కిస్‌మిస్‌తో కొండంత ఆరోగ్యం..!

ఇంట్లో పాయసం, పరమాన్నం.. వంటివి చేసినప్పుడు అందులో కిస్‌మిస్‌/ఎండు ద్రాక్ష వేయడం మనకు అలవాటే! అయితే వీటిని తింటే బరువు పెరుగుతామోనన్న భయం కొందరిలో ఉంటుంది. కానీ మితంగా తింటే కిస్‌మిస్‌ వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

Published : 30 Oct 2023 12:30 IST

ఇంట్లో పాయసం, పరమాన్నం.. వంటివి చేసినప్పుడు అందులో కిస్‌మిస్‌/ఎండు ద్రాక్ష వేయడం మనకు అలవాటే! అయితే వీటిని తింటే బరువు పెరుగుతామోనన్న భయం కొందరిలో ఉంటుంది. కానీ మితంగా తింటే కిస్‌మిస్‌ వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

పోషకాలు మెండుగా ఉండే ఆహార పదార్థాల్లో కిస్‌మిస్‌ కూడా ఒకటి. రక్తంలో ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా జరగాలంటే ప్రొటీన్లు అవసరం. ఈ పోషకం ఎక్కువగా ఉండే కిస్‌మిస్‌ ఇందుకు దోహదం చేస్తుంది. అలాగే ఇందులో ఐరన్‌ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల హెమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. ఇక పొటాషియం, ఫైటో న్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లూ ఎండ ద్రాక్షలో ఎక్కువగానే ఉంటాయి.

ఆకలిగా ఉన్నప్పుడు, అలసటగా అనిపించినప్పుడు కిస్‌మిస్‌ తింటే తక్షణ శక్తిని పొందచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్లు, సహజసిద్ధమైన చక్కెరలు పుష్కలంగా ఉండడమే దీనికి కారణం. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే అలవాటు ఉన్న వారు కిస్‌మిస్‌ తీసుకోవడం వల్ల అలసట దరిచేరకుండా, శక్తిని కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు.

ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి ‘బోరాన్‌’ అనే పదార్థం చాలా అవసరం. ఇది కిస్‌మిస్‌లో ఎక్కువగా దొరుకుతుంది. ఎముకలకు దృఢత్వాన్ని అందించడంతో పాటు మెనోపాజ్‌ దశలో ఎదురయ్యే ‘ఆస్టియోపొరోసిస్‌’ సమస్యను నివారించడంలో ఇది సమర్థంగా పనిచేస్తుంది.

దంతక్షయం, పళ్లు పుచ్చిపోవడం, పెళుసుబారడం.. వంటి సమస్యలకు చెక్‌ పెట్టాలంటే కిస్‌మిస్‌ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. కిస్‌మిస్‌లో ఉండే ఔషధ గుణాలు నోటి బ్యాక్టీరియాను నిర్మూలించి, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

కిస్‌మిస్‌లో ఉండే విటమిన్‌ ‘ఎ’, బీటా కెరోటిన్‌, బీటా కెరోటినాయిడ్‌.. వంటి పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బయోటిక్‌ గుణాలు వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడి జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్