సులువుగా పెట్టేసుకోవచ్చు..

స్నేహితురాలి పెళ్లికి వెళ్లాలి. అలంకరణ అంతా పూర్తయింది. ఇక బ్రేస్‌లెట్‌ ఒక్కటీ పెట్టుకుంటే అయిపోతుంది. ఒక చేత్తో గొలుసు పట్టుకుని హుక్‌కి తగిలించడానికి ఇబ్బంది పడుతోంది రమ్య. ఇలాంటి సందర్భం మనలో ప్రతి ఒక్కరికీ అనుభవమే. అయితే ఫొటోలో కనిపిస్తున్న

Updated : 01 Feb 2022 04:08 IST

స్నేహితురాలి పెళ్లికి వెళ్లాలి. అలంకరణ అంతా పూర్తయింది. ఇక బ్రేస్‌లెట్‌ ఒక్కటీ పెట్టుకుంటే అయిపోతుంది. ఒక చేత్తో గొలుసు పట్టుకుని హుక్‌కి తగిలించడానికి ఇబ్బంది పడుతోంది రమ్య. ఇలాంటి సందర్భం మనలో ప్రతి ఒక్కరికీ అనుభవమే. అయితే ఫొటోలో కనిపిస్తున్న ‘బ్రేస్‌లెట్‌ బడ్డీ’ని తెచ్చేసుకోండి. ఈ జ్యూవెలరీ హెల్పర్‌తో ఎవరి సాయం లేకుండా బ్రేస్‌లెట్‌, వాచీ లాంటివి సులువుగా పెట్టుకోవచ్చు.

బ్రేస్‌లెట్‌, వాచీ చివరి కొనను దీని కొక్కానికి తగిలించి చేతిని గాజులా ఉన్న పరికరంలో పెట్టి హుక్‌ పెట్టుకుంటే చాలు. సమయమూ మించిపోదు. విలువైనవి కిందపడి పాడవుతాయేమోనన్న భయమూ ఉండదు. బాగుంది కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్