దిండ్లనూ ఉతకాలి..

దుప్పట్లూ, గలేబుల్ని ఉతుకుతాం. దిండ్లను మాత్రం తడిపితే పాడవుతాయనే భయంతో వదిలేస్తాం. కానీ.. నిత్యం తల, ముఖం నుంచి చేరే జిడ్డు, క్రిములూ వాటిని అతుక్కుని సూక్ష్మక్రిములకు ఆవాసంగా మారతాయి.

Published : 01 Aug 2023 00:40 IST

దుప్పట్లూ, గలేబుల్ని ఉతుకుతాం. దిండ్లను మాత్రం తడిపితే పాడవుతాయనే భయంతో వదిలేస్తాం. కానీ.. నిత్యం తల, ముఖం నుంచి చేరే జిడ్డు, క్రిములూ వాటిని అతుక్కుని సూక్ష్మక్రిములకు ఆవాసంగా మారతాయి. శ్వాసకోస సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి, వీటినీ పట్టించుకోవాలి. ఎలాగంటే..

దూది దిండ్లను వాడుతుంటే వారానికోసారైనా ఎండలో కనీసం నాలుగైదు గంటల పాటు ఉంచండి. వాటిని అటూ ఇటూ తిప్పి ఏదైనా కర్రతో కొడితే అందులో చేరిన దుమ్ము వదిలిపోతుంది. ఆపై వెనిగర్‌, బేకింగ్‌ సోడా కలిపిన మిశ్రమంలో ముంచిన వస్త్రంతో తుడవండి. ఆరాక వాడుకుంటే సరి.

ఫోమ్‌, స్పాంజ్‌ వంటి మిగిలిన రకాలను చక్కగా ఉతుక్కోవచ్చు. వీటిని వాషింగ్‌మెషిన్‌లో నేరుగా వేసేసుకోవచ్చు. చివర్లో రెండు చుక్కల లావెండర్‌ పరిమళాన్ని జల్లితే... దాన్నుంచి వచ్చే సువాసన హాయి నిద్రనిస్తుంది. అదే తలగడలను చేత్తో ఉతకాలనుకుంటే గోరువెచ్చని నీళ్లల్లో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, వెనిగర్‌, సర్ఫ్‌ వేసి ఓ అరగంటైనా నాననిచ్చి ఆపై శుభ్రం చేస్తే సరి. మురికితో పాటు సూక్ష్మక్రిములూ దూరమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని