ఏది పడితే అది వాడితే...

రచితకు స్నేహితులు చెప్పిన క్రీం, ఫౌండేషన్‌ను వాడగానే ముఖంపై మొటిమలు, అలర్జీ మొదలయ్యాయి. కాస్మొటిక్స్‌ అన్నీ.. అందరి చర్మానికీ సరిపడవంటున్నారు సౌందర్య నిపుణులు. కొన్నింటిలో ఉండే రసాయనాలు ప్రమాదకరమైన చర్మ సమస్యలనూ.

Published : 29 Mar 2022 01:30 IST

రచితకు స్నేహితులు చెప్పిన క్రీం, ఫౌండేషన్‌ను వాడగానే ముఖంపై మొటిమలు, అలర్జీ మొదలయ్యాయి. కాస్మొటిక్స్‌ అన్నీ.. అందరి చర్మానికీ సరిపడవంటున్నారు సౌందర్య నిపుణులు. కొన్నింటిలో ఉండే రసాయనాలు ప్రమాదకరమైన చర్మ సమస్యలనూ.. తెచ్చిపెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అందుకే మీ చర్మతత్వంతోపాటు ఆ ఉత్పత్తిలో రసాయనాలు ఏమేరకు ఉన్నాయో చూసుకుని కొనాలని సూచిస్తున్నారు.

మీ తెలుసుకోకుండా సౌందర్యోత్పత్తులను వాడితే ఎన్నో సమస్యలూ ఎదురవుతాయి. అందుకే ఎంపిక చేసుకున్న ఉత్పత్తికి పరీక్షగా ముందు చిన్న ప్యాకెట్‌ లేదా శాంపిల్‌ను తీసుకోవాలి. చర్మంపై కొద్ది ప్రాంతంలో దాన్ని అప్లై చేసి 24 గంటలు ఉంచి చూసుకోవాలి. ఈ స్వీయ పరీక్షలో ఆ ఉత్పాదన మీ చర్మానికి పడుతుందో లేదో తెలిసిపోతుంది.

బ్రాండ్‌ మారి... కొందరు ఏళ్ల తరబడి ఒకే క్రీం లేదా ఫౌండేషన్‌ వాడుతుంటారు. ఎప్పుడైనా అది దొరకలేదంటే వెంటనే కొత్త ఉత్పత్తిని తీసుకుంటారు. కొత్తది కావడంతో చర్మానికి అది సరిపడకపోవచ్చు. ఇటువంటప్పుడు కూడా ముందుగా శాంపిల్‌ వినియోగించి చూడటం మంచి పద్ధతి. లేకపోతే కొన్ని సందర్భాల్లో అందులోని కఠినమైన రసాయనాలు చర్మంతోపాటు నేత్ర సమస్యలనూ తెచ్చిపెట్టొచ్చు.

ఆలోచించి.. ఐలైనర్‌, మస్కారా, ఐషాడో వంటివి కొత్తవి ఎంపిక చేసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ముందుగా చెక్కిళ్లపై లేదా చెవుల వద్ద కొద్దిగా అప్లై చేసి పరీక్షించుకోవాలి. అక్కడ ఎలాంటి ఎలర్జీ రాకపోతేనే తీసుకోవాలి. దురద, మంట లేదా కంటి నుంచి నీరు కారుతున్నట్లు అనిపిస్తే దాన్ని వాడకపోవడం మంచిది.

రసాయనాలతో... క్రీం, లోషన్‌, షాంపూ, మేకప్‌ ఉత్పత్తుల్లో ఆల్కహాల్‌, నికెల్‌, కార్బన్‌, స్టెరాయిడ్స్‌, హెవీ మెటల్స్‌, ఫ్రాగ్రెన్స్‌, సింథటిక్‌ కలర్స్‌, పెట్రోలియం వంటివెన్నో కలిపి తయారుచేస్తున్నారు. అలాగే పరిమళద్రవ్యాలు, హెయిర్‌ స్ప్రేలు, మాయిశ్చరైజర్లు, కండిషనర్లు, గోళ్లరంగు వంటి వాటిలోనూ పలురకాల ఘాటైన రసాయనాలు వినియోగిస్తున్నారు. ఇవి అలర్జీలే కాదు, రొమ్ము క్యాన్సర్‌, సంతానలేమి వంటి వాటికీ దారి తీయొచ్చు. తస్మాత్‌ జాగ్రత్త.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్