానికొకసారి వీటిని కూడా ఆ పుస్తకంలో జత చేయాలి. వీటిలో అవసరం, అనవసరమైన వాటిని ముందుగా విడదీయాలి. కొందరు ఖాళీ దొరికినప్పుడల్లా విండో షాపింగ్‌ లేదా ఆన్‌లైన్‌ ఆఫర్స్‌ను చూస్తుంటారు. అలా తెలియకుండానే అనవసర ఖర్చులవుతుంటాయి. అందుకే ప్రతి నెలా ఖర్చులకు పోను మిగతాది మరో మార్గంలోకి మళ్ళించాలి.

పొదుపు ... స్థలం, బంగారం వంటి వాటిని కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. వీటి కోసం పొదుపు తప్పదు. అలాగే బ్యాంకులో లేదా పోస్టాఫీసులో రెకరింగ్‌ డిపాజిట్‌కు నెలనెలా జమ చేస్తుండాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో కూడా చేరితే మంచిది. అత్యవసరానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్య బీమా తప్పని సరి. అనారోగ్యం వస్తే ఇదే అండ. ఇలా నెలనెలా దేనికెంత జమ చేయాలో డైరీలో రాసిపెడితే పనులన్నీ పద్ధతిగా పూర్తవుతాయి. చేతిలో ఆ నెలకు కావాల్సిన నగదు మాత్రమే మిగులుతుంది. అనవసరపు ఖర్చులకు తావుండదు. ఈ ఆర్థిక ప్రణాళిక జీవితంపై ధీమా, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్