క్రాష్‌ డైట్‌ అంటే...

నా వయసు 40. బరువు 78కిలోలు. బరువు తగ్గాలనుకుంటున్నా. ఈ మధ్య నా స్నేహితులంతా సన్నబడటానికి క్రాష్‌డైట్‌ మొదలుపెట్టారు.

Updated : 23 May 2024 17:18 IST

నా వయసు 40. బరువు 78కిలోలు. బరువు తగ్గాలనుకుంటున్నా. ఈ మధ్య నా స్నేహితులంతా సన్నబడటానికి క్రాష్‌డైట్‌ మొదలు పెట్టారు. అసలీ క్రాష్‌డైట్‌ అంటే ఏమిటి? నేనూ చేయొచ్చా?

కల్యాణి, విజయవాడ

క్రాష్‌డైట్‌ లేదా జోన్‌ డైట్‌ అమెరికాలో చాలా పాపులర్‌. దీనివల్ల బరువుతో పాటు వృద్ధాప్య ఛాయలూ తగ్గుతాయి. అయితే దీనికి వారు కొన్ని ఆహారనియమాలు పాటిస్తారు.. సాధారణంగా ఈ డైట్‌చార్ట్‌లో 40శాతం కార్బోహైడ్రేట్లు, 30శాతం కొవ్వులు, 30శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఇది కూడా వాళ్ల శరీర తీరుని బట్టి అంటే.. కొవ్వు, ఎముకలు, కండరాల కూర్పుని బట్టి నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా రోజుకి మూడుసార్లు మీల్స్, రెండుసార్లు స్నాక్స్‌ తీసుకుంటారు. మనదేశంలో ఇది చేసేవారు అన్నం, నూనెలను పూర్తిగా మానేయాలి. వీటికి బదులుగా పొట్టుతో ఉన్న పప్పు దినుసులు.. బొబ్బర్లు, శనగలు, పెసలు, రాజ్మా, అలసందలు తీసుకోవాలి. కాయగూరల్లో బెండకాయ, క్యాబేజీ, బీన్స్, టొమాటో వంటివాటిలో కార్బోహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకర కొవ్వుల కోసం అవిసెగింజల పొడి, నువ్వులు, బాదం, గుమ్మడి గింజలు వంటివి తీసుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌ని వెజిటబుల్‌ సలాడ్స్‌తో కలిపి తీసుకుంటే మంచిది. వీటితోపాటు తక్కువ కొవ్వులుండే పాలు, చీజ్, పనీర్, హై ప్రొటీన్‌ ఉండే బటర్‌ మిల్క్‌లు దొరుకుతున్నాయి. వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీన్ని పోషకాహార నిపుణుల సలహా మేరకు బాడీ కంపోజిషన్‌ టెస్ట్‌ చేయించుకున్నాక మాత్రమే అనుసరించాలి. ఎందుకంటే కొందరి శరీరంలో చెడు కొవ్వులు ఎక్కువగానూ, కండర సామర్థ్యం తక్కువగానూ ఉంటాయి. మరికొందరిలో కండరాలు ఎక్కువగానూ, చెడు కొవ్వులు తక్కువగానూ ఉంటాయి. అందువల్ల తీసుకునే ఆహార నియమాలు, పరిమాణాలు మారుతుంటాయి. కాబట్టి నిపుణులను తప్పక సంప్రదించాలి. వీటితోపాటు వ్యాయామాలూ చేయాలి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్