తేలిగ్గా పెంచేయొచ్చు!

ఎంత ఆసక్తి ఉన్నా.. తగినంత స్థలం లేకో, నిర్వహణ సాధ్యం కాకో చాలామంది మొక్కల పెంపకాన్ని పక్కన పెట్టేస్తారు. అలాంటివాళ్ల కోసమే వచ్చాయి ఇండోర్‌ ప్లాంటింగ్‌ మెషిన్లు. హైడ్రోఫోనిక్‌ విధానం.. అంటే పోషకాలు ఉండే నీటితో మొక్కలు పెరుగుతాయన్న మాట.

Updated : 12 Jan 2022 05:49 IST

ఎంత ఆసక్తి ఉన్నా.. తగినంత స్థలం లేకో, నిర్వహణ సాధ్యం కాకో చాలామంది మొక్కల పెంపకాన్ని పక్కన పెట్టేస్తారు. అలాంటివాళ్ల కోసమే వచ్చాయి ఇండోర్‌ ప్లాంటింగ్‌ మెషిన్లు. హైడ్రోఫోనిక్‌ విధానం.. అంటే పోషకాలు ఉండే నీటితో మొక్కలు పెరుగుతాయన్న మాట. కింది భాగంలో ఉండే టబ్బు వంటి పాత్ర నీరు, న్యూట్రియంట్లను కలిగి ఉంటుంది. దానికి అనుసంధానంగా ఉన్న చిన్న చిన్న రంధ్రాల్లో విత్తనాలు/ మొక్కల్ని ఉంచొచ్చు. దీంతో దుమ్ము, మట్టి నేలపై పడితే శుభ్రం చేయాలన్న బెంగ ఉండదు. పైభాగంలో ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. ఇవి మొక్క ఎదుగుదలకు సాయపడతాయి. ఆకుకూరలు, కూరగాయలు, పూలమొక్కలు తగ్గట్టుగా వెలుతురుని అమర్చుకోవచ్చు. కొన్నింట్లో మొక్కలు ఎత్తు పెరిగే కొద్దీ ఎల్‌ఈడీ రాడ్‌నూ సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. మరికొన్ని వివిధ అరల్లో భిన్న మొక్కల్ని పెంచుకునేలానూ దొరుకుతున్నాయి. మొత్తంగా మొక్కల్ని పెంచుకున్నామనే ఆనందంతోపాటు దుమ్ము బాధా ఉండదు. బాగుంది కదూ ఈ అమరిక! కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో ప్రయత్నించేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్