ఒద్దికగా సర్దేద్దాం..

ఉదయం సాయంత్రం వంట అయితే  హడావిడిగా పూర్తి చేసేస్తాం. సమయానికి పూర్తవ్వాలనే కంగారులో ఎక్కడ తీసినవి అక్కడ పెట్టం. దాంతో అవి చెల్లాచెదురుగా ఉంటాయి.

Published : 02 May 2023 00:12 IST

ఉదయం సాయంత్రం వంట అయితే  హడావిడిగా పూర్తి చేసేస్తాం. సమయానికి పూర్తవ్వాలనే కంగారులో ఎక్కడ తీసినవి అక్కడ పెట్టం. దాంతో అవి చెల్లాచెదురుగా ఉంటాయి. తర్వాత వీటిని సర్దుకోవడం ఒక యుద్ధంలాంటిదే. అలా కాకుండా కిచెన్‌ను శుభ్రంగా సర్దుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి...

* వంటకి అత్యవసరమయ్యే గరిటెలు, పాత్రలను మాత్రం అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడో అవసరం అనిపించే వాటిని కప్‌బోర్డులో లోపలకి సర్దేయండి. వాడినవి ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సింకులో అంట్లు పేరుకుపోవు.

* పప్పులు, పిండులకు గాజు, స్టీలు డబ్బాలు ఒకటే సైజువి ఎంచుకుంటే చూడటానికీ అందంగా ఉంటాయి. స్టీలువైతే వాటిలో ఏ పిండి ఉందో చిన్న పేపర్‌ మీద రాసి అంటిస్తే సరి. వంట చేసేటప్పుడు కంగారు, అన్నీ వెతికే పని తప్పుతాయి.

* గాజు, పింగాణీ పాత్రలన్నింటినీ ఒకే కప్‌బోర్డ్‌లో సర్దుకోవాలి. ఇతర వస్తువులతో కలిపి పెట్టేస్తే.. కంగారులో ఇతర వస్తువులేవైనా తీసేటప్పుడు చేయి జారుతుంటాయి. ప్రేమగా కొనుక్కున్నవి పగిలిపోతే చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్త తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని