పాలపొడితో మెరిసే మోము..!

మేనిఛాయ పెరగడానికి, మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్ వంటివి తగ్గించడానికి చాలామంది మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఫెయిర్‌నెస్ క్రీములు, ఇతర ఉత్పత్తులు వాడుతుంటారు. వీటివల్ల మన అందం పెరగడమేమో గానీ అది చర్మానికి సరిపడకపోతే ర్యాషెస్, దురదలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి రసాయన ఉత్పత్తులకు......

Updated : 16 Mar 2022 20:06 IST

మేనిఛాయ పెరగడానికి, మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్ వంటివి తగ్గించడానికి చాలామంది మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఫెయిర్‌నెస్ క్రీములు, ఇతర ఉత్పత్తులు వాడుతుంటారు. వీటివల్ల మన అందం పెరగడమేమో గానీ అది చర్మానికి సరిపడకపోతే ర్యాషెస్, దురదలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి రసాయన ఉత్పత్తులకు బదులుగా మనకు అందుబాటులో ఉండే పాలపొడితో ఫేస్‌ప్యాక్ వేసుకోవడం ద్వారా చక్కటి సౌందర్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు. అలాగే సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలను పొందే వీలుంటుంది. మరి, పాలపొడితో ఫేస్‌ప్యాక్స్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం రండి..

నిమ్మరసంతో కలిపి..

పాలపొడి మేనిఛాయను మెరుగుపర్చడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం టేబుల్‌స్పూన్ పాల పొడిలో రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడకు రాసి పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ముఖం కడిగేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చర్మఛాయ పెరగడమే కాదు.. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి చర్మంపై ఎక్కువగా ఉండే జిడ్డు కూడా తొలగిపోతుంది.

బొప్పాయితో చేర్చితే..

బొప్పాయిలో పాలపొడిని కలిపితే అది క్లెన్సర్‌లా పనిచేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే చక్కటి మెరుపును సైతం అందిస్తుంది. దీనికోసం టేబుల్ స్పూన్ చొప్పున పాలపొడి, బొప్పాయి పండు గుజ్జు తీసుకొని రెండింటినీ కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీనిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ని కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

పొడిబారే చర్మం కోసం..

పాలపొడిలో ఉండే గుణాలు చర్మానికి మంచి మెరుపు అందించడమే కాదు.. చర్మకణాలను పునరుత్తేజితం చేస్తాయి. దీనికోసం తేనెలో పాలపొడిని కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకొని కాసేపు మర్దన చేసుకోవాలి. ఆపై అరగంట సేపు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

మృతకణాలు తొలగించేందుకు..

పాలపొడి చక్కటి స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. చర్మానికి పోషణ అందించి మెరిసేలా చేస్తుంది. దీనికోసం కొన్ని వాల్‌నట్స్ తీసుకొని పొడిచేసుకోవాలి. ఇలా పొడి చేసేటప్పుడు పూర్తిగా మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పాలపొడి, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంతో కాసేపు చర్మాన్ని మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట పాటు ఆరనిచ్చి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

బ్లీచ్‌గానూ పనిచేస్తుంది..

పాలపొడి సహజసిద్ధమైన బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఇది మేనిఛాయను మెరుగుపర్చడమే కాదు.. మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను సైతం తగ్గిస్తుంది. దీనికోసం రెండు టీస్పూన్ల పాలపొడిలో నాలుగు టీస్పూన్ల కీరా రసం కలపాలి. ఇందులో కొద్దిగా నిమ్మతొక్కల పొడి వేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని పావుగంట పాటు ఆరనిచ్చిన తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే సరి. ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికోసారి వేసుకోవడం వల్ల మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలు తగ్గిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్