ఇల్లంతా పర్యావరణహితం..

ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పర్యావరణహితంగానూ సర్దితే.. ఇంటిల్లపాదికీ ఆరోగ్యం. మనసంతా ప్రశాంతత. అంతేనా.. కొత్తగా కనిపించే గదులు ఆ ఇల్లాలికి బోల్డన్ని ప్రశంసలనూ తెచ్చిపెడతాయి.

Published : 15 Nov 2022 00:47 IST

ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పర్యావరణహితంగానూ సర్దితే.. ఇంటిల్లపాదికీ ఆరోగ్యం. మనసంతా ప్రశాంతత. అంతేనా.. కొత్తగా కనిపించే గదులు ఆ ఇల్లాలికి బోల్డన్ని ప్రశంసలనూ తెచ్చిపెడతాయి.

గోడలకు వేసే వర్ణాల నుంచి అలంకరణ వస్తువుల దాకా ఎన్నోరకాల విషరసాయనాల ప్రభావం వాతావరణంపై పడుతుంది. శుభ్రంగా ఉంచిన ఇంటిలో దుమ్మూధూళీ చేరకపోవచ్చు. అయితే అలంకరణ వస్తువుల వల్ల పలురకాల అనారోగ్యాల నుంచి మాత్రం తప్పించుకోలేం. ఇలా జరగకుండా ఉండాలంటే... కుర్చీలు, సోఫా, టీపాయి, అలమరలు, చెప్పుల స్టాండులు వంటివి వెదురు ఉత్పత్తులను తీసుకొంటే మంచిది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు వంటివి వేయకుండా వెదురు పెరుగుతుంది. అంతేకాదు ఇది వాతావరణంలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకొని, 30 శాతం ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా వెదురుతో ఇంటికి కొత్త అందమూ.. వస్తుంది.

రంగులు.. ఇంటికి వేసే రంగుల్లో నాన్‌ టాక్సిక్‌ పెయింట్స్‌ ఎంచుకోవాలి. ఎథిల్‌ యాక్సిటేట్‌, గ్లైకాల్‌ ఈథర్స్‌, ఎసిటోన్‌ వంటి ఆరోగ్యంపై ప్రభావం చూపించని వాటితో తయారు చేసేవి వేయించుకొంటే ఇంటికి అందంతోపాటు ఆరోగ్యానికీ మంచిది.

గుజ్జుతో.. కాగితం గుజ్జుతో చేస్తున్న కుర్చీలు, సోఫాలూ బలంగానే ఉంటాయి. బ్యాక్టీరియాను దరిచేరనివ్వవు. సహజ వర్ణాలను అద్దుతున్న ఈ ఫర్నిచర్‌ను బాల్కనీ, హాల్‌, రీడింగ్‌రూంలో సర్దుకొంటే చాలు. ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

వృథావస్త్రం.. మ్యాట్స్‌, కార్పెట్స్‌ ప్రస్తుతం వృథా వస్త్రంతో తయారు చేసినవి లభ్యమవుతున్నాయి. ఫ్లోర్‌ కుషన్స్‌, ఊయల వంటి పలురకాలైన ఫర్నిచర్‌గానూ ఇవి దొరుకుతున్నాయి. చూడటానికి సృజనాత్మక డిజైన్లలో కనిపించి ఇంటికి మరింత అలంకరణగానూ మారుతున్నాయి. గడ్డి, జనపనార వంటి వాటితో తయారయ్యే డోర్‌మాట్స్‌ కూడా మంచి ఎంపిక అవుతాయి.

ఎండిన.. నిత్యం పూల అందం ఇంట్లో ఉండాలంటే డ్రై ఫ్లవర్స్‌తో ప్రతి గదినీ అలంకరించుకోవచ్చు. గోడపై ఫ్రేంల్లో, భోజన బల్లపై ఇట్టే అమరిపోయే ఈ పూలలో ఎటువంటి రసాయనాలూ ఉండవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్