పాదాలు కోమలంగా...

సందర్భానుసారంగా ఫ్లాట్స్‌, వెడ్జెస్‌, హీల్స్‌ అంటూ రకరకాల చెప్పులు వేసుకుంటాం. వాటికి తగినట్లుగా పాదాలు అందంగా కనిపించాలిగా. మరి దానికోసం ఏం చేయాలి అంటారా? ఇది చదివేయండి మీకే తెలుస్తుంది.

Updated : 17 Nov 2022 14:14 IST

పాదాలు కోమలంగా...

సందర్భానుసారంగా ఫ్లాట్స్‌, వెడ్జెస్‌, హీల్స్‌ అంటూ రకరకాల చెప్పులు వేసుకుంటాం. వాటికి తగినట్లుగా పాదాలు అందంగా కనిపించాలిగా. మరి దానికోసం ఏం చేయాలి అంటారా? ఇది చదివేయండి మీకే తెలుస్తుంది.

* పరిశుభ్రంగా: పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపించకపోవడానికి మురికి కూడా ఒక కారణమే. బయటి నుంచి ఇంటికి వచ్చాక తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవాలి. కేవలం నీళ్లతో కాకుండా హ్యాండ్‌వాష్‌ లిక్విడ్‌తో కాళ్లను శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మురికి పూర్తిగా వదిలిపోతుంది.

* తేమగా: పాదాలను తేమగా ఉంచుకోవాలి కదాని ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవడం పొరబాటు. కాళ్లు కడుక్కున్న వెంటనే మెత్తటి పరిశుభ్రమైన వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి. అలానే రోజూ రాత్రి పడుకోబోయే ముందు తప్పనిసరిగా కాళ్లకు మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. కాళ్లు తేమగా, ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తాయి.

* మర్దనతో: పాదాలకూ ఎప్పటికప్పుడు సాంత్వన అందాలి. అందుకే రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని బాదం నూనెతో అరికాళ్లకు, గోళ్లకు రాసి మృదువుగా మర్దన చేయాలి. తగిన తేమ అందడంతో పాటు, రక్తప్రసరణా సక్రమంగా జరిగి సాంత్వన లభిస్తుంది. అలానే పచ్చగడ్డిలో నడిచినా, గోరువెచ్చని నీళ్లల్లో కాసేపు ఉంచినా కూడా పాదాలపై పడిన ఒత్తిడి దూరమవుతుంది. హాయిగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్