ఇంట్లో వస్తువులకూ తుది గడువుంది!

ఇంట్లో సరకులు కొనేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్‌ చూసి మరీ తీసుకుంటాం. మరి ఆ డేట్‌ లేకుండా మన ఇంట్లోనే ఎక్స్‌పైరీ అయిన వస్తువులను మాత్రం అలాగే వదిలేస్తాం. కానీ వాటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే..!

Published : 14 Jan 2022 01:14 IST

ఇంట్లో సరకులు కొనేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్‌ చూసి మరీ తీసుకుంటాం. మరి ఆ డేట్‌ లేకుండా మన ఇంట్లోనే ఎక్స్‌పైరీ అయిన వస్తువులను మాత్రం అలాగే వదిలేస్తాం. కానీ వాటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే..!

తడి టవళ్లు.. తడిగా ఉన్న టవల్‌ మీద బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా ఆరబెట్టాలి. అలాగే ఒక టవల్‌ను సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు.

టూత్‌ బ్రష్‌లు.. మనం రోజూ వాడే టూత్‌ బ్రష్‌లు కూడా కనీసం మూడు నెలలకోసారి మార్చుతుండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిండ్లు.. తలగడ లేకపోతే నిద్ర పట్టదు కొంతమందికి. అయితే వాటిని కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి.

మసాలా దినుసులు.. కొన్ని రకాల లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటివి ఎక్కువ రోజులు నిల్వచేయరాదు. వీటిని ఆరునెలలకంటే ఎక్కువరోజులు వాడొద్దు

దువ్వెనలు.. దువ్వెనల్ని కూడా వారానికి లేదా కనీసం 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. అలాగే ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు దువ్వెనని వాడకూడదు.

జాగింగ్‌ షూస్‌.. రోజూ వేసుకునే జాగింగ్‌ షూలను కూడా సంవత్సరం కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. అలా వాడటం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్