ముసురు వేళ.. మొక్కలు జాగ్రత్త!

చినుకులు పడుతుంటే ఆ ముసురుకి కాస్త చిరాకు, బద్ధకం ఆవరిస్తుంటాయి. అలాగని అప్పటిదాకా జాగ్రత్తగా పెంచుకున్న మొక్కల్ని వదిలేశామా! ఇక అంతే సంగతులు. కాబట్టి, వాటి గురించీ ఆలోచించండి.

Published : 24 Jun 2022 00:41 IST

చినుకులు పడుతుంటే ఆ ముసురుకి కాస్త చిరాకు, బద్ధకం ఆవరిస్తుంటాయి. అలాగని అప్పటిదాకా జాగ్రత్తగా పెంచుకున్న మొక్కల్ని వదిలేశామా! ఇక అంతే సంగతులు. కాబట్టి, వాటి గురించీ ఆలోచించండి.

* వర్షాలు పెద్దగా లేవు. ఎండా తగులుతోంది. కాబట్టి, ఫర్లేదు. కానీ నిరంతరం వానలు పడుతూ, మబ్బు పట్టినట్లుగా ఉండి, అప్పుడప్పుడే ఎండగా ఉంటోంటే మాత్రం మొక్కలన్నింటికీ అది తగులుతోందో లేదో చెక్‌  చేసుకోండి. ఈ కాలంలో వారానికోసారైనా మొక్కలు ఎండలో ఉండాలి.

* వర్షం, వర్షపునీరు నేరుగా పడకుండా చూసుకోండి. కుండీల్లో మట్టి సాంద్రత కోల్పోతుంది. సేంద్రియ ఎరువుల్ని కుండీలో తరచూ వేస్తుండండి. కుండీ అడుగున రంధ్రాలు సరిగా పని చేస్తున్నాయో లేదో సరి చూడండి. లేదంటే నీరు నిల్వ ఉండి, మొక్క వేర్లు కుళ్లిపోయే ప్రమాదముంది.

* మొక్కల చుట్టూ పెరిగే గడ్డి, కలుపు, రాలిపడిన ఆకుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఆకులపై మచ్చలు, ఏవైనా వ్యాధి సోకిన గుర్తులు కనిపిస్తే వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి.

* మబ్బు పట్టినట్లుగా ఉన్నప్పుడూ రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజులకోసారి పోస్తే సరిపోతుంది. అనుమానంగా ఉంటే కుండీ మట్టిలో వేలు పెట్టి చూడండి మరీ పొడిగా ఉన్నప్పుడు పోస్తే సరిపోతుంది.

* మొక్కలకు ఫెర్టిలైజర్లు అవసరమనిపిస్తే ఉదయం ఏడు నుంచి 11 గంటల్లోపు మాత్రమే వేయండి. ఆ సమయం దాటితే వేయొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్