డెలివరీ తర్వాత.. మళ్లీ బిగుతుగా మారాలంటే..!

నాకు మూడుసార్లు నార్మల్ డెలివరీనే అయింది. దాంతో నా వెజైనా వదులుగా మారింది. మళ్లీ బిగుతుగా మారేందుకు ఏమైనా మార్గాలుంటే (చికిత్సలు/క్రీమ్స్‌/జెల్స్.. మొదలైనవి) చెప్పగలరు....

Published : 17 Aug 2023 20:14 IST

నాకు మూడుసార్లు నార్మల్ డెలివరీనే అయింది. దాంతో నా వెజైనా వదులుగా మారింది. మళ్లీ బిగుతుగా మారేందుకు ఏమైనా మార్గాలుంటే (చికిత్సలు/క్రీమ్స్‌/జెల్స్.. మొదలైనవి) చెప్పగలరు. - ఓ సోదరి

జ. సహజ ప్రసవాల తర్వాత కొంతవరకు వెజైనా వదులు కావడం సహజం. దీనికి క్రీమ్స్‌, జెల్స్‌ వంటివేవీ పని చేయవు. ఈ క్రమంలో- ముందుగా మీరు కీగల్‌ (Kegel) వ్యాయామాలు సాధన చేయాలి. కటి వలయం, గర్భాశయం, యోని చుట్టూ ఉండే కండరాల బలం పెరగడానికి తోడ్పడే ప్రత్యేకమైన వ్యాయామాలివి.
అంతకంటే ముందుగా ఓసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వారు పరీక్ష చేసి.. వెజైనా ఎంత వదులుగా ఉందో చూసి.. దాన్ని బట్టి ఎటువంటి వ్యాయామాలు చేయాలో సూచిస్తారు. ఇందుకోసం ఫిజియోథెరపిస్ట్‌ దగ్గరికి పంపిస్తారు. దాని వల్ల కూడా ఫలితం లేకపోతే ఆపరేషన్‌ చేసి వదులైన కండరాలను దగ్గరికి తెచ్చి తిరిగి కుట్లు వేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్