Published : 25/07/2021 05:24 IST

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల్లో...

కొవిడ్‌ నేపథ్యంలో ఇంటర్వ్యూలూ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. మరి వాటికి హాజరై ఉద్యోగాన్ని సంపాదించుకోవడం ఓ ఛాలెంజ్‌ అంటున్నారు నిపుణులు. ఇందులో విజయం సాధించాలంటే ముందుగానే సిద్ధమవ్వాలని సూచిస్తున్నారు. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు.

కంప్యూటర్‌లో మీరు వినియోగించనున్న సాఫ్ట్‌వేర్‌ సరిగ్గా పనిచేస్తుందా లేదా ముందుగానే చెక్‌ చేసుకోవాలి. ఇంటర్వ్యూ మొదలవకముందు మీ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ రీస్టార్ట్‌ చేస్తే మంచిది. ఇలా చేస్తే మధ్యలో ఏదైనా ఎర్రర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు మీపై ఉండే లైటింగ్‌ను ముందుగానే అడ్జస్ట్‌ చేసుకోవాలి.

* ఆ సంస్థ గురించి ముందుగా అవగాహన తెచ్చుకోవాలి. దానికి సంబంధించిన అంశాలతోపాటు మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగ బాధ్యతల గురించి తెలిసుండాలి. వీటన్నింటినీ తెలుసుకోవాలంటే ఆ సంస్థ బ్లాగ్‌ లేదా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలి. అలాగే అందులోని ఉద్యోగుల అభిప్రాయాలు నెట్‌లో ఉంటే వాటినీ చదివితే మంచిది.

* మీ దరఖాస్తు కాపీ నకలును ఎదురుగా ఉంచుకోవాలి. ఇంటర్వ్యూలో భాగంగా మీరు పొందుపరిచిన అంశాలపై అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. మీ అనుభవాలను వారికి అర్థమయ్యేలా వివరించాలి. తక్కువగా మాట్లాడుతూ, వారేం చెబుతున్నారో ముందుగా విన్న తర్వాత సమాధానం చెప్పాలి. అవతలి వారు ఏవైనా పాయింట్్స నోట్ చేసుకోవాలని చెబితే అప్పుడు పెన్నూ, పేపర్‌ కోసం పరిగెత్తడం మంచి పద్ధతి కాదు. ముందే పక్కనే పుస్తకం, పెన్ను వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి. ఫోన్‌ని సైటెంట్‌ మోడ్‌లో పెట్టండి. వీటి వల్ల మధ్యలో అంతరాయం కలగదు. ఇంటర్వ్యూ చేసేవాళ్లకీ ఇబ్బంది కలగదు.

* దరఖాస్తులో అర్హతలన్నింటినీ పొందుపరిచాం కదా అని వాటి గురించి చెప్పడం మానేయకూడదు. ఆయా సంస్థల్లో మీరు సాధించిన విజయాలను, ప్రశంసలను చెప్పడం మర్చిపోకూడదు. వీటన్నింటితోపాటు మీకు ఉద్యోగ బాధ్యతలను అప్పగిస్తే సంస్థ అభివృద్ధిలో ఎలా పాలుపంచుకోనున్నారో కూడా చెప్పగలగాలి. అన్నింటికీ మించి మీ డ్రెస్సింగ్‌ హుందాగా ఉండాలి. కెమెరావైపు చూస్తూ మాట్లాడితే చాలు. మీరు విజయం సాధించొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి