నట్టింట తామరపూలు..

ఇండోర్‌ మొక్కల తొట్టెల మధ్య తామరపూలు నిండిన వాటర్‌ గార్డెన్‌ అమర్చుకుంటే ఇంటికే ప్రత్యేక అందం తెచ్చినట్లుంటుంది. దీన్ని తయారుచేసుకోవడం కూడా తేలికే.

Published : 27 Oct 2022 00:19 IST

ఇండోర్‌ మొక్కల తొట్టెల మధ్య తామరపూలు నిండిన వాటర్‌ గార్డెన్‌ అమర్చుకుంటే ఇంటికే ప్రత్యేక అందం తెచ్చినట్లుంటుంది. దీన్ని తయారుచేసుకోవడం కూడా తేలికే. వృథాగా ఉన్న పెద్ద గుండ్రని లేదా చతురస్రాకారం తొట్టె ఉంటే చాలు.

తామర విత్తనాలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వీటిని మొలకెత్తించడానికి ముందుగా చిన్న ప్లాస్టిక్‌ టబ్‌లో నీటిని, కొంత మట్టిని కలిపి ఉంచాలి. ఇందులో విత్తనాలనుంచాలి. వీటి నుంచి వచ్చిన మొక్కలను కొంచెం ఎదిగేవరకు ఆ తొట్టెలోనే ఉంచాలి. నీట లేదా మట్టిలో పెరిగే ఇండోర్‌ మొక్కలను ఈ వాటర్‌గార్డెన్‌కు ఎంచుకోవాలి. వాటిలో ఫిలోడెండ్రాన్‌, లక్కీ బాంబూ, గుర్రపుడెక్క వంటివాటిని విడివిడిగా చిన్నచిన్న కుండీల్లో ఉంచి మట్టి నింపాలి.

అన్నింటినీ..
వాటర్‌గార్డెన్‌ కోసం ఉంచిన తొట్టెలో ముందుగా ఒక పక్కగా ఇండోర్‌ మొక్కల తొట్టెలనుంచాలి. అవి కదలకుండా చిన్న రేకు లేదా చెక్కముక్క ఉంచాలి. మిగతాభాగాన్ని ఖాళీగా ఉంచి తొట్టెను నీటితో నింపాలి. ఇందులో ఒక వంతు మట్టి వేయాలి. ఈ నీటిలో మొలకెత్తిన తామర మొక్కలను వేయాలి. ఇందులో అలంకరణకు చిన్నచిన్న చేపల బొమ్మలనుంచినా చాలు. తామరపూలు విరిసిన తర్వాత ఈ ఇండోర్‌ వాటర్‌ గార్డెన్‌ను ముందుగదిలో మధ్యగా  లేదా డైనింగ్‌ హాల్‌లో ఒక పక్కగా ఉంచినా చాలు. ఇంటికే ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడుతుంది. బాల్కనీలోనూ దీన్ని ఉంచొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్