వెనిగర్‌తో శుభ్రం చేయండి

నేల, వంటగట్టు, స్నానాలగది.. ఇలా ఒక్కోదాన్నీ శుభ్రం చేయడానికి ఒక్కో లిక్విడ్‌ వాడుతుంటాం. వాటిల్లోని రసాయనాలతో ప్రమాదం కదా.. బదులుగా వైట్‌ వెనిగర్‌ ప్రయత్నించి చూడండి.

Published : 06 Jun 2023 00:08 IST

నేల, వంటగట్టు, స్నానాలగది.. ఇలా ఒక్కోదాన్నీ శుభ్రం చేయడానికి ఒక్కో లిక్విడ్‌ వాడుతుంటాం. వాటిల్లోని రసాయనాలతో ప్రమాదం కదా.. బదులుగా వైట్‌ వెనిగర్‌ ప్రయత్నించి చూడండి.

* ఒక వంతు నీళ్లకు, రెండు వంతుల వెనిగర్‌ కలిపి, స్ప్రే బాటిల్‌లో పోయండి. దాంతో అద్దాలు, కిటికీలను తుడిస్తే దుమ్ము, మరకలు పోవడమే కాదు.. మెరుస్తాయి కూడా!

* వంటగట్టు పదే పదే తుడుస్తుంటాం. శుభ్రంగా కనిపించడానికే కాదు.. బ్యాక్టీరియా వగైరా చేరతాయన్న భయమూ దానికి కారణమే. అరగ్లాసు చొప్పున వెనిగర్‌, నీళ్లు తీసుకుని, దానికి కొన్ని చుక్కల లిక్విడ్‌ సోప్‌ కలిపి తుడవండి. మొండి మరకలు పోతాయి. ఇంకా దుర్వాససలూ,  కీటకాల బెడదా ఉండదు.

* రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్‌కి చెంచా ఉప్పు కలిపి వాటర్‌ ట్యాప్‌లకు పట్టించి, రాత్రంతా వదిలేయాలి. ఉదయాన్నే నీటితో కడిగేస్తే సరి. నీటి మరకలు, వాటిపై పేరుకున్న తుప్పు వంటివన్నీ పోతాయి.

* స్నానాలగది గోడంతా సబ్బు మరకలతో నిండి, త్వరగా వదలవు. వైట్‌ వెనిగర్‌కు బేకింగ్‌ సోడా కలిపి, స్పాంజ్‌తో రుద్దండి. కొద్దిసేపయ్యాక రుద్ది కడిగితే మరకలు మాయం.

* టాయ్‌లెట్‌ కొద్దిరోజులకే రంగు మారడం గమనిస్తుంటాం కదా! దానిమీద వెనిగర్‌ని నేరుగా పోసి.. 2, 3 గంటలు వదిలేయండి. తర్వాత నీటితో రుద్ది కడిగేస్తే సరి. అయితే వెనిగర్‌ గాఢత పోవడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. త్వరగా వదలాలంటే ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌ని చల్లడం మేలు.

* గచ్చు తుడిచాక నేలమీద ఎండిన నీటి మరకలు కనిపిస్తుంటాయి. అరబకెట్‌ నీళ్లకి పావుకప్పు వెనిగర్‌ కలిపి తుడిచి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని