మట్టి పాత్రలు బూజు పడుతున్నాయా...

ప్రస్తుత కాలంలో మట్టి పాత్రలపై చాలా మందిలో అవగాహన వచ్చింది. వాటిలో వండటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసి అందరూ మక్కువ చూపుతున్నారు. దీనిలో వండిన ఆహారం త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా, పాడవ్వకుండా ఉంటుంది.

Updated : 09 Aug 2023 16:44 IST

ప్రస్తుత కాలంలో మట్టి పాత్రలపై చాలా మందిలో అవగాహన వచ్చింది. వాటిలో వండటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసి అందరూ మక్కువ చూపుతున్నారు. దీనిలో వండిన ఆహారం త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా, పాడవ్వకుండా ఉంటుంది. సాంబార్‌ నుంచి చేపల పులుసు వరకు అన్నీ వీటిలో చేసేస్తున్నారు. రోజూ వాడే కొద్దీ వీటికి అంటుకున్న నూనె మరకలు, ఆహార పదార్థాలు అంత సులువుగా పోవు. కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా శుభ్రం చేయొచ్చు.

  • మట్టిపాత్రలను శుభ్రపరిచేప్పుడు సబ్బు వాడితే జిడ్డు వదిలినా వాసన పాత్రలకే ఉండిపోతుంది. వంటసోడా కలిపిన నీటిని పాత్రల్లో నింపి రెండు నిమ్మచెక్కలు వేసి స్టౌ పై పెట్టి మరిగించాలి. తర్వాత నీటిని ఒంపేసి మెత్తని పీచు, శనగపిండితో శుభ్రం చేస్తే సరి..
  • పాత్రలు బూజు పట్టకుండా ఉండాలంటే కడిగిన తర్వాత ఎండలో బాగా ఆరనివ్వాలి. తర్వాత కొబ్బరి నూనె రాసి కాగితం చుట్టి భద్రపరుచుకోవాలి. ఇలా కనీసం నెలకోసారైనా చెయ్యాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని