Updated : 27/04/2022 14:12 IST

ఆఫీసుకు వెళ్లాల్సిందేనా?

నాలుగేళ్ల క్రితం క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నా. దీంతో బయట తిరగడం కొద్దిగా కష్టం. ఇప్పుడు ఆఫీసులు మొదలయ్యాయి. నేనేమో ఇంటి నుంచే చేస్తానన్నా. కానీ మా బాస్‌ ఒప్పుకోవడం లేదు. ఆఫీసుకు వెళ్లాల్సిందేనా?

- ఓ సోదరి

ముందు హెచ్‌ఆర్‌ పాండమిక్‌ పాలసీల గురించి తెలుసుకోండి. వాటి ప్రకారం మీ పరిస్థితి ‘రీజనబుల్‌ అకామడేషన్‌’ కిందకి వస్తుందేమో చూసుకోండి. అలాగైతే మీకు ఇంటి నుంచి పని సౌకర్యం ఉంటుంది. నిజానికి గతంలో సంస్థలు ఫిజికల్‌గా పనిచేస్తున్నప్పుడు వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం లేదు. కరోనా తర్వాత... వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ విధానానికి అంగీకరించాయి. ఒకవేళ మీ బాస్‌ ‘ఆఫీసుకు రావాల్సిందే’ అంటే.. ఆయన్ని కలవడానికి సమయం అడగండి. ఆఫీసుకు వెళ్లడం వల్ల మీకు కలిగే అనారోగ్య ఇబ్బందుల్ని వివరించండి. మీ మెడికల్‌ రిపోర్టులను, సర్టిఫికెట్లనీ తీసుకెళ్లండి. వీలుంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశమివ్వమని అడగండి. పనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందీ కలిగించననీ, సకాలంలో అన్నీ పూర్తి చేస్తానన్న భరోసానివ్వండి. ఇంత చేసినా సానుకూల స్పందన రాకపోతే హెచ్‌ఆర్‌ విభాగాన్ని కలవండి. వాళ్లే పరిష్కారాన్ని సూచిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని