ఒకే వరుసలో వర్ణభరితంగా..
మొక్కల పెంచాలని ఉన్నా, స్థలం లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే స్కై పాట్స్, టిప్సీ ప్లాంట్ టవర్స్ విధానం గురించి తెలుసుకోండి.
మొక్కల పెంచాలని ఉన్నా, స్థలం లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే స్కై పాట్స్, టిప్సీ ప్లాంట్ టవర్స్ విధానం గురించి తెలుసుకోండి. ఇంటిని పచ్చదనంతో నింపేయొచ్చు..
చిన్న బాల్కనీ అయితే ఎక్కువ కుండీలుంచలేం. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేద్దామనుకుంటే మూడు నాలుగు తొట్టెలకన్నా స్థలం సరిపోకపోవచ్చు. అటువంటప్పుడు స్కై పాట్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఒకే వరుసలో రెండుమూడు కుండీలను వేలాడదీసేలా ప్రత్యేక ఇనుపరాడ్ ఏర్పాటుతో వస్తున్న స్కైపాట్స్ తో..ఎక్కువ తొట్టెలు పట్టేలా చేసుకోవచ్చు. ఇనుపరాడ్‌తో కుండీలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ బేస్‌ను కదలకుండా బిగుతుగా ఉంచేలా స్క్రూల ఏర్పాటు ఉంటుంది. పూలమొక్కలు, మనీప్లాంట్‌లతో పుదీనా, కొత్తిమీర వంటివాటిని ఒకే వరుసలో పెంచుకోవచ్చు. సౌకర్యంగా, తక్కువ చోటులో ఎక్కువ మొక్కలుండేలా సర్దేయొచ్చు.
ఏటవాలుగా.. ఒక తొట్టె ఉన్నచోట ఆరేడు కుండీలు ఏటవాలుగా సర్దడాన్ని ‘టిప్సీ ప్లాంట్ టవర్స్’ అంటారు. ఈ విధానంతో నిండుగా ఒకే చోట రంగురంగుల పూలు విరబూస్తాయి. ఆ ప్రాంతమంతా రంగులమయంగా మారి ఇంటికి కొత్త అందాన్ని తెస్తాయి. స్థలాభావమనే భావన దూరమవుతుంది. ఈ విధానంలో అడుగు కుండీని పెద్దదిగా ఎంచుకోవాలి. ఇందులో పొడవాటి ఇనుపరాడ్‌ను ఉంచి కుండీలకు రంధ్రాలను చేసి వాటిని రాడ్ ఆధారంగా ఒకదానిపై ఒకటి ఏటవాలుగా సర్దాలి. మట్టితో నింపాక టేబుల్ రోజ్, చంద్రకాంతం వంటి మొక్కలను వేస్తే చాలు. అందమే అందం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.