ఛాతీ పరిమాణం పెరగాలంటే..!
మగువల అందంలో వక్షోజాలది కీలక పాత్ర. అయితే తక్కువ బరువు, జన్యుపరమైన కారణాలు, జీవనశైలి.. ఇలా పలు కారణాల వల్ల కొంతమందిలో వాటి ఆకృతి, పరిమాణం ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉంటాయి.
మగువల అందంలో వక్షోజాలది కీలక పాత్ర. అయితే తక్కువ బరువు, జన్యుపరమైన కారణాలు, జీవనశైలి.. ఇలా పలు కారణాల వల్ల కొంతమందిలో వాటి ఆకృతి, పరిమాణం ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉంటాయి. దీంతో వారు ఆత్మన్యూనతా భావానికి గురవుతుంటారు. అయితే వీటి పరిమాణాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం పలు చికిత్సలు సైతం అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా తీసుకునే ఆహారం, జీవనశైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా సహజంగానే ఛాతీ పరిమాణం పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
మహిళల జీవిత కాలంలో స్తనాల పరిమాణం సుమారు ఆరుసార్లు మారుతుందని చెబుతున్నారు నిపుణులు. గర్భం ధరించిన తర్వాత, పిల్లలకు పాలిచ్చే క్రమంలో అవి పూర్తిగా పరిణతి చెందుతాయంటున్నారు. అయితే జన్యుపరంగా, బరువును బట్టి, జీవనశైలి మార్పుల వల్ల.. ఇలా పలు కారణాల వల్ల వాటి పరిమాణం కొంతమందిలో తక్కువగా ఉండచ్చు. అలాంటప్పుడు బాధపడకుండా కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే స్తనాల్ని చక్కటి పరిమాణం, తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఈ ఆహారంతో..!
చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు శరీరంలో హార్మోన్లు సమతులంగా ఉండడం కూడా ముఖ్యమే. అందులోనూ ఛాతీ పరిమాణం విషయంలో ప్రత్యుత్పత్తి హార్మోన్లైన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో వాటి స్థాయుల్ని తగ్గకుండా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.
⚛ పాలు, పాల పదార్థాల్లో ఉండే ఈ ప్రత్యుత్పత్తి హార్మోన్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థను పటిష్టం చేస్తాయి. తద్వారా సంతాన భాగ్యానికి నోచుకోవచ్చు. అలాగే ఛాతీ పరిమాణాన్ని పెంచడంతో పాటు రొమ్ములకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తాయి.
⚛ నట్స్ (వాల్‌నట్స్, జీడిపప్పు, పల్లీలు), విత్తనాల్లో (గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు) విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ప్రొటీన్ వక్షోజాల పరిమాణాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. అలాగే ఈ పదార్థాలు శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయుల్ని ప్రేరేపిస్తాయి. అందుకే రోజూ వీటిని గుప్పెడు చొప్పున తీసుకోమని సలహా ఇస్తున్నారు.
⚛ చేపలు, రొయ్యల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మాంగనీస్.. శరీరంలో హార్మోన్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా ఛాతీ పరిమాణం పెంచుకోవడంతో పాటు ఇతర ప్రత్యుత్పత్తి సమస్యలూ తగ్గుముఖం పడతాయి.
⚛ బరువు తగ్గాలనుకునే వారు, పాలిచ్చే తల్లులు మెంతుల్ని రోజూ తీసుకోవడం తెలిసిందే! అయితే ఛాతీ పరిమాణం పెంచుకోవాలనుకునే మహిళలు కూడా రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు వాటిలోని ఫైటోఈస్ట్రోజెన్స్ కారణమట!
⚛ మాంసంలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రొమ్ముల పరిమాణం పెంచి తీరైన ఆకృతిలో కనిపించేందుకు దోహదం చేస్తాయి.
⚛ అవకాడో, ఆలివ్.. వంటి మంచి కొవ్వులు అధికంగా లభించే నూనెల్ని రోజూ వంటల్లో వాడినా, వాటితో రొమ్ములపై మసాజ్ చేసినా ఫలితం పొందచ్చంటున్నారు నిపుణులు. ఈ కొవ్వులు స్తనాల్లోని పాల గ్రంథుల పరిమాణాన్ని పెంచి.. తద్వారా రొమ్ము పరిమాణం పెరిగేలా చేస్తాయట!
⚛ సోయా పాలు, ఆకుకూరల్లోని ఫైటోఈస్ట్రోజెన్స్ రొమ్ము కణజాలం పరిమాణాన్ని పెంచి.. వక్షోజాల్ని చక్కటి పరిమాణంలో కనిపించేలా చేస్తాయి.
⚛ వీటితో పాటు శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయుల్ని ప్రేరేపించే బెర్రీస్, చెర్రీస్, యాపిల్స్.. వంటి పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.