తేలిగ్గా తరగండి

కూరగాయలు తరగడానికి ఎన్నెన్నో పనిముట్లు. అయితే వాటినే మరింత సదుపాయంగా, సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్ది పని మరింత సులువయ్యేలా చేసేవెన్నో వస్తున్నాయి.

Published : 15 Jan 2023 00:44 IST

కూరగాయలు తరగడానికి ఎన్నెన్నో పనిముట్లు. అయితే వాటినే మరింత సదుపాయంగా, సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్ది పని మరింత సులువయ్యేలా చేసేవెన్నో వస్తున్నాయి. ఈ వెజిటబుల్‌ స్లైసర్‌ కూడా అలాంటిదే. ఒకప్పుడు చేత్తో తిప్పుతూ కొబ్బరిని తురిమే వాళ్లం. ఆ సాధనానికి ఆధునికత జోడించి అనేక కూరలను తరిగేలా చేశారు. దీనితో క్యారెట్‌, కీరా, ఆలూ, బీట్‌రూట్‌, సొర లాంటివన్నీ తేలిగ్గా తురిమేయొచ్చు. చేత్తో తిప్పేదే కనుక కరెంటు ఖర్చుండదు. ఇలా తరిగినవి వండటానికి, పచ్చివి తినడానికే కాదు, గార్నిష్‌కీ అందంగానూ ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్