ఏకైక మహిళా బాస్‌ని!

ఉద్యోగంలో 17 ఏళ్ల అనుభవం. మొదటిసారి 30 మందికి పైగా ఉండే సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ టీమ్‌కి నాయకత్వం వహించబోతున్నా. ఉత్సాహం, భయం రెండూ కలుగుతున్నాయి. మా సంస్థలో దక్షిణ భారత దేశంలోనే నేను ఏకైక మహిళా బాస్‌ని. ఎలా నెట్టుకొస్తానన్న దానిపైనే అందరి దృష్టీ.

Updated : 29 Jun 2022 12:50 IST

ఉద్యోగంలో 17 ఏళ్ల అనుభవం. మొదటిసారి 30 మందికి పైగా ఉండే సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ టీమ్‌కి నాయకత్వం వహించబోతున్నా. ఉత్సాహం, భయం రెండూ కలుగుతున్నాయి. మా సంస్థలో దక్షిణ భారత దేశంలోనే నేను ఏకైక మహిళా బాస్‌ని. ఎలా నెట్టుకొస్తానన్న దానిపైనే అందరి దృష్టీ. నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మహిళా బాస్‌ల్లో ఉండే సానుకూలాంశాల గురించి చెప్పగలరా?

- నీలిమ

నాయకత్వ స్థానాన్ని అందుకున్నందుకు అభినందనలు. మహిళలకు సహజంగానే కొన్ని సానుకూలతలు ఉంటాయి. కాబట్టి కంగారు అవసరం లేదు. అవేంటంటే...

* సహానుభూతి.. మగవారితో పోలిస్తే మనలో ఇదెక్కువ. అవతలి వ్యక్తి పరిస్థితిలో మనముంటే అన్న కోణంలో ఆలోచిస్తాం. కనుక వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ ప్రాధాన్యం మనకు బాగా తెలుసు.

* పక్షపాతముండదు.. ఆఫీసు విషయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే న్యాయం ఉన్నవారివైపే మొగ్గు చూపుతారు. కష్టపడేవారు ఎదిగేలా సాయం చేస్తారు. ఈ విషయంలో మగ వారు తమకు అనుకూలంగా ఉన్నవారివైపు ముఖ్యంగా మగవారివైపు లేదా అందమైన అమ్మాయిల వైపు మొగ్గే అవకాశమెక్కువ.

* కమ్యూనికేషన్‌.. ఎవరితోనైనా సంభాషణ జరపగల నైపుణ్యం ఆడవాళ్లది. వ్యక్తిగత విషయాల పరిధులపై వీరికి స్పష్టత ఎక్కువ. పని ఒత్తిడి గురించీ త్వరగా బయటపడరు. పని మధ్యలో భావోద్వేగాలు రాకుండా జాగ్రత్తపడతారు.

* ఒకే సమయంలో ఎన్నో.. మల్టీటాస్కింగ్‌కి అమ్మలేగా ఉదాహరణ. కచ్చితంగా, వేగవంతంగా చేయడంలోనూ మనమే ముందు. ఫోన్‌ కాల్‌ మాట్లాడుతూ మీటింగ్‌కు సిద్ధమవడం, ఈమెయిల్‌ చెక్‌ చేయడం వంటివి ఎన్ని చేసుంటారు?

* ఇందులోనూ ముందే.. తమని తాము అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఆడవాళ్లలో ఎక్కువ. సానుకూల ఫలితాల కోసం ఎంతకైనా కష్టపడతారు. పక్కవాళ్లూ అభివృద్ధి చెందాలని ఆశిస్తారు.

* సమయ పాలన.. ఒకే సమయంలో ఎన్నో పనులు చేసేవారికి ఎంత సమయంలో ముగించగలమన్న దానిపైనా అవగాహన ఉంటుంది. కొద్ది కాలం పోతే దీనిపై అవగాహన వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏకబిగిన పనిచేసినా అలసిపోకుండా కనిపించడమూ మనకుండే సానుకూలతే! కాబట్టి, ధైర్యంగా ముందుకు సాగండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని