అప్పుడు చెప్పాలనుకున్నది మర్చిపోతున్నాను.. ఏం చేయాలి?

హాయ్ మేడమ్‌.. నేను ఆరేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నా.. ఏ పని ఇచ్చినా చేస్తాను.. బాగా కష్టపడతాను. కానీ చేసిన వర్క్ ఈమెయిల్ చేయమంటే మాత్రం భయం. ఒక్కరు లేదా ఇద్దరికి పెట్టమంటే ఫర్వాలేదు. ఎక్కువమందికి గ్రూప్ మెయిల్ చేయాలంటే మాత్రం...

Published : 01 Jun 2022 17:59 IST

హాయ్ మేడమ్‌.. నేను ఆరేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నా.. ఏ పని ఇచ్చినా చేస్తాను.. బాగా కష్టపడతాను. కానీ చేసిన వర్క్ ఈమెయిల్ చేయమంటే మాత్రం భయం. ఒక్కరు లేదా ఇద్దరికి పెట్టమంటే ఫర్వాలేదు. ఎక్కువమందికి గ్రూప్ మెయిల్ చేయాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది. అలాగే ఆఫీస్‌లో ఇతరులతో మాట్లాడటం, చేసిన వర్క్ గురించి వివరించడం.. ఒకరిద్దరితో అయితే ఓకే! కానీ గ్రూప్ మీటింగ్స్‌లో మాట్లాడాలంటే గుండె దడ వచ్చేస్తుంది. బాగా నెర్వస్ ఫీలవుతాను. కొన్నిసార్లు ముందే ప్రాక్టీస్ చేసుకొని వెళ్తాను. అప్పుడు ఫర్వాలేదు. కొన్ని సమయాల్లో అప్పటికప్పుడు సందర్భానుసారంగా చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు అందరినీ చూస్తే భయం వేస్తుంది. దాంతో చెప్పాలనుకున్నది కూడా మర్చిపోతాను. ప్రస్తుతం నేను ఒక చిన్న టీమ్‌ని లీడ్ చేస్తున్నాను. అందులో ఒక యూరోపియన్ అమ్మాయి ఉంది. తనకు అనుభవం తక్కువే అయినా నన్ను డామినేట్ చేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? నా భయాన్ని తగ్గించుకుని, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి తగిన చిట్కాలు చెప్పగలరు. - ఓ సోదరి

జ. మీరు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన సమస్య ఎదుర్కొంటున్నట్టు మీ ఉత్తరం ద్వారా అర్థమవుతోంది. ఆసక్తితో కష్టపడితే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం చాలా సులువు. అయితే దీనికోసం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్యా చిన్న బేధం ఉంది. ఆత్మ విశ్వాసం అన్నది మనం ఇతరులకు చూపించేది. ఆత్మగౌరవం అనేది మనలో ఉండేది. ఆత్మగౌరవం పెంచుకోవడం అనేది జీవితాంతం కొనసాగాల్సిన ప్రక్రియ. ఎప్పటికీ దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలి. ఈమెయిల్స్, మీటింగుల విషయంలో మీరు ఎదుర్కొనే సమస్య నెర్వస్‌నెస్.. ఇది మీ మీద మీకు నమ్మకం లేకపోవడాన్ని చూపిస్తుంది. మీరు ఆత్మగౌరవాన్ని పెంచుకుంటే ఇది దూరమవుతుంది. ఆత్మగౌరవాన్ని పెంచుకోవడం కోసం ప్రతి విషయం మీద ఆసక్తితో అవగాహన పెంచుకోవడం అవసరం. మన కంఫర్ట్‌జోన్‌ని మనం ఎంత పెంచుకుంటామో అంతగా సక్సెస్ సాధిస్తాం. మీరు గ్రూప్‌లో మాట్లాడడానికి భయపడుతున్నారని నిరుత్సాహ పడకండి. ఇది ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంది. కానీ దాన్ని వారు ఎదుర్కొనే తీరే వారిలో భయాన్ని పోగొడుతుంది. మీరు ఇలాంటివి ఎక్కువగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ప్రతిసారీ దానికి తగిన ప్రిపరేషన్‌తో వెళ్లండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ జరగాలంటే ముందు మీ గురించి మీరు పాజిటివ్‌గా ఆలోచించడం ప్రారంభించాలి. మీతో మీరు మంచి సంబంధం కలిగి ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్