మొదట్లోనే నిరాశపడకండి..

ఎంతో ప్రేమగా మిద్దె తోటల్ని, బాల్కనీ గార్డెనింగ్‌ని ఏర్పాటు చేసుకొని వాటికి చాలా ఖర్చు చేస్తారు కొందరు. అవి మంచి ఫలితానివ్వకపోతే ఊరికే నిరాశకు గురవుతారు.

Updated : 19 May 2023 06:20 IST

ఎంతో ప్రేమగా మిద్దె తోటల్ని, బాల్కనీ గార్డెనింగ్‌ని ఏర్పాటు చేసుకొని వాటికి చాలా ఖర్చు చేస్తారు కొందరు. అవి మంచి ఫలితానివ్వకపోతే ఊరికే నిరాశకు గురవుతారు. కాస్త వేచి చూస్తే..అవి ఎదగడానికి కాయలూ, పూలూ రావటానికి ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది.

* మొక్క ఎదగకుండా చిన్నగా ఉండి పూలు లేకపోతే దానికి సూర్యరశ్మి తగలట్లేదని గుర్తుంచుకోండి. తగినంత నీరు అందక పోయినా పూలు, మొగ్గలు ఊరికే రాలిపోతుంటాయి.

* తుమ్మెదలు లేక పరాగసంపర్కం ఆలస్యం అవ్వటం వల్ల కూడా పండ్లు, కాయగూరలు ఉండవు. కాబట్టి పెయింట్‌ బ్రష్‌తో సున్నితంగా పువ్వులన్నింటిలోనూ తడుముతూ ఉండండి. అలాగే తక్కువ మొగ్గలు ఉన్నా అది పోషకలోపమున్న మట్టి వల్ల అని గుర్తించి దాన్ని మారుస్తూ ఉండండి.

* కాయలు తక్కువ పరిమాణంలో ఉంటే ముందుగా సూర్యకాంతిని, మొక్క మొదట్లో ఉన్న తేమని గమనించాలి. పొడిబారే మట్టి అయితే దాన్ని ఎక్కువ సార్లు తడపాలి. అలాగే మన వాతావరణానికి, ఉష్ణోగ్రతకు సరిపడే కాయల, పండ్ల మొక్కల్నే ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్