తెర సమయం తగ్గిద్దాం

కరోనా వల్ల పిల్లలు ఇళ్లకే పరిమతమయ్యారు. ఆన్‌లైన్‌ తరగతులు, వినోదం అన్నీ ట్యాబ్‌లు, మొబైళ్లు, కంప్యూటర్‌ తెరల మీదే. దాంతో అవసరానికి మించి ఎక్కువగానే అలవాటు పడ్డారు.

Published : 26 Jun 2021 01:15 IST

కరోనా వల్ల పిల్లలు ఇళ్లకే పరిమతమయ్యారు. ఆన్‌లైన్‌ తరగతులు, వినోదం అన్నీ ట్యాబ్‌లు, మొబైళ్లు, కంప్యూటర్‌ తెరల మీదే. దాంతో అవసరానికి మించి ఎక్కువగానే అలవాటు పడ్డారు. బలవంతంగా మాన్పించాలనుకుంటే మొండికేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే...

వారితో గడపండి: పిల్లలతో పెద్దలు ఒక్కోసారి సరిగా మాట్లాడకపోవడం, తగినంత సమయం కేటాయించలేకపోవడం వల్ల కూడా వీరు స్క్రీన్‌ టైమ్‌కి అలవాటు పడుతుంటారు. ముందు మీరు వాటికి దూరంగా ఉండండి. చిన్నారులతో తగినంత సమయం గడపండి.

ఆటలాడించండి: ఇప్పుడు పిల్లల ప్రపంచం నాలుగ్గోడలకే పరిమితం అయింది. వారు కాలక్షేపానికో, వినోదానికో టీవీలకు, కంప్యూటర్‌లకు అతుక్కుపోతున్నారు. ఆ సమయాన్ని వేరే వాటిపై మళ్లించడానికి ప్రయత్నించండి. ఇండోర్‌ గేమ్స్‌, హాబీలు వంటివి ఉత్సాహంగా ఉంచుతాయి. క్యారమ్స్‌, టేబుల్‌ టెన్నిస్‌, చెస్‌, పదవినోదం, దాగుడు మూతలు, స్కిప్పింగ్‌, మెట్లెక్కి దిగడం వంటివి ఏవైనా కావొచ్చు. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. సమయాన్ని చక్కగా వినియోగించుకునేలా చేస్తాయి.

సమయం నిర్దేశించండి: రోజువారీ ప్రణాళికతో పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుంది. ఇతర దినచర్యనూ సమయానికి అనుగుణంగా పూర్తిచేసినట్లే...టీవీ /ఫోన్‌ /కంప్యూటర్‌ వంటివి చూసేందుకు కేటాయించండి. అప్పుడు దానికి అలవాటు పడతారు. అలానే అది పెద్దల పర్యవేక్షణలోనే సాగాలి. అప్పుడు వారూ అదుపాజ్ఞల్లో చూస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్