ఇలాంటి వారితో జాగ్రత్త!

‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం’ అన్నాడో కవి. అయితే ఇది నిజమైన ప్రాణస్నేహితులకు మాత్రమే వర్తిస్తుంది. స్నేహం పేరిట ఎదుటివారిని ఇబ్బందిపెడతారు.

Published : 23 Aug 2021 01:40 IST

‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం’ అన్నాడో కవి. అయితే ఇది నిజమైన ప్రాణస్నేహితులకు మాత్రమే వర్తిస్తుంది. స్నేహం పేరిట ఎదుటివారిని ఇబ్బందిపెడతారు. మీ స్నేహితుల్లో ఇలాంటి వారున్నారా..

* కొంతమంది తమ స్వార్థం కోసం స్నేహితులను ఉపయోగించుకుంటారు. వారి పనుల కోసం ఆప్తులను పావులుగా వాడుకుంటారు. అవసరం తీరిన తరువాత ఆవల పెట్టేస్తారు. కాబట్టి మీ స్నేహితుల్లో అలాంటివారెవరైనా ఉంటే ఇప్పటి నుంచే వారికి దూరంగా  ఉండండి.

* ఇంకొంతమంది వాళ్ల దగ్గర ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ మథన పడుతుంటారు. ప్రతికూల ఆలోచనలతో నిండి ఉంటారు. వాటిని స్నేహితుల వద్ద ప్రదర్శిస్తూ ఉంటారు.

* కొంతమంది ఎప్పుడూ ఎదుటివారికి తమ బాధలను చెబుతూ ఉంటారు. ప్రపంచంలోని సమస్యలన్నీ తమవే అన్నట్లు మాట్లాడుతుంటారు. నిరాశా నిస్పృహలతో గడుపుతారు. చిన్న సమస్య ఉన్నా దాన్ని కొండంత పెద్దది చేసి అందరి నుంచి జాలి, దయలను ఆశిస్తుంటారు.

* మరికొందరుంటారు ఎప్పుడూ ఎదుటివారిని విమర్శించడం, తక్కువ చేసి మాట్లాడటం.... లాంటివి చేస్తుంటారు.  ఇలాంటి స్నేహితులు మీకు ఉన్నట్లయితే జాగ్రత్త సుమా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్