విజయం మీదే!

ఉద్యోగిగా చేసే పనితో పాటు కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. ఇవి మిమ్మల్ని ఉద్యోగిగా ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడంలో సాయపడతాయి. అవేంటో చూసేయండి మరి.

Updated : 30 Jan 2022 06:35 IST

ఉద్యోగిగా చేసే పనితో పాటు కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. ఇవి మిమ్మల్ని ఉద్యోగిగా ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడంలో సాయపడతాయి. అవేంటో చూసేయండి మరి.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌... నలుగురిలో ఎలాంటి బెరుకు, ఇబ్బంది లేకుండా మాట్లాడటం అనేది ఒక కళ. దీన్ని అలవరుచుకుంటే ఉద్యోగిగా మీకు మరింత ఉపయోగపడుతుంది.

సమయపాలన... ప్రతి ఒక్కరికి రోజుకు ఉండేది 24 గంటలే. మరి కొందరికి పనులే తెమలవు. మరికొందరేమో అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు ఎలా అంటే... సమయ పాలన. కాలం చాలా అమూల్యమైంది. కాబట్టి దాన్ని గౌరవించాలి. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయాలంటే ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేయాలి.

సానుకూలత... చుట్టూ ఎన్ని ప్రతికూలతలున్నా మీరు మాత్రం సానుకూలతనే ఆయుధంగా ధరించాలి. ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకోవాలి. మిమ్మల్ని మీరు అనునిత్యం ఆ విధంగా ప్రేరేపించుకోవాలి.

ఆత్మవిశ్వాసం... ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధింగలరు. విజయం కోసం అనునిత్యం శ్రమించాలి. అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినా... అదే ఆత్మవిశ్వాసంతో మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి.

నిజాయతీ... చదువు, ఉద్యోగం, వ్యాపారం... చేసే పని ఏదైనా అందులో నిజాయతీ ఉండాలి. పారదర్శకత కనిపించాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు.

నేర్చుకోవడం... ఇది నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారు.

నో చెప్పడం...  దీన్ని చెప్పలేక ఆందోళన, ఒత్తిడికి గురవుతారు. అలాంటి ఇబ్బంది మీకూ ఉంటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేయండి. మీరు చేయలేని, మీ వల్ల కాని, మీకు సంబంధం లేని పనులు ఇతరుల గురించో, మొహమాటంతోనో నెత్తిన వేసుకోవద్దు. మృదువుగా కాదని చెప్పండి. అలాగే ఎందుకు చేయలేరో కూడా కారణం వివరిస్తే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్