ప్రణాళికగా పనులన్నీ.. టైమ్‌ ట్యూన్‌తో!

ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలు, వ్యాయామం, స్నేహితులతో కాలక్షేపం, అప్పుడప్పుడూ ఆటవిడుపుగా మొబైల్‌, సామాజికమాధ]్యమాలు  మా ఇవన్నీ జాగ్రత్తగా సరి చూసుకుంటూ వెళ్లాలి. సమయం విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉంటేనే పనులు సవ్యంగా సాగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 19 Jan 2022 01:23 IST

ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలు, వ్యాయామం, స్నేహితులతో కాలక్షేపం, అప్పుడప్పుడూ ఆటవిడుపుగా మొబైల్‌, సామాజికమాధ]్యమాలు  మా ఇవన్నీ జాగ్రత్తగా సరి చూసుకుంటూ వెళ్లాలి. సమయం విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉంటేనే పనులు సవ్యంగా సాగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో మనకు తోడ్పడుతుంది ‘టైమ్‌ ట్యూన్‌’ యాప్‌.

ది యాండ్రాయిడ్‌లో పని చేసే యాప్‌. దీన్ని మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక... మన రోజు వారీ పనులను నమోదు చేయాలి. దాని కోసం ముందుగా చేసిన బ్లాక్స్‌, ట్యాగ్స్‌ ఉంటాయి. వాటి నుంచి నచ్చింది ఎంచుకోవచ్చు. అలా రోజులో ఏ సమయానికి ఏం చేయాలి, ఎంత సేపు అనేది నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆ సమయానికి ముందుగా మీకు నోటిఫికేషన్‌ వస్తుంది. ఫలానా సమయానికి ఈ పని చేద్దామనుకున్నారు అంటూ గుర్తు చేస్తుంది. రోజంతా గడిచాక దేనికెంత సమయం కేటాయించారనేది ట్యాగ్స్‌ ఆధారంగా సులభంగా తెలుస్తుంది. దాన్ని బట్టి రేపటి ప్రణాళికను నిర్ణయించు కోవచ్చు. వారం, నెలవారీగానూ వివరాలు తీసుకోవచ్చు. అవసరమైతే కొత్తగా ట్యాగ్స్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అప్పుడప్పుడూ దీన్ని విశ్లేషించుకుంటూ ఉంటే మనం ఎక్కడ సమయాన్ని వృథా చేస్తున్నామో తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్