వాచీ రింగు పూల హంగు!

ఎన్ని నగలున్నా... చేతికి ఉంగరం, వాచీ లేకపోతే... ఏదో వెలితిగా భావించేవారు చాలా మందే! అలాంటివారిని మెప్పించేందుకు కొత్తగా వస్తున్నాయి ఫ్లోరల్‌ రింగ్‌ వాచీలు.

Published : 26 Mar 2024 01:49 IST

ఎన్ని నగలున్నా... చేతికి ఉంగరం, వాచీ లేకపోతే... ఏదో వెలితిగా భావించేవారు చాలా మందే! అలాంటివారిని మెప్పించేందుకు కొత్తగా వస్తున్నాయి ఫ్లోరల్‌ రింగ్‌ వాచీలు. ఉంగరం, వాచీ రెండింటినీ కలిపి ఒకే దానిలో ఇమిడ్చి.... అమ్మాయిల మనసు దోచేలా పూల ఆకృతిలో తీర్చిదిద్దిన ఈ ఫ్యాషన్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తరం స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా మారింది. ఈ పూల వాచీ రింగుకి రంగు రాళ్లు, సీజెడ్స్‌ వంటి అదనపు హంగులూ చేరి జిగేల్‌ మంటున్నాయి. పైగా వీటిని అడ్జస్ట్‌ చేసుకుంటూ మనకు నచ్చిన వేలుకి పెట్టుకునే వీలూ వుండటంతో చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారట! నచ్చితే మీరూ ప్రయత్నించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్