
కాబోయే జీవిత భాగస్వామిలో ఇవి గమనించారా?
పెళ్లంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమన్నారు పెద్దలు. కానీ అంతకంటే ముందు చేసుకోబోయే వాడు ఎలాంటి వాడో తెలుసుకోమంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఎందుకంటే తరాల మాట ఎలా ఉన్నా.. జీవితాంతం కలిసి బతకాల్సింది మాత్రం భాగస్వామితోనే కదా! అయితే ఈ క్రమంలో చేసుకోబోయే భర్తలో కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలుంటే మాత్రం నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడంలో తప్పు లేదంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..
ఈ కాలంలో ప్రేమ పెళ్లిళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం పెళ్లికి ముందే దొరుకుతుంది. అయితే ఈ క్రమంలో అమ్మాయిలు తమకు కాబోయే వాడి ప్రవర్తన, అతడిలో కొన్ని అలవాట్లను పసిగట్టగలిగితే.. పెళ్లయ్యాక ఇబ్బంది పడే అవకాశం ఉండదంటున్నారు నిపుణులు.
మాట తప్పుతున్నారా?
ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తంటే ఎవరికైనా గౌరవమే! ముఖ్యంగా అమ్మాయిలు తమకు తగిన వరుడిని వెతుక్కునే క్రమంలో అతనిలో ఇలాంటి లక్షణం తప్పకుండా ఉండాలనుకుంటారు. అయితే ఇది మీరు చేసుకోబోయే భర్తలో ఉందో, లేదో ముందే తెలుసుకోవడం మంచిది. అలాగని సమయానికి వస్తానని రాకపోవడం, చేస్తానన్న పని చేయకపోవడం.. వంటి చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూడడం తగదు. ఇలా ఒకట్రెండు సందర్భాల్లో గమనిస్తే మీకిచ్చిన మాటలకు అతను ఎంత విలువిస్తున్నాడో అర్థమవుతుంది. అలాకాకుండా ప్రతి విషయంలోనూ మాట తప్పడం, మీకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి/నిర్లక్ష్యం చేసి.. దాన్ని కవర్ చేసుకోవడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. వంటివి చేశారంటే అలాంటి వ్యక్తిని అనుమానించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.
అదుపాజ్ఞల్లో పెట్టుకుంటుంటే..!
‘ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? వస్తానని రాలేదే? నువ్వు ఇలాగే ఉండాలి.. అలాంటి దుస్తులే వేసుకోవాలి..’ అంటూ తమకు కాబోయే భార్యను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని చూస్తుంటారు కొంతమంది పురుషులు. నిజానికి కట్టుకోబోయే వాడే అయినా, కాబోయే భార్యే అయినా.. ఒకరికొకరు పరిమితులు విధించుకోవడం తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇష్టాయిష్టాలనేవి వ్యక్తిగతం. ఎదుటివారికి ఇబ్బంది కలగనంత వరకు ఎవరి ఇష్టాలకు వాళ్లను వదిలేయడమే మంచిది. అలాకాకుండా ప్రతి విషయం నా చెప్పుచేతల్లోనే జరగాలంటే మాత్రం అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడడం కంటే ముందే సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.
మిమ్మల్ని లెక్క చేయకపోతే..!
చాలామంది పురుషులు పెళ్లికి ముందు తమకు కాబోయే భాగస్వామిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తుంటారు. వివాహమయ్యాక కూడా కొన్ని నెలల వరకు అది అలాగే కొనసాగుతుంది. ఆ తర్వాతే వాళ్ల అసలు స్వరూపం బయటపడుతుంది. మిమ్మల్ని కాదని సొంతంగా, లేదంటే ఇతరుల సహాయంతో నిర్ణయాలు తీసుకోవడం.. ఇతర కుటుంబ సభ్యుల ముందు మీరంటే లెక్కలేనట్లుగా ప్రవర్తించడం.. ఇలా భర్త తనకిచ్చే ప్రాధాన్యం తగ్గితే ఏ భార్యైనా సహించలేదు. ఈ క్రమంలో- మీకు, మీ అభిప్రాయాలకు ఎంతవరకు విలువ ఇస్తున్నారో పెళ్లికి ముందే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇంతకు ముందు చెప్పుకొన్నట్లు- సాధారణంగా పెళ్లికి ముందు అందరూ బానే ఉండే నేపథ్యంలో- కాబోయే వారి ప్రవర్తన, వ్యక్తిత్వం మొదలైన అంశాల గురించి వారి స్నేహితుల ద్వారా పరోక్షంగా అయినా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
వాళ్లను గౌరవించట్లేదా?
పెళ్లంటే ఇద్దరు కాదు.. రెండు కుటుంబాలు కలవడం. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడమే కాదు.. తమ అత్తింటి వారితోనూ గౌరవంగా మెలగాల్సి ఉంటుంది. అయితే కొంతమంది మగవాళ్లు.. ‘ఎలాగూ పెళ్లయ్యాక నా భార్య నా ఇంటికి వస్తుంది.. ఇక ఆమె కుటుంబ సభ్యులతో నాకేం పని..’ అన్న ధోరణిలో ఉంటారు. ఇదే ఆలోచనతో అసలు వాళ్లను పట్టించుకోకపోవడం, మాటల్లో-చేతల్లో వాళ్లను లెక్కచేయకపోవడం.. వంటివి చేస్తుంటారు. మీరు చేసుకోబోయే వాడు కూడా ఇలాంటి వాడా కాదా అన్న విషయం.. పెళ్లికి ముందు మీరిద్దరూ కలుసుకున్నప్పుడు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మాటల మధ్యలో మీ కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురావడం, పెళ్లి తర్వాత కూడా వాళ్ల బాగోగులు చూసుకుంటానని చెప్పడం వంటివి చేసి చూడండి.. ఈ క్రమంలో వాళ్లు ప్రతిస్పందించే విధానంతో మీ కుటుంబానికి మీరు చేసుకోబోయే వ్యక్తి ఎంత గౌరవం ఇస్తున్నాడన్నది స్పష్టమవుతుంది. దాన్ని బట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు.
వీటితో పాటు తెలిసి కూడా చేసిన పొరపాట్లే మళ్లీ మళ్లీ చేయడం, ప్రతి విషయంలోనూ అబద్ధాలాడడం, పరిణతి లేని మాటలు మాట్లాడడం, మీకు సంబంధించిన ఏ విషయమైనా సిల్లీగా/జోక్‌గా తీసుకోవడం, మీ అభిప్రాయాలు-నమ్మకాలకు గౌరవం ఇవ్వకపోవడం, మీరు పెట్ లవర్ అయి.. అతనికి పెట్స్ అంటే నచ్చకపోవడం.. ఇలాంటి విషయాలన్నీ కాబోయే భర్తలో తప్పకుండా గమనించాలంటున్నారు నిపుణులు. తద్వారా సరైన నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే వైవాహిక జీవితంలో కలతల్లేకుండా జాగ్రత్తపడచ్చు.
అయితే ఈ కారణాలన్నీ చెప్పుకోవడానికి చాలా సిల్లీగా అనిపించచ్చు.. అలాగని తేలిగ్గా తీసుకొని తప్పటడుగు వేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీ భాగస్వామిలో ఏ లక్షణం/అలవాటు నచ్చకపోయినా.. ఒకరికొకరు మాట్లాడుకొని మార్చుకుంటే నిండు నూరేళ్ల అనుబంధాన్ని ఆనందంగా గడిపేయచ్చు!
అలాగే - ఇక్కడ చెప్పిన విషయాలన్నీ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇద్దరికీ వర్తిస్తాయి.. ఎవరైనా సరే- పెళ్లికి ముందు కాబోయే జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలను ముందుగానే గమనించుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
మరి, పెళ్లికి ముందు మీరు మీ భాగస్వామిలో గుర్తించిన అలవాట్లేంటి? Contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి!
Advertisement
మరిన్ని

బుజ్జాయి నిద్ర కలత లేకుండా..
బోసినవ్వుల బుజ్జాయికి కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది. అందుకే పాపాయికి పక్క మెత్తగానే కాదు, సౌకర్యవంతంగానూ ఉండాలంటున్నారు నిపుణులు. ఇందుకు పరుపును ఎలా ఎంపిక చేయాలో సూచిస్తున్నారు. మూడునాలుగు నెలల వరకు పక్కపైనే ఎక్కువ సేపు చిన్నారులు నిద్రలో గడుపుతుంటారు.తరువాయి

Parenting Tips : ఫ్యామిలీ టెన్షన్స్ పిల్లల దాకా రాకుండా..!
ఎంత అన్యోన్యంగా ఉన్నా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అయితే కొంతమంది దంపతులు పిల్లల ముందే వాదులాడుకుంటారు. మరికొంతమందైతే ఫ్యామిలీ టెన్షన్స్‌ని పిల్లలపై చూపించడం, అన్నింటికీ వాళ్లనే బాధ్యుల్ని చేయడం.. వంటివి చేస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల....తరువాయి

మీరైతే ఏం చేస్తారు?!
ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలు చెడిపోవాలని కోరుకోరు.. కానీ వారలా తయారవడంలో పెద్దల పాత్ర లేకున్నా సరే.. నిందలు తప్పవు. కారణం ఏదైనా కానీ గాడి తప్పుతున్నప్పుడు కనిపెట్టక పోవడం, సరి చేయక పోవడం పెద్దల తప్పిదమేనంటున్నారు మనో విశ్లేషకులు. వాళ్లే తెలుసుకుంటార్లే అని ఊరుకోకుండా ఏం చేయాలని చెబుతున్నారంటే...తరువాయి

పిల్లల గది అందుకు మినహాయింపు...
మనమంతా తీరిక, ఓపిక ఉన్నప్పుడు ఇల్లు సర్దుకున్నా కొందరిళ్లలో సర్దిన తీరు చూస్తే భలే ప్రేరణ కలుగుతుంది. కానీ ఎక్కువ సమయం వెచ్చించకుండా ఎలా పొందిగ్గా అమర్చుకోవాలో అంతుపట్టదు. అది తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలే కానీ ఆ కళలో నిష్ణాతుల సలహాలు సిద్ధంగానే ఉన్నాయి. చదివేయండి, మీకెంతో ఉపయోగపడతాయి...తరువాయి

Adoption: దత్తత తీసుకున్న పిల్లలతో అనుబంధం పెంచుకునేదెలా?
పిల్లలు పుట్టకపోవడం వల్లో, లేదంటే సమాజ స్పృహతోనో చిన్నారుల్ని దత్తత తీసుకోవడం సహజమే! ఇందులోనూ తమ ఆలోచనలకు అనుగుణంగా పసి పిల్లల్ని, కాస్త పెద్ద పిల్లల్ని ఎంచుకుంటుంటారు. అయితే ఈ పద్ధతి దంపతులకు పిల్లలు లేని లోటు, అటు వారికి తల్లిదండ్రులు.....తరువాయి

పిల్లలతో ఈ విషయాలు మాట్లాడాల్సిందే..
లైంగిక పరమైన అంశాలు, నెలసరి వంటి వాటి గురించి యుక్త వయసు ఆడపిల్లలతో తల్లి మాట్లాడాల్సిన అవసరమెంతైనా ఉందంటున్నారు నిపుణులు. అదేదో రహస్యమైన సంభాషణ అనుకుంటే వాటి గురించి అవాస్తవాలు, అర్ధసత్యాలు తెలుసుకుని, అపోహలతో తప్పటడుగు వేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.తరువాయి

టీనేజ్ పిల్లలు మీ మాట వినడం లేదా?
ప్రజ్ఞకు పద్నాలుగేళ్లు. సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతుంటుంది. ఫోన్ కాసేపు పక్కన పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టమని తల్లి చెప్తే.. ‘నువ్వేం చెప్పక్కర్లేదు.. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు’ అంటూ బదులిస్తుంటుంది. మొన్నటిదాకా ఖాళీ సమయంలో ఏదో ఒక విషయం నేర్చుకుంటూ సద్వినియోగం.....తరువాయి

అబద్ధాలు చెబుతుంటే...
అహల్య భర్త తరచూ ఏదో ఒక అబద్ధం చెబుతూనే ఉంటాడు. ఇవి చిన్నవైతే సర్దుకుపోవచ్చు. కొందరు పెద్ద అబద్ధాలు చెబుతూ భాగస్వామిని మోసం చేస్తుంటారు. వీరిని క్షమించాలా వద్దా అని ఆలోచిస్తున్నారా.. నిపుణులేం చెబుతున్నారో చూద్దాం. అరుదుగా... జీవిత భాగస్వామితో కొందరు చిన్న గా అబద్ధాలు చెబుతుంటారు. అప్పుడు నిజం కన్నా ఆ చిన్న అబద్ధమే వారి మధ్య కలతలను దూరం చేయొచ్చు. దీన్ని గుర్తిస్తే ఎదుటివారు తమతో అలా...తరువాయి

మనకు మంచి... వాళ్లకు చెడా?
రమ్యకు ఎనిమిదేళ్లు. తనని ఫోన్లో ఆడుకోనివ్వరు అమ్మానాన్న. వాళ్లు మాత్రం సమయం ఉన్నప్పుడల్లా ఆడటం ఆ చిన్నారికి నచ్చదు. ఇలా పిల్లల్ని వద్దన్న పనిని పెద్దలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదంటున్నారు నిపుణులు. లేదంటే అన్నింటికీ తల్లిదండ్రులను అనుకరించే పిల్లలు ఆ అంశానికే ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.తరువాయి

నైపుణ్యాలని... ఇలా నేర్పండి!
రమ్య పదేళ్ల వయసులోనే కథల పుస్తకం రాసి వార్తల్లోకెక్కింది. ఎనిమిదేళ్ల రాహుల్ గీసిన బొమ్మను ప్రశంసించి స్కూల్ నోటీస్ బోర్డ్‌లో ఉంచారు. చిన్నవయసులోనే ఇలా కొందరు పిల్లలు నచ్చిన రంగంలో రాణిస్తుంటారు. నృత్యం, చిత్రకళ, క్రీడలవైపు పిల్లల్లో బాల్యం నుంచి ఆసక్తిని కలిగిస్తే అవి వారిలో ఎన్నో నైపుణ్యాలు పెంచుతాయంటున్నారు నిపుణులు....తరువాయి

విశ్వమంత ప్రేమ
తేనె - తీపి, జాబిలి - వెన్నెల, పువ్వు - పరిమళం... వీటిని విడదీసి చూడలేం. సృష్టిలో తల్లీబిడ్డల బంధమూ అలాంటిదే. భౌతికంగా వేర్వేరుగా ఉన్నా... తల్లి కావడంతోనే తన ప్రాణాల్ని బిడ్డల్లో దాచేస్తుంది. బిడ్డల ఎదుగుదలలో కనిపించని శ్రమ అమ్మ. పిల్లలకు దక్కే కీర్తిప్రతిష్ఠలే తానందుకున్న సన్మాన సత్కారాలుగా భావిస్తుంది. ఏ తపస్సూ చేయకుండా ఈ సృష్టి ప్రతి జీవికీ ఇచ్చిన వరం అమ్మ. మాతృదినోత్సవం సందర్భంగా కొందరు అసాధారణ అమ్మల స్ఫూర్తిగాథలు...తరువాయి

మా పాప మొండిగా తయారైంది.. తనను మార్చేదెలా?
మేడమ్... మా పాప వయసు 9 సంవత్సరాలు. ప్రతి చిన్న విషయానికీ ఏడుస్తుంది. అంతేకాదు.. మొండిగా తయారై.. చదువులో కూడా వెనుకబడింది. నాకు 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. వాడు ముద్దుగా ఉంటాడు. కానీ పలు ఆరోగ్య సమస్యలున్నాయి. మేము ఎక్కువ గారాబం చేయడం వల్ల మా అమ్మాయి అలా తయారై ఉండచ్చు.తరువాయి

ఎగ్జామ్స్ భయం పోగొట్టండిలా!
పిల్లలకు ఏడాదంతా చదివింది ఒకెత్తయితే, వార్షిక పరీక్షలు మరో ఎత్తు. పరీక్షల షెడ్యూల్ ఇలా వచ్చిందో లేదో అలా చిన్నారుల్లో అలజడి మొదలైపోతుంది. దాంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా పరీక్షల్లో విఫలమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి పరీక్షలు సమీపిస్తున్నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ.....తరువాయి

తనతో.. వీటి గురించి మాట్లాడారా!
నెలసరి ప్రారంభమవడంతోనే అమ్మాయి పెద్దదై పోయిందని భావిస్తాం. ఎన్నో జాగ్రత్తలూ చెబుతాం. మరి తన మానసిక స్థితేంటో గమనించారా? చర్మతీరు, ఎత్తు, శారీరకంగా వచ్చే మార్పులు.. ఇవన్నీ తనకు కొత్తే. దీనికి తోడు తనని మనం చూసే తీరులోనూ మార్పు వస్తుంది. ఇవంతా తనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అప్పటిదాకా లేలేతగా మృదువుగా ఉండే చర్మం కొందరిలో బరకగా మారిపోతుంది....తరువాయి

పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు నేర్పండి..!
నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ పని ఉంటుందో తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పిల్లలు పలు రకాల సమస్యలు......తరువాయి

బంధాలు దూరమవుతున్నాయా? ఈ అలవాట్లను మార్చుకోండి..!
వ్యక్తిగతంగా అయినా సరే, వృత్తి ఉద్యోగాల్లో అయినా సరే- మనిషి మనుగడకు మూలం ఇతరులతో ఉండే సంబంధబాంధవ్యాలే. ఒకరకంగా మన ఉన్నతికి కూడా ఇవే కారణమవుతాయి. అయితే- నిత్య జీవితంలో మనం ఇతరులతో బంధాలను దృఢపరచుకోవడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నామంటే సందేహమే. ఈ క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని....తరువాయి

పెళ్లి తీరు మారుస్తున్నారు!
రెండు మనసులు ముడిపడటమే పెళ్లి. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో ఎటు చూసినా కోలాహలమే. అందులో తానూ భాగమవ్వాలనుకుంటోంది నేటి పెళ్లి కూతురు. ప్రమాణాలకు ముందే ఇద్దరం చెరో సగం అని చెబుతోంది. వరుడి వెనుక కాకుండా.. కలిసి అడుగు వేయాలను కుంటోంది. తమ ఆనందం పర్యావరణానికీ హితమవ్వాలని చూస్తోంది. తనదైన రోజున నచ్చినట్టుగా ఉంటూ..తరువాయి

Tina Dabi Wedding: నాలుగు నెలల ప్రేమకు మూడో ముడి!
‘నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహారు..’ అంటూ మురిసిపోతోంది ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. ఇటీవలే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. తోటి ఐఏఎస్ అధికారి.......తరువాయి

శ్రద్ధగా వింటేనే.. బంధాలూ బాగుంటాయి!
నిత్యం మనం ఎంతోమందితో ఎన్నో విషయాలు చర్చిస్తుంటాం. ఇందులో చాలామంది ఎదుటి వారు నేను చెప్పేది మాత్రమే వినాలనే మనస్తత్వంతో ఉంటారు. ఎదుటివారిని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా ఇతరులకు వారిపై వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉంటుంది. ఇలా లాభాల కంటే నష్టాలే...తరువాయి

Premature Babies: ఆ పాపాయిల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ఫలితంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు అధికంగా ఉంటున్నాయి. నెలసరి క్రమం తప్పడం, పీసీఓఎస్, సంతాన లేమి.. వంటి సమస్యలు ఇందులో భాగమే. వీటికి తోడు ఈ రోజుల్లో చాలామంది....తరువాయి

అతడిని నేను మతాంతర వివాహం చేసుకోవడం సబబేనా?
హాయ్ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు......తరువాయి

Ranlia Wedding : పెళ్లిలోనూ అలా ‘ప్రేమ’ను పంచుకున్నారు!
మనసుకు నచ్చిన వాడు, మనల్ని మెచ్చిన వాడు ఒకరే అయితే.. అతడితోనే ఏడడుగులు నడిస్తే.. అసలు ఆ అమ్మాయి ఆనందానికి పట్టపగ్గాలుంటాయా చెప్పండి. ప్రస్తుతం అలాంటి అమితానందంలోనే తేలియాడుతోంది బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ఆలియా భట్. ఊహ తెలిసినప్పట్నుంచి నటుడు రణ్‌బీర్....తరువాయి

Alia-Ranbir Wedding: పెళ్లికి ముందే అత్తగారి మనసు గెలుచుకుంది!
ఏ అమ్మాయైనా కొత్త కోడలిగా మెట్టినింట్లో అడుగుపెట్టాక అత్తగారి మనసు గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. అయితే ఈ విషయంలో అందాల ఆలియా నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి ముందే తన అత్తగారు నీతూ కపూర్‌తో ‘ది బెస్ట్ బహూ!’ అనిపించుకుందీ క్యూటీ. కోడలిగా ఆమెతో నూటికి నూరు మార్కులు......తరువాయి

‘మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా’ అని అత్తగారే అడిగింది!
ప్రేయసి కోసం ప్రియుడు చేసిన యుద్ధాల గురించి విన్నాం.. ప్రియుడి కోసం రాచరికాన్ని తృణప్రాయంగా వదిలేసిన యువరాణుల గురించి చదివాం.. అయితే ఈ అమ్మాయి మాత్రం తన ఇష్టసఖుడి కోసం ఓ భీకర యుద్ధాన్నే దాటొచ్చింది. ప్రాణాలరచేత పట్టుకొని తానూ విధితో ఓ చిన్నసైజు యుద్ధమే చేసింది. ఎట్టకేలకు సరిహద్దులు దాటి ఇటీవలే ప్రియుడి చెంతకు చేరింది.. పనిలో పనిగా ఎయిర్‌పోర్ట్‌లోనే తన నెచ్చిలి వేలికి ఉంగరం తొడిగి తన ప్రేమను.....తరువాయి

వినయం నేర్పాలి...
చిన్నారులకు కావలసినవన్నీ సమకూర్చడంతో మన బాధ్యత తీరిపోదు. వాళ్ల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం చాలా అవసరం. వాళ్లు నిజాయతీ అలవరచుకోవడం ఎంత ముఖ్యమో వినయంగా ఉండటమూ అంతే అవసరం. ‘నాకిది కావాల్సిందే’ అని రుబాబుగా అడిగితే ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వాలనిపించదు. పద్ధతిగా ఒద్దికగా అడిగితే సాధ్యం కానిది కూడా కష్టపడి తెచ్చివ్వాలనిపిస్తుంది. ఈ వినయం, విధేయత చిన్నతనంలోనే నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది....తరువాయి

వయసు ఏడాదిన్నరే.. జ్ఞాపకశక్తి మాత్రం అమోఘం!
సంవత్సరంన్నర పాపాయి అంటే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు. వాళ్లు వచ్చీరాని మాటలు మాట్లాడుతుంటే ఎంతో ముద్దొస్తుంటుంది. కేరళకు చెందిన అలెగ్జాండ్రా అభిలాష్ అనే చిన్నారి మాత్రం అదే వయసులో ప్రముఖులు, కార్టూన్ పాత్రల పేర్లు, ఇంట్లోని వస్తువులను.....తరువాయి

అత్తయ్య చెడుగా ప్రచారం చేస్తోంది
నాకు 25 ఏళ్లు. ప్రేమ పెళ్లి చేసుకున్నా. నా భర్తకు ఇంకా ఏ ఉద్యోగమూ రాలేదు. నాకు బాబు పుట్టి 7 నెలలైంది. ఉద్యోగం చేయాలనుంది కానీ నీరసం, నిస్పృహ. కాస్త పనికే అలసిపోతున్నా. మా అమ్మా వాళ్ల గురించి అత్తయ్య చెడుగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడావిడ మాట్లాడటంలేదు. బాబుని చూడటానికైనా రాలేదు. ఆమెతో ఎప్పుడూ సమస్యే. ఏదైనా పరిషారం చెప్పండి.తరువాయి

మా ఆయన అమ్మాయిలతో చాట్ చేస్తుంటాడు.. నన్ను పట్టించుకోడు..!
హలో మేడమ్.. నా వయసు 27 సంవత్సరాలు.. పెళ్లై ఏడాది దాటింది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తమామలు నన్ను అస్సలు పట్టించుకోరు. మా ఆయనేమో వేరే ఆడవాళ్లతో చాట్ చాస్తుంటాడు. అదేంటని అడిగితే చేయి చేసుకున్నాడు. సరేనని సర్దుకుపోయినా తన ధోరణి.....తరువాయి

Friendship Tips : ముందు నటిస్తూ.. వెనక గోతులు తవ్వుతున్నారా?!
ముందు మంచిగా నటిస్తూ.. వెనక గోతులు తవ్వేవారు మన చుట్టూ కొంతమంది ఉంటారు. అంతెందుకు.. మన ప్రాణ స్నేహితులు అనుకునే వారే మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల నైజం బయటపడినప్పుడు జాగ్రత్తపడకపోతే నలుగురిలో మనం నవ్వుల పాలవక తప్పదంటున్నారు....తరువాయి

Parenting Tips : పిల్లల ముందు ఇలా చేస్తున్నారా?
ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ‘మా పాప ఫోన్ పట్టిందంటే వదలదు, దానివల్ల సరిగ్గా చదవడం లేదు’, ‘మా బాబు పొద్దున్నే లేవమంటే అస్సలు లేవడు’, ‘మా పిల్లలను వ్యాయామం చేయమంటే బద్ధకిస్తుంటారు..’ అంటూ సైకాలజిస్టులను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటివి జరగడానికి ఎక్కువ శాతం....తరువాయి

Tina Dabi: నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహారు!
‘నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహారు..’ అంటూ మురిసిపోతోంది ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. విడాకుల తర్వాత మళ్లీ త్వరలోనే రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో- తనకు కాబోయే భర్తను పరిచయం....తరువాయి

ప్రేమించాడు.. పెళ్లంటే మొహం చాటేశాడు!
మేడం.. నేను ఒకబ్బాయిని ప్రేమించా. తనూ నన్ను ఇష్టపడ్డాడు. కానీ పెళ్లికి మాత్రం నిరాకరిస్తున్నాడు. కారణం అడిగితే - ‘మా ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే చేసుకుంటాను.. వేరే కులానికి చెందిన అమ్మాయితో పెళ్లికి మావాళ్లు ఒప్పుకోరు..’ అంటున్నాడు. నేను మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పా. అమ్మానాన్న కూడా మా పెళ్లిక...తరువాయి

చేదు బాల్యం.. విషపు యవ్వనం.. నాకు నేర్పిన జీవితపాఠాలు!
‘తేనెలొలుకు బాల్యం నిత్యనూతన మధుర జ్ఞాపకం’.. కానీ అది ఆమె విషయంలో నిజం కాలేదు. ‘ఉరకలెత్తే యవ్వనం, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కలలు, ఆశల పరంపర’.. అది కూడా ఆమె విషయంలో కలగానే మిగిలిపోయింది. దాంతో కుంగిపోయింది.. వేదనపడింది.. ఆత్మహత్యకు ప్రయత్నించింది.. కానీ ప్రతి పుట్టుకకు ఒక అర్థం, పరమార్థం ఉంటుందన....తరువాయి

చిన్నారులు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..
ఈసారి మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితులను పెద్దలు తట్టుకోవడమే కష్టంగా ఉంది. మరి చిన్నారులు తట్టుకోగలరా? అందుకే ఎండాకాలంలో వారి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నారులు ఆటల్లో పడి ఎండ తీవ్రత తమపై పడుతుందన్న విషయాన్ని....తరువాయి

భర్తంటే ఇష్టం లేదు.. ప్రేమికుడేమో రమ్మంటున్నాడు..
నమస్తే మేడమ్.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనికి చదువు, సంస్కారం, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. అతనికి కూడా నేనంటే అంతే ఇష్టం. అన్ని విషయాల్లో మేము దగ్గరయ్యాం. మా ఇంట్లో నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, బంధువులందరూ నన్ను తిట్టడంతో....తరువాయి

ఇలా చేస్తే మళ్లీ దగ్గరైపోతారు!
దాంపత్య బంధంలో అలకలు, గొడవలు కామనే. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆలుమగల మధ్య సయోధ్య కుదరక భిన్నాభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. క్రమంగా అవి ఘర్షణకు దారి తీస్తాయి. మరి ఆ గొడవ ద్వారా ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరుగుతుంది. అప్పుడు వారి మధ్య మాటలుండవు, మాట్లాడుకోవడాలుండవు! అయినా.. ఇదెంతో సమయం ఉండదు....తరువాయి

వారిని ప్రేమతో... మార్చుకోవాలి
రమాదేవికి ఎనిమిదేళ్ల కూతురుంది. ఇంటికెవరైనా బంధువులు, స్నేహితులొచ్చినప్పుడు తన ప్రవర్తన మారుతుంది. అందరి ఎదుట అమ్మని ఎంత మాటైనా వెనుకాడకుండా అనేస్తుంది. ఈ మార్పు వారిలో ఎందుకొస్తుందో గుర్తించాలి అంటున్నారు నిపుణులు. ఎదుటివారి ముందు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో నేర్పించాలితరువాయి

మూడు కోట్ల విలువైన కారుతో భర్తను సర్ప్రైజ్ చేసింది..!
భార్యాభర్తలిద్దరూ తాము వేసే ప్రతి అడుగులో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒకరికొకరు తోడుగా ఉండాలనుకోవడం సహజం. మరీ ముఖ్యంగా మహిళలు తాము గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డ పుట్టాక.. భర్త వెన్నంటే ఉండాలని కోరుకుంటారు. పిల్లల బాధ్యతల్ని తమతో సమానంగా పంచుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకు కృతజ్ఞతగా తమ భర్తలకు ప్రత్యేక బహుమతులిచ్చి....
తరువాయి

Second Child: ఈ భయాలు మీలోనూ ఉన్నాయా?!
బృందకు ఒక కొడుకున్నాడు. అయితే ఇప్పుడు మరో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటోంది. కానీ రెండో బిడ్డకు అంత ప్రేమ పంచగలనా? వీడి ఆలనలో పడిపోయి మొదటి బిడ్డను నిర్లక్ష్యం చేస్తానేమోనని సంశయిస్తోంది. మృదుల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే! అయినా రెండో బిడ్డను కనాలని పట్టుదలగా ఉందామె. కానీ దానివల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని వెనకా ముందూ అవుతోంది. రెండో బిడ్డను కనే విషయంలో నూటికి తొంభైమంది మహిళలు ఇలాంటి భయాందోళనల్లోనే ఉన్నారని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొంతమందితరువాయి

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?
నమస్తే మేడమ్.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్....తరువాయి

పిల్లలనెక్కువగా పొగుడుతున్నారా...
ఇందుమతి కూతురికి పట్టుమని పదేళ్లు నిండలేదు. తాను చెప్పిందే సరైనదని మొండి పట్టు పడుతుంది. ఎదుటి వారు చెప్పేది వినదు. అన్నీ తనకే తెలుసన్నట్లు ప్రవర్తిస్తుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తల్లిదండ్రులు చేసే ప్రశంస మోతాదు ఎక్కువైతే వచ్చే విపరిణామమే ఇదంటున్నారు నిపుణులు. అమితంగా పొగిడితే అది అతి ఆత్మవిశ్వాసంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.తరువాయి

కొత్త కాపురంలో ఈ పొరపాట్లు వద్దు!
ప్రేమ, అనురాగం, రొమాన్స్, అర్థం చేసుకునే తత్వం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే భార్యాభర్తల నిండు నూరేళ్ల అనుబంధానికి పునాది వేసే అంశాలు బోలెడుంటాయి. అయితే కొత్తగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన జంటల్లో చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తూ.. తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి వారి కలల కాపురంలో కలతలు....తరువాయి

‘ఆ మార్పుల’ గురించి మీ అమ్మాయికి చెప్పారా?
రుతుక్రమం.. ఆడపిల్లలు బాల్యం నుంచి యుక్తవయసులోకి అడుగిడే దశకు సూచన. సాధారణంగా చాలామంది ఆడపిల్లల్లో 10 నుంచి 13 ఏళ్ల మధ్య రుతుచక్రం ప్రారంభమవుతుంది. అయితే కొంతమందికి ఇంతకంటే ముందుగానే.. అంటే దాదాపు 8 ఏళ్ల వయసులోనే లేదంటే 13 ఏళ్ల తర్వాతనైనా.. నెలసరి కావడం మొదలవ్వచ్చు. ఏదేమైనా పిరియడ్ మొదలయ్యే క్రమంలో.......తరువాయి

హద్దులుండాలి...
భార్యాభర్తల మధ్య కూడా కొన్ని హద్దులుండాలి. ఇవి మొదటి నుంచే ప్రారంభించాలి. లేదంటే ఇరువురి మధ్య బంధం కొంతకాలం సవ్యంగానే సాగినా.. నెమ్మదిగా సమస్యలెదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను బంధం మొదలైననాటి నుంచే పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.తరువాయి

ఆయన సిగరెట్ల వల్ల నేనూ బలైపోయా!
కొన్ని అలవాట్లు మన జీవితాన్నే మార్చేస్తాయి. మంచి అలవాట్లు మన జీవితాన్ని ఎంత చక్కటి దారిలోకి తీసుకెళ్తాయో.. చెడు అలవాట్లు అంతకుమించి ప్రాణాపాయాన్ని కలిగిస్తాయి. కానీ మనం ఎలాంటి తప్పూ చేయకుండానే మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. జీవితాన్ని నరకప్రాయంగా మార్చుతుంది పొగ తాగడం అనే అలవాటు.. మనం సిగరెట్లు తాగకపోయినా.....తరువాయి

సమదృష్టితో చూడాలి..
మా అల్లుడెంత మంచివాడో అమ్మాయి గీసిన గీత దాటడు అని చెప్పే ఆ తల్లి, తన కొడుకును మాత్రం కోడలి మాటను జవదాటడం లేదంటూ విమర్శిస్తుంది. ఈ తరహా ఆలోచనే ఇంట్లో ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయంటున్నారు మానసిక నిపుణులు. కూతురు, కోడలు అని తేడా లేకుండా సమదృష్టితో చూడగలిగే వాతావరణం ఉన్న ఇల్లు నందనవనమని, దీనికంటూ ఓ ప్రవర్తనావళిని పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.తరువాయి

చిన్నారుల్లో ఊహాశక్తిని పెంచేలా..
పిల్లల్లో కొత్తగా ఆలోచించే విధానాన్ని, ఊహాశక్తిని పెంచాలంటే ఎక్కువగా కథల పుస్తకాలు చదవడం నేర్పించాలంటున్నారు మానసిక నిపుణులు. అవేంటంటే... ప్రతిరోజూ... ఏదో ఒక సమయంలో కథలు చదివించడం చిన్నప్పటి నుంచి నేర్పాలి. అదొక పనిలా కాకుండా సరదాగా కథలవైపు వారికి ఆసక్తి కలిగించాలి. వారెదుట కథల గురించి మాట్లాడుకోవాలి...తరువాయి

ఇలాంటి వ్యక్తిని వదులుకోకండి!
ప్రేమైనా, పెళ్లైనా.. నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే విడిపోవడం ఈ కాలపు జంటలకు కామనైపోయింది. అయితే ఇలా ఒకరితో ఒకరు విడిపోయే క్రమంలో ఒకరి కోసం మరొకరు చేసిన త్యాగాలు, మంచి పనులు సైతం గుర్తుకురావు. అయితే ఆఖరి మెట్టు దిగే ముందు ఒక్కసారి వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలావరకు విడాకులు/బ్రేకప్‌లు.....తరువాయి

ఎక్కడ తగ్గాలో తెలిస్తే చాలు...
భార్యాభర్తలిద్దరూ ఒకేలా ఉండరు. భిన్న మనస్తత్వాలు, సంప్రదాయాలు, ప్రాంతాలు, అభిరుచులు... అన్నింటిలోనూ తేడా ఉంటుంది. అందుకే అభిప్రాయాలను పంచుకుంటూ.. ఒకే తాటిపై కలిసి అడుగులేద్దాం అనుకుంటే చాలు. సమస్యల్లేకుండా సాగొచ్చు. దంపతులు ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే బంధం కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.తరువాయి

పిల్లల మీద అరుస్తున్నారా..
చిన్నారులంటేనే అల్లరికి చిరునామా. ఒక్కోసారి వారు చేసిన పనులు నవ్వును తెప్పిస్తే మరికొన్నిసార్లు చెప్పలేనంత కోపాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో గట్టిగా అరిచేస్తాం. తర్వాత అయ్యో ఇలా అన్నామే అని బాధపడతాం. అయితే ఇలాంటి సమయాల్లోనే సంయమనం పాటించాలంటారు నిపుణులు. మీ కోపం తగ్గడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.తరువాయి

గతాన్ని మర్చిపోలేకపోతున్నా.. బయటపడేదెలా?
నమస్తే మేడమ్.. నేను ఒక అబ్బాయిని ఐదు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. ఈ విషయం తనకి, నాకు మాత్రమే తెలుసు. కానీ అనుకోకుండా ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లైంది. ఈ విషయం తెలిశాక తట్టుకోలేకపోతున్నా. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నా. ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తున్నా. నాకు కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.తరువాయి

ఇంటా, బయటా గెలుపు ఎలా?
సాధికారత అంటే.. ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు.. ఇటు ఇంట్లోని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే.. అటు వృత్తినీ బ్యాలన్స్ చేసుకోవడం, తల్లిగా పిల్లల్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం, ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం, ఇలా ఎన్ని పనులతో తీరిక లేకుండా ఉన్నా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకొని ఆరోగ్యంగా-ఫిట్‌గా....తరువాయి

Dating Anxiety: తొలిసారిగా కలుస్తున్నారా?
సాధారణంగానే ఎవరైనా కొత్త వ్యక్తిని కలవాలంటే మనసంతా బెరుగ్గా అనిపిస్తుంటుంది. అలాంటిది మనసుకు నచ్చిన వాడిని/మనువాడాలనుకుంటోన్న వారిని తొలిసారి కలవడమంటే.. కారణం తెలియదు కానీ మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. దీన్నే ‘డేటింగ్ యాంగ్జైటీ’ అని చెబుతున్నారు నిపుణులు. మరి, ఇదే భయంతో వారిని కలవడానికి వెళ్తే.. తొలి మీటింగ్‌ని......తరువాయి

Anupama Nadella: వాడి నవ్వులో ఆ మ్యాజిక్ ఉండేది!
నెలలు నిండుతున్న కొద్దీ తన ప్రతిరూపాన్ని చూసుకోవడానికి తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. పండంటి బిడ్డను చేతిలోకి తీసుకోవాలని, వారి బాల్యాన్ని చూసి మురిసిపోవాలని కడుపులో నలుసు పడ్డప్పట్నుంచే కలలు కంటుంది. వారిని పెంచి, ప్రయోజకులను చేసే విషయంలో ఆమె ఆలోచనలు హద్దులు దాటుతాయి.తరువాయి

ఆది దంపతులను చూసైనా మనం నేర్చుకోవద్దూ ?
వందలో రెండు యాభైలు ఉంటాయి ఏ యాభై ఎక్కువా కాదు.. తక్కువా కాదు.. రెండూ సమానమే.. సంసారంలో ఆలుమగలూ అంతే! ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు. ఈ సూత్రాన్నే అర్ధనారీశ్వర తత్త్వంగా అర్థవంతంగా ప్రదర్శించారు ఆది దంపతులు. ఆ జంట అందరికీ ఆదర్శం.. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి యేటా కల్యాణంతో మళ్లీ ఒక్కటవుతున్న పార్వతీపరమేశ్వరుల...తరువాయి

Couple Goals : అతిగా ఆశించకండి!
మేఘనది ప్రేమ వివాహం. తాను కోరుకున్న లక్షణాలున్న వాడే భర్తగా లభించడంతో అమితానందంతో ఉందామె. అయితే తను నోరు తెరిచి అడిగితే తప్ప.. తన భర్త తన మనసు తెలుసుకొని మసలుకోడన్నది ఆమెకున్న అసంతృప్తి. పొగడ్తలంటే మాలతికి చాలా ఇష్టం. ప్రతి విషయంలోనూ తన భర్త తనని ప్రశంసించాలని కోరుకుంటుంది. అయితే చాలా విషయాల్లో ఇది వర్కవుట్ కాక తనలో తానే మథనపడుతుంటుంది.తరువాయి

రోజంతా ఫోనైతే... నేనెందుకు?
అమలకు ఇంట్లో భర్త ఉన్నా, ఆఫీస్‌కెళ్లినా తేడా తెలీదు. పన్లోనో, ఫోన్లో ఉంటూ తన ఉనికినే మర్చిపోతున్నాడనే వేదన రోజురోజుకీ పెరుగుతోంది. ఇటువంటి చిన్న చిన్న అంశాలే క్రమేపీ బంధాన్ని బలహీనపరుస్తాయి అంటున్నారు నిపుణులు. ఇరువురి మనసులూ ముడిపడి దగ్గరవ్వాలంటే కొన్ని అలవాట్లను దూరం పెట్టాల్సిందే అని హెచ్చరిస్తున్నారు...తరువాయి

అపురూప బంధానికి ఆరు సూత్రాలు
భార్యాభర్తల మీద ఎన్ని జోకులు! ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటే పెళ్లయినట్లు.. నవ్వుతూ కనిపిస్తే కానట్లు అనడం కొత్త కాదు. కానీ ఎందుకలా? ఆలుమగలు సరదాగా, సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు ముచ్చటేస్తుంది. అదెలా సాధ్యమో ఫ్యామిలీ కౌన్సిలర్లు సూచిస్తున్నారు..మన భావాలన్నీ చెప్పాలని ఉంటుంది. ఉద్వేగాలన్నీ ప్రదర్శించాలని ఉంటుంది. నిజమే, అదంతా చేయాల్సిందే. కానీ కేవలం మన ఆలోచనలు వ్యక్తం చేయడమే కాదు, అవతలి వ్యక్తికి కూడా చెప్పే అవకాశం...తరువాయి

Behavioural Problems: మీ పిల్లల్లో కూడా ఇలాంటి సమస్యలున్నాయా?
‘మా పాప పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వదు. వాళ్లు మాట్లాడుతుంటే కనీసం వారి వంక కూడా చూడదు’.. ‘మా బాబు ఎక్కడ నేర్చుకున్నాడో కానీ.. అసభ్యకరమైన పదాలు తరచుగా మాట్లాడుతున్నాడు. మేము అలాంటి పదాలను ఇంట్లో కూడా వాడం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు’..తరువాయి

Single Mom : అందుకే అబార్షన్ చేయించుకోలేదు.. ఉద్యోగమూ మానలేదు!
చదువు పూర్తవగానే కోరుకున్న ఉద్యోగం, మనసుకు నచ్చిన వాడితో మనువు.. ఈ జీవితానికి ఇవి చాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. మంగళూరుకు చెందిన తేజస్వి నాయక్ కూడా తన అదృష్టాన్ని చూసుకొని ఇలాగే మురిసిపోయింది. కానీ ఈ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటవుతుందని అప్పుడామె ఊహించలేదు. ప్రాణంగా ప్రేమించే భర్త శాశ్వతంగా దూరమయ్యాడు..తరువాయి

పిల్లల ముందు బాధపడుతున్నారా?
పిల్లలకు అమ్మే సూపర్ హీరో. ఎలాంటి సమస్య వచ్చినా సరే అమ్మకు చెబితే అది పరిష్కారమవుతుందని పిల్లల నమ్మకం. అలాంటి అమ్మకు కూడా కష్టాలొస్తాయి, కన్నీళ్లుంటాయని చిన్న పిల్లలకు తెలియదు. అందుకే వాటిని పిల్లలకు కనబడనీయకుండా తల్లి జాగ్రత్తపడుతుంది. అయితే ప్రతిసారీ పరిస్థితి తన అధీనంలో ఉండాలని లేదు....తరువాయి

అత్తగారూ.. తెలుసుకోండివి!
కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టే కోడలికి ఒక్కటే దిగులు.. అత్తగారు తననెలా ఆదరిస్తారోనని! తాను చేసే పనులు, మెలిగే విధానం ఆమెకు నచ్చుతాయో లేదోనని మొహమాటపడుతుంటారు కొత్త కోడళ్లు. అయితే ఇలా కోడలి మదిలో ఉన్న భయాలను తొలగించి.. ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేయడం అత్తగారి చేతిలోనే ఉందంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.తరువాయి

క్యాన్సర్ అని తెలిసినా.. నిన్నే ప్రేమించా.. పెళ్లాడతానన్నాడు!
తెలిసీ తెలియని వయసులో ప్రేమంటే అదంతా వట్టి ఆకర్షణ అని కొట్టిపడేస్తుంటాం. కానీ స్కూలింగ్ నుంచే వారిద్దరూ మంచి స్నేహితులు.. ఒక రోజు కనిపించకపోయినా, ఒకరినొకరు చూసుకోకపోయినా వారి మనసులో ఏదో వెలితిగా అనిపించేది. కానీ అదే ప్రేమని, ఆకర్షణను మించిన అందమైన అనురాగ బంధమని విడిపోయాక కానీ తెలుసుకోలేకపోయారు.తరువాయి

వేలంటైన్ లేరా? అయితే ఇలా చేసేయండి!
వేలంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. ప్రతి హృదయం 'ఐయామ్ ఇన్ లవ్.. ఐయామ్ ఇన్ లవ్' అంటూ పాటలు పాడేస్తుంది. కొత్తగా ప్రేమలో పడ్డవారి సందడి గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రపంచంలోని ప్రేమంతా తమలోనే నిండినట్లు.. ఏడాది మొత్తం ప్రేమను ఒకేరోజు చూపించేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.. కానీ వేలంటైన్స్ డే రోజు ఒంటరిగా ఉండేవారి పరిస్థితేంటి? ప్రత్యేకంగా ఏముంది?తరువాయి

జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా బంగారం!
ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా తమలో తాము మాట్లాడుకోవడం, ముసిముసిగా నవ్వుకోవడం, ప్రేమించిన వారి తలపుల్లో తడిసిపోవడం.. ఇలా ఆ బంధంలోని తియ్యదనం వర్ణనాతీతం. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని..తరువాయి

కోరిక తీరాక కాదు పొమ్మన్నాడు.. ఇప్పుడు డబ్బు కోసం నువ్వే కావాలంటున్నాడు!
ప్రేమగా మాట్లాడుతూ అమ్మాయిల్ని లొంగదీసుకోవడం.. కోరిక తీరాక వదిలించుకోవడం.. ఇలాంటి సంఘటనల గురించి వింటూనే ఉంటాం. అయితే ఇలాంటి ఘటనల్లో శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్న ఆ అమ్మాయి పరిస్థితేంటి? అనుక్షణం ఆ చేదు జ్ఞాపకాలనే తలచుకుంటూ అంధకారంలో ఉండిపోవాల్సిందేనా? అంటే.. ఎంతమాత్రం అక్కర్లేదంటూ తన కథను పంచుకుంటోంది...తరువాయి

పిల్లలకు పీడకలలా??
భువన వాళ్ల పాప భావన ఓ రోజు రాత్రి ఉలిక్కిపడుతూ అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచింది. దీంతో పక్కనే ఉన్న వాళ్లమ్మ భువన 'ఏంట్రా.. అంత సడెన్‌గా లేచావేంటి? ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.. ఎందుకలా వణుకుతున్నావ్?' అని అడిగింది. వెంటనే భావన తల్లి కళ్లలోకి చూస్తూ.. 'అమ్మా.. నాకేదో పీడకల వచ్చింది..తరువాయి

వింటున్నారా.. రాజీ పడడానికీ ఉందో లెక్క..!
ఒక్కో మనిషి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. కానీ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకోవాలి. అలా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం కలకాలం కొనసాగుతుంటుంది. అయితే దంపతులకు వివిధ సందర్భాల్లో పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి.తరువాయి

అక్రమ సంబంధాలు పెట్టుకున్న నా భర్తను మార్చేదెలా?
మేడమ్.. నా వయసు 35 సంవత్సరాలు. నాకు పెళ్త్లె 12 ఏళ్లవుతోంది. 10 సంవత్సరాల పాప కూడా ఉంది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పాపని చదివించుకుంటున్నాను. నా భర్త ఇంట్లో కనీస అవసరాలు తప్ప మిగతా ఖర్చులు పట్టించుకోడు. మా పాపకి ఏడాది వయసున్నప్పుడే అతనికి వేరే అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసింది.తరువాయి

అతనికి రెండో భార్యగా ఉండడానికీ నేను సిద్ధమే.. కానీ!
హాయ్ మేడమ్.. నా వయసు 29 సంవత్సరాలు.. పెళ్లి కాలేదు. ఈ మధ్య ఆఫీసులో పెళ్లైన వ్యక్తితో పరిచయం అయ్యింది. కొద్దిరోజులకే నేను అతన్ని ఇష్టపడ్డాను. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. అతను నా కింద పని చేస్తుంటాడు. ఇప్పుడు అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. మొదట్లో అతనే ఎక్కువగా మాట్లాడేవాడు.తరువాయి

తలను గోడకేసి బాదుకుంటున్నాడు.. ఈ వింత భర్తతో వేగేదెలా?
నమస్తే మేడమ్.. నా వయసు 37. నాకు ఆరు నెలల క్రితం పెళ్లైంది. మాది లేట్ మ్యారేజ్. నా భర్త నుంచి నేనో వింత సమస్యను ఎదుర్కొంటున్నాను. అతనికి నచ్చనిది ఏదైనా మామూలుగా అడిగినా అతని ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. ఉదాహరణకు మనం మన పెళ్లిని రిజిస్టర్ చేసుకుందాం అంటే ఆ డిస్కషన్‌లోకి వెళ్లకుండా రకరకాలుగా ప్రవర్తిస్తు్న్నాడు.తరువాయి

పెళ్లికి ముందే ఇవన్నీ ఆలోచిస్తున్నారా?
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి వివాహం అనే సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. ఇలా ఒక్కసారి దాంపత్య బంధంలోకి అడుగు పెట్టాక.. ఇక నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. కానీ కొంతమంది పెళ్లి తర్వాత..తరువాయి

మీ భాగస్వామి అలవాట్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా?
వీరే కాదు.. చాలామంది దంపతులు వారి భాగస్వామికి ఉన్న కొన్ని అలవాట్లు తమకి ఇబ్బంది కలిగిస్తున్నా మౌనంగా భరిస్తూ ఉంటారు. వాటి గురించి తమ భాగస్వామితో ఎలా మాట్లాడాలి? ఎలాంటి అపార్థాలకూ తావీయకుండా తమ ఇబ్బందిని వారికి అర్థమయ్యేలా ఎలా వ్యక్తీకరించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.తరువాయి

పిల్లలకు ఈ టేబుల్ మ్యానర్స్ నేర్పిద్దాం..!
పన్నెండేళ్ల చిత్రకు డైనింగ్ టేబుల్‌పై పడకుండా భోజనం చేయడం ఇప్పటికీ రాదు. ఏడేళ్ల చైతన్య మొన్నోసారి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఫోర్క్ ఎలా ఉపయోగించాలో తెలియక ఆహారమంతా డ్రస్‌పై, టేబుల్‌పై పడేసుకొని చిందర వందర చేశాడు. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లలో కూడా అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి.తరువాయి

మీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు?
తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ ఎంత స్పష్టంగా ఉంటే వారి మధ్య అనుబంధం అంత దృఢమవుతుంది.. అంతేకాదు దీనివల్ల ఇద్దరి మధ్య స్నేహభావం రెట్టింపై.. పిల్లలు వారి పేరెంట్స్ దగ్గర్నుంచి నిస్సంకోచంగా బోలెడన్ని విషయాలు నేర్చుకుంటారు కూడా! ఒక రకంగా చెప్పాలంటే.. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు కూడా సాధిస్తారట!తరువాయి

ఏ సంబంధమొచ్చినా బావే గుర్తొస్తున్నాడు.. ఏం చేయాలి?
హాయ్ మేడమ్.. నా వయసు 29. ఆఫీసర్ స్థాయి ఉద్యోగినిని. నా తల్లిదండ్రులు కూడా ఉద్యోగులే. నాకు ఇష్టం లేకుండా కుదిర్చిన పెళ్లిని రద్దు చేశాను. నాకు మా బావ అంటే చాలా ఇష్టం. కానీ, తను నన్నే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. నేనేమో మరో వ్యక్తిని నా భర్తగా ఊహించుకోలేకపోతున్నా.తరువాయి

పండంటి కాపురానికి పాటించాలివి...
వివాహబంధంతో ఒకటైన జంట కలకాలం సంతోషంగా కలిసి ఉండాలంటే ఈ కింది సూత్రాలను పాటిస్తే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అవేంటంటే...భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ... ఎదుటివారి కన్నా తామే గొప్పవారమని, అధికులమని భావించకూడదు. వైవాహికబంధంలో ఇరువురూ సమానమే. ఇద్దరిలో ఎక్కువతక్కువలుంటే ఆ బంధం బీటలువారుతుంది....తరువాయి

కోడలైనంత మాత్రాన అవన్నీ భరించాలా? నేనేం చేయాలి..?
భర్త కోసం పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్లిన కొంతమంది ఆడపిల్లలకు అత్తారింటి వేధింపులు హారతి పట్టి మరీ స్వాగతం పలుకుతున్నాయని చెప్పచ్చు. కోడలంటే అత్తమామలు చెప్పినట్లే నడుచుకోవాలి.. భర్త మాట జవదాటకూడదు.. తనకంటూ సొంత నిర్ణయాలుండకూడదు.. ఇలాంటి తుప్పు పట్టిన కట్టుబాట్లు పెడుతున్నా ఇంటి గుట్టు రచ్చకీడ్చడమెందుకని చాలామంది కోడళ్లు సర్దుకుపోతున్నారు.తరువాయి

విడాకులు తీసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి!
పెళ్లంటే మనసులు కలిసిన ఇద్దరు వ్యక్తుల్ని నిండు నూరేళ్ల పాటు కలిపి ఉంచే బంధం. అయితే పలు కారణాల వల్ల ఈ మధ్య చాలా జంటలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. వీరిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఒక్కసారిగా తమ విడాకుల విషయం బయటికి చెప్పి తమ అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా తమిళ నటుడు ధనుష్-ఐశ్వర్య విడాకుల విషయం కూడా చాలామందిని షాక్‌కి గురి చేసిందని చెప్పచ్చు.తరువాయి

చిన్నారికి సమయపాలన..
పిల్లలు తమ పనులను పూర్తి చేయడానికి ఎక్కువసేపు తీసుకుంటున్నారంటే వారిలో సమయపాలన కొరవడిందని అర్థం. సమయం విలువ, దాన్ని ఎలా వినియోగించాలనేది బాల్యం నుంచే చిన్నారులకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు మానసిక నిపుణులు. క్రమేపీ ఇది క్రమశిక్షణగా మారి భవిష్యత్తులో వారిని లక్ష్యసాధన వైపు అడుగులేసేలా చేస్తుందంటున్నారు....తరువాయి

వీటి గురించి మెసేజ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!
'నువ్వున్న కిటికీ ఏవైపో వెతికీ వాట్సాప్ చేస్తావా?? మబ్బుల్ని కదిపి.. మొహమాట పెట్టి చంద్రున్ని తెస్తాగా..' అంటూ తన ప్రియురాలిపై ఉన్న ప్రేమని పాటరూపంలో వ్యక్తం చేశాడు ఓ సినీకవి. ఆయనే కాదు.. ఈరోజుల్లో సందేశం ఏదైనా సరే.. చాలావరకు ఫోన్ ద్వారానే ఒకరి నుంచి మరొకరికి చేరడం కామనైపోయింది.తరువాయి

పండగ వేళ ఇవి ఎందుకు చేయాలంటే...
భోగభాగ్యాల భోగి.. సిరిసంపదల సంక్రాంతి.. వచ్చేసింది. తెలుగింట పెద్ద పండగైన సంక్రాంతి అంటేనే రంగుల ముంగిళ్లు, ముద్దులొలికే గొబ్బిళ్లు, బంధుమిత్రుల సందళ్లు అన్నీ గుర్తొచ్చేస్తాయి. అయితే సంక్రాంతి పండగంటే ఇవే కాదు.. ఈ పండగలో మనం తెలుసుకోవాల్సిన మరెన్నో పద్ధతులు కూడా ఉన్నాయి..తరువాయి

నేను చేసింది తప్పా?? ఒప్పా??
నేను చదువుకొనే రోజుల్లో మా దగ్గరి బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు.తరువాయి

Lesbian Couple : ఈ అమ్మాయిల ప్రేమకథ విన్నారా?
ప్రేమంటే ఆడ, మగ మధ్య పుట్టేది.. పెళ్లంటే స్త్రీపురుషులకు జరిగేది.. అదే.. ఓ అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించినా.. ఓ అబ్బాయి మరో అబ్బాయికి మనసిచ్చినా ‘హవ్వ.. ఇదేం విడ్డూరం’ అనేస్తుంది మన సమాజం. ఇలాంటి కట్టుబాట్లను, స్వలింగ సంపర్కుల విషయంలో ఉన్న మూసధోరణుల్ని బద్దలు కొట్టి.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు ఇద్దరు డాక్టరమ్మలు.తరువాయి

Parenting: మీరూ ఇలాంటి పేరెంట్సేనా? అయితే మారాల్సిందే..!
తల్లిదండ్రులు పిల్లలతో ఎంత స్నేహంగా మెలిగితే.. వాళ్లు అన్ని విషయాలు అంత నిర్మొహమాటంగా పంచుకోగలుగుతారు. ఈ విషయం తెలిసినా.. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలపై పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. వారికి సంబంధించిన ప్రతి విషయం తమకు నచ్చినట్లుగానే జరగాలనుకుంటారు.తరువాయి

పిల్లలతో అడుగు కలపండి
ఈ కాలంలో బారెడు పొద్దెక్కే వరకు పెద్దలకే మంచం దిగాలని అనిపించదు. ఇక పిల్లల సంగతి వేరే చెప్పాలా! కానీ చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం మాత్రమే కాదు... వ్యాయామం కూడా ముఖ్యం. మరి ఆ వ్యాయామాలను చేయించాలంటే పెద్ద వాళ్లూ... పిల్లలతో కలిసి అడుగేసి ఉత్సాహాన్ని నింపాల్సిందేనని సూచిస్తున్నారు నిపుణులు...తరువాయి

ఇలాంటి సందర్భాల్లో ఏకాంతంగా వదిలేయాల్సిందే!
ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కొంతమంది ‘ఐ నీడ్ సమ్ స్పేస్’ అంటుండడం వినే ఉంటాం. నిజానికి ఇలాంటి సందర్భాల్లో ఏకాంతంగా ఉండడం వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. కానీ, చాలామంది ఆ విషయాన్ని తమ జీవిత భాగస్వామికి చెప్పకుండా వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటారు.తరువాయి

పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !
ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది.తరువాయి

ఈ అబద్ధాలు బంధానికి చేటు!
ఏదో సరదాకి ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్తే పర్లేదు.. అంతేకానీ.. ప్రతిరోజూ ప్రతి సందర్భంలో అసలు విషయం దాచి అబద్ధాలు చెబుతుంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర దొరికిపోవడం ఖాయం. దీనివల్ల ఎదుటివ్యక్తిపై ఉండే నమ్మకం మసక బారుతుంది. ఇదే అనుబంధాల్లో కలతలు రేగడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు.తరువాయి

ఇంటి పని అందరిదీ!
గత రెండేళ్లుగా కరోనాతో ప్రపంచమంతా నానా అగచాట్లూ పడింది. ఆ ప్రభావం మహిళల మీద మరీ ఎక్కువగా పడింది. మొదట్లో అది ఏమవుతుంది, ఎటు దారితీస్తుంది, దాన్నుంచి ఎలా రక్షించుకోవాలి అనేది శాస్త్రవేత్తలకి కూడా అంతుపట్టక భయం గుప్పిట్లో బతికాం. అలాంటి స్థితిలో అందరూ అయోమయంలో పడ్డారు. ఇక స్త్రీల సంగతి మరీ దారుణంగా తయారైంది. ఉద్యోగాలు పోవడం లేదా రాబడి తగ్గడంతో అభద్రతా భావం పెరిగింది. లాక్డౌన్లు, లేఆఫ్‌లు లేదా అసలే కొలువులు పోవడాలతో...తరువాయి

Relationship Takeaways : పాత అనుభవాలు.. కొత్త పాఠాలు!
‘ప్రేమించిన వాడు భర్తవ్వాలని లేదు.. భర్తైన వాడు ప్రేమించాలని లేదు..’ ‘శతమానంభవతి’ సినిమాలోని ఈ పాపులర్ డైలాగ్ చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే కారణమేదైనా కొన్ని ప్రేమకథలు, వైవాహిక బంధాలు కడదాకా సాగకుండా మధ్యలోనే ముగిసిపోతాయి. అలాగని వాటినే తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్లలేం.తరువాయి

ఆ వ్యసనం నుంచి ఆయన్నెలా బయటికి తీసుకురావాలి?
మేడమ్.. నేను ఎంసీఏ పూర్తి చేశాను. నా భర్త ఐటీఐ పూర్తి చేసి ఒక ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అత్తింటి వారు మా కంటే ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయి అని చెప్పాలి. వాళ్లకు ఆస్తులేమీ లేవు. అయినా తను మంచివాడు, జాబ్ చేస్తున్నాడు, నన్ను ఇష్టపడి వచ్చాడని మా వాళ్లు అతనికిచ్చి పెళ్లి చేశారు.తరువాయి

Celebrity Weddings: పెళ్లిళ్లలో ‘ట్రెండ్’ సెట్ చేశారు!
పెళ్లంటే కట్టూ-బొట్టూ దగ్గర్నుంచి వేడుకల దాకా.. కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు పాటించడం ఆనవాయితీ! అయితే వీటిలోనూ కొత్తదనం కోరుకుంటున్నారు ఈ కాలపు వధువులు. పాత పద్ధతుల్ని మార్చి తమ వివాహంలో కొత్త సంప్రదాయాలకు తెరతీస్తూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.తరువాయి

శ్రీవారికి నేర్పించండి!
‘పెళ్లంటే నూరేళ్ల పంట కాదు, వెయ్యేళ్ల వంట’ అని ఇల్లాళ్లు.. ముఖ్యంగా ఉద్యోగినులు కోపంగానో, బాధగానో వ్యంగ్యంగానూ మాట్లాడటం మనకేం కొత్త కాదు. కానీ ఆ ఆవేశంలో ఎంత ఉక్రోషం, నిరాశ ఉన్నాయో అర్థం చేసుకుంటే ఈ తీరులో మార్పు రావాలని బలంగా అనిపిస్తుంది. అలాంటి మంచి మార్పు కోసమే ఈ సలహాలు...తరువాయి

మీ ఫోను... పిల్లలకు కష్టం!
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోనుల్లో మునిగిపోతే అది పిల్లల ఎదుగుదలపై తీవ్ర చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదే విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్, టెల్ అవివ్ విశ్వ విద్యాలయ అధ్యయన బృందం చేపట్టిన సర్వేలో పలురకాల వివరాలు వెలుగులోకి వచ్చాయి....తరువాయి

అందుకే అమ్మకు మళ్లీ పెళ్లి చేశాం!
‘భరించేవాడే భర్త’ అంటుంటారు.. కానీ కట్టుకున్న వాడు రాచిరంపాన పెడుతున్నా.. ఓపికతో సహించాలంటారు కొంతమంది. ఇక విధిలేక అలాంటి వాళ్లతో విడిపోవడానికి నిర్ణయించుకుంటే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది. తన తప్పు లేకపోయినా సమాజం అనే సూటిపోటి మాటలు భరిస్తూ.. ఒంటరిగా పిల్లల బాధ్యతల్ని మోస్తూ ఆమె పడే యాతన అంతా ఇంతా కాదు.తరువాయి

గారాబం.. అతి కావట్లేదు కదా!
పిల్లలన్నాక ముద్దుచేస్తాం. గారాలు పోతుంటే మురిపెంగా చూస్తాం. కానీ మితిమీరితే అదొక మానసిక జబ్బుగా పరిణమిస్తుందనీ.. అది పిల్లలకీ, పెద్దలకీ కూడా చేటేనంటున్నారు మనోవిశ్లేషకులు. ఉద్యోగినులైన తల్లులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామనే అపరాధ భావంతో వాళ్లేమడిగినా కొనిస్తుంటారు. దాంతో చిన్నారుల ఆశలకు రెక్కలు రావడం సహజం. వాళ్ల కోరికలు నెరవేర్చనప్పుడు కోపావేశాలతో ఎదిరించడం పరిపాటి అవుతుంది...తరువాయి

Breakup: మీ మాజీని మర్చిపోలేకపోతున్నారా?
‘నువ్వే నా ప్రపంచం.. నువ్వు లేక నేను లేను’ అనే డైలాగులు చాలామంది ప్రేమికుల చాటింగుల్లో కనబడుతుంటాయి. వీరిలో కొంతమంది కొంతకాలం గడిచిన తర్వాత రకరకాల కారణాలతో విడిపోతుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి నుంచి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ లేనిదే చాలామందికి రోజు గడవదు.తరువాయి

Alpha Husband: అతనితో వేగలేకపోతున్నారా?
చాలా ఇళ్లలో ఇలాంటి భర్తల పెత్తనం మామూలే! భార్య తనకంటే ఓ మెట్టు కిందే ఉండాలని, తన ముందు అణిగి మణిగి ఉండాలని వారిపై లేనిపోని ఆంక్షలు విధిస్తుంటారు. అయితే చాలామంది భార్యలు ఈ విషయంలో ముందు ఓపికతో ఉన్నప్పటికీ.. ఒకానొక దశలో కోపం కట్టలు తెంచుకుంటుంది. దానివల్ల ఇద్దరి మధ్య గొడవలు.. ఇంట్లో మనశ్శాంతి కరువవడం..తరువాయి

Couple Talk: ఆ అంతరం వయసుకే.. అనుబంధానికి కాదు!
‘వయసు కాదు.. మనసు ముఖ్యం..’ తాము ఎంచుకునే జీవిత భాగస్వామిలో ఇప్పుడు చాలామంది కోరుకుంటోన్న లక్షణమిదే! అందుకే జంటల మధ్య ఎన్నేళ్ల ఎడం ఉన్నా నచ్చితే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. నిజానికి పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కంటే ప్రేమ వివాహాల్లోనే ఏళ్ల కొద్దీ వయోభేదం కనిపిస్తుంటుంది.తరువాయి

ఆ స్వేచ్ఛ ఇవ్వండి
అమ్మూకి నెలసరి మొదలైనప్పటి నుంచీ బోలెడు సందేహాలు. తల్లిని అడగడానికేమో మొహమాటం. దాంతో నెట్లో సమాచారం వెదుకుతోంది. ఇలాంటి సందర్భం ప్రతి టీనేజ్ అమ్మాయికి ఎదురవుతుంది. ఆడపిల్లల సందేహాలను అమ్మే తీర్చాలి. ఆ స్వేచ్ఛను వారికి ఇవ్వాలంటున్నారు మానసిక నిపుణులు. ఎదిగే క్రమంలో ఆడపిల్లకు శరీరంలో కలిగే మార్పులను తల్లి ఎప్పటికప్పుడు చెప్పాలి. టీనేజ్‌లోకి అడుగుపెట్టడం నుంచి హార్మోన్ల మార్పుల వరకు వివరించాలి. చదువుకునే వయసులో ఇలాంటితరువాయి

మౌనం... మంచిదే
‘రమణ, సౌమ్య దాంపత్యంలో గొడవలకు తావుండదు. ఇరువురూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు’. బంధువులనే ఈ మాటలను వింటుంటే సౌమ్యకు కొంత సంతోషంగా ఉన్నా... కాస్తంత వేదనగానూ అనిపిస్తుంటుంది. ఎందుకంటే రమణ కోపం ముందు తానెప్పుడూ మౌనంగా ఓడిపోవడం మరెవరికీ తెలీదు. అయితే కొన్ని సందర్భాల్లో మౌనమే మంచిదంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే..తరువాయి

బ్రేకప్ తర్వాత కలిశారా? ఇవి మాట్లాడద్దు..!
ప్రేమకు అంతే ఉండదు. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు అయిన పరిచయం ఇష్టంగా మారి ప్రేమకు దారితీసే సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో చాలామంది ప్రేమించిన తర్వాత తమ అభిప్రాయాలను పంచుకుంటుంటారు. మొదట్లో ఒకరి అభిప్రాయాలను మరొకరు ఆమోదించినా.. తర్వాత కొంతమందిలో అవే ప్రతిబంధకాలుగా మారుతుంటాయి.తరువాయి

పాఠశాలకు వెళ్లనంటున్నారంటే..
కొవిడ్ తర్వాత బడులు తెరుస్తున్నారనగానే విద్యకి ఊరటగా అనిపించింది. పిల్లలిద్దరూ ఉత్సాహంగా చదువులో లీనమవుతారనుకుంది. వారం రోజులు వెళ్లారో లేదో.. ఎగ్గొట్టేందుకు వంకలు వెదుకుతున్నారు. కోప్పడితే ఏడుస్తున్నారు. ఈ పరిస్థితి సాధారణమే అంటున్నారు మానసిక నిపుణులు. ఇదీ ఒకరకమైన ఒత్తిడే అంటున్నారు.తరువాయి

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!
స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు.తరువాయి

అందుకే పిల్లలకు ఎక్కువ భాషలు నేర్పించాలట!
అప్పుడప్పుడే మాటలు నేర్చుకొంటున్న చిన్నారులు పాఠశాలకు వెళ్లేంత వరకు కుటుంబ సభ్యుల మధ్యే ఉంటారు. దీంతో తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్లు ఏ భాష మాట్లాడితే దాన్నే అనుసరిస్తుంటారు. పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత ఆంగ్లం, హిందీ వంటి భాషలను సైతం తమ సిలబస్‌లో భాగంగా నేర్చుకొంటారు.తరువాయి

కంటేనే అమ్మ కాదని నిరూపిస్తున్నారు!
ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకొని అమ్మగా ప్రమోషన్ పొందుతున్నారు.తరువాయి

ఆ అభిరుచే ఇద్దరినీ ఒక్కటి చేసింది!
‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్లు’ తన విజయం వెనుక తన భార్య వినీత ఉందంటున్నాడు కొత్తగా ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన పరాగ్ అగర్వాల్. అంతేకాదు.. దంపతులంటే ప్రతి విషయంలోనూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలంటూ ఈ తరం జంటలకు ప్రేమ పాఠాలు నేర్పుతున్నారీ క్యూట్ కపుల్.తరువాయి

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?
నమస్తే మేడమ్.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను.తరువాయి

పెళ్త్లెనా.. పరాయి అమ్మాయి పంచన చేరాడు..
తల్లిదండ్రులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా ఉంటూ.. హాయిగా చదువు కొనసాగిస్తోన్న ఓ అమ్మాయికి పెళ్లి చేశారు. అతడు భార్య ముందు శ్రీరామచంద్రుడు. బయట మాత్రం శ్రీకృష్ణుడు. మరి, అతని గురించి ఆమెకు ఎలా తెలిసింది? ఆమె ఆ సమస్యను ఎలా ఛేదించింది?.. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే..తరువాయి

New Couple : ఉదయాన్నే ఇలా చేస్తే మీ బంధం పదిలం!
నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రకు ఉపక్రమించే దాకా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమవుతుంటారు భార్యాభర్తలు. అలాంటప్పుడు ఒకరితో ఒకరు గడిపే తీరిక, సమయం ఇంకెక్కడుంటుంది. నిజానికి ఈ బిజీ షెడ్యూలే ఆలుమగల అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు రిలేషన్షిప్ నిపుణులు.తరువాయి

ఆ లోపమే నాకు వరమైందేమో అనిపిస్తుంది!
పుట్టుకతో వచ్చిన శారీరక లోపాలకు మనం బాధ్యులం కాము. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది ఇలాంటి వారిని చులకనగా చూస్తుంటారు. ఆ లోపాల్ని ఎత్తి చూపుతూ.. కామెంట్లు చేస్తుంటారు.. జోకులు పేల్చుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు అవతలి వారికి బాధ కలిగిస్తాయేమోనన్న కనీస ఆలోచన కూడా వారికి ఉండదు.తరువాయి

Bride To Be : పెళ్లికి ముందే ఇవి తెలుసుకోండి!
అప్పటిదాకా సోలోగా ఎలా గడిపినా.. పెళ్లయ్యాక మాత్రం ఎన్నో బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం కుటుంబ పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు.. అయితే ఇలాంటి వాటి గురించి పెళ్లికి ముందే ఓ అవగాహన ఉండడం అవసరం అంటున్నారు నిపుణులు.తరువాయి

చిన్నారులేం చూస్తున్నారు...
ఇంట్లో పిల్లలు గంటలతరబడి ఫోన్లో ఏం చూస్తున్నారనే ఆరా తల్లిదండ్రులకు ఉండాలి. ఎటువంటివి చూడాలి, ఏవి చూడకూడదనే విషయంపై పిల్లలకు అవగాహన కలిగించే బాధ్యత పెద్దవాళ్లదే అంటున్నారు నిపుణులు... ప్రస్తుత కాలంలో సోషల్నెట్ వర్కింగ్ వేదికలు, మెసేజింగ్ రూంలు, వర్చువల్ వరల్డ్స్, బ్లాక్స్వంటివి పెరిగాయి. స్నేహాల నుంచి క్రీడల వరకు మొత్తమంతా ఆన్లైన్ వేదికగా మారింది. వయసుతో...తరువాయి

అద్దెగర్భం ద్వారా అమ్మతనాన్ని పొందారు!
పెళ్లైన ప్రతి మహిళా మాతృత్వాన్ని పొందాలని, తద్వారా తన జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలని ఆరాటపడుతుంది. అయితే పలు ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇతర కారణాలు.. ఎంతోమంది స్త్రీలను అమ్మతనానికి దూరం చేస్తున్నాయి. ఇలాంటి వారందరికీ అద్దెగర్భం (సరోగసీ) ఓ వరంలా పరిణమించిందని చెప్పచ్చు.తరువాయి

నిజ జీవితంలోనూ తను అలాంటివాడేనేమో అనుకున్నా!
‘ప్రేమించడం కన్నా ఎదుటివారి ప్రేమను పొందడం గొప్ప విషయం అంటుంటారు.. ఈ విషయంలో నేను మాత్రం అందరికంటే అదృష్టవంతురాలిని!’ అంటోంది కొత్త పెళ్లి కూతురు పత్రలేఖ. బాలీవుడ్ నటుడు, తన ఇష్టసఖుడు రాజ్‌కుమార్ రావ్‌తో తాజాగా ఏడడుగులు నడిచి తన పదకొండేళ్ల ప్రేమాయణాన్ని శాశ్వతమైన అనుబంధంగా మార్చుకుందీ ముద్దుగుమ్మ.తరువాయి

డేటింగ్ యాప్స్‌లో ఇలాంటి కేటుగాళ్లూ ఉంటారు జాగ్రత్త!
ఆ అమ్మాయిది రాజమండ్రి. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటోంది. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్. అలాగని ఎవరితోనూ అంత త్వరగా మాట కలిపే మనస్తత్వం కాదు.. అయినా సరే.. ఓ డేటింగ్ యాప్‌లో ఒకతని ఫొటో చూసి ఇష్టపడింది. అతనితో స్నేహం చేయడం ప్రారంభించింది.తరువాయి

చేతిలో చెయ్యేస్తే ప్రయోజనాలెన్నో..!
'చేతిలోన చెయ్యేసి చెప్పేయవా.. నిన్ను ఎన్నడూ.. విడిపోనని..' అంటూ ప్రేయసీ ప్రేమికులు ఒకరి చేతిలో మరొకరు చేతులేసి బాసలు చేసుకోవడం మనకు తెలిసిందే. ఇదే కాదు.. కొంతమంది ఎక్కడికెళ్లినా భాగస్వామి చెయ్యి పట్టుకొని నడవడం మనం చూస్తూనే ఉంటాం. మన ప్రేయసి లేదా ప్రియుడు లేక జీవిత భాగస్వామి చేతిని మొదటిసారి పట్టుకున్న సందర్భం మనకు జీవితాంతం గుర్తుంటుంది.తరువాయి

Malala Wedding: నా జీవితంలో మరపురాని రోజిది!
‘పెళ్లనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం.. రెండు మనసుల్ని కలకాలం కలిసి నడిపించే విలువైన క్షణం.. అలాంటి అందమైన రోజిది’ అంటోంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్. అసర్ మాలిక్ అనే వ్యాపారవేత్తతో తాజాగా ఏడడుగులు నడిచి తన బ్యాచిలరెట్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పిందీ పాక్ ఉద్యమకారిణి.తరువాయి

Love & Dating: ఇద్దరి మధ్య వయసు తేడా ఉందా..?
ఈ తరం యువత ప్రేమ, పెళ్లికి ముందు డేటింగ్ కూడా అవసరమని అనుకుంటున్నారు. డేటింగ్ చేసేవారికి కులం, మతం, జాతి, వర్ణం, వయసు.. మొదలైనవేవీ అడ్డంకులు కావడం లేదు. అయితే డేటింగ్ విషయంలో మిగతా అంశాల మాదిరిగానే ఇద్దరి మధ్య ఉండే వయసు తేడా కూడా తమ అనుబంధంపై ప్రభావం చూపిస్తుంటుంది.తరువాయి

పెళ్లైన కొత్తలో.. ఇష్టపడితే కష్టమనిపించదు!
ఈ కాలపు దంపతుల్లో భాగస్వామి కోసం నేనెందుకు మారాలన్న స్వార్థ పూరిత ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు మితిమీరిన స్వీయ ప్రేమ లేదంటే స్వతంత్రంగా బతకడం.. ఇలా ఏదైనా కారణమై ఉండచ్చు. అయితే ఇద్దరి మధ్య అన్ని విషయాల్లో ఈ స్వార్థం పనికి రాదంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.తరువాయి

మాటే.. మంత్రం!
ఏదైనా పని పూర్తవ్వాలనుకోండి! కొద్ది గంటలు, రోజులు శ్రమపడితే సరిపోతుంది. కానీ బంధం అలాకాదు. ఆ ప్రయాణం సాఫీగా సాగడానికి ఇద్దరూ నిరంతరం కష్టపడాల్సిందే. ఈ కలతలు అప్పుడప్పుడూ ఎదురయ్యే చిన్న అడ్డంకుల్లాంటివి. సరిచేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. దానికి ఉపయోగపడే ప్రధాన టూల్.. కమ్యూనికేషన్! అదేనండీ... మాట్లాడుకోవడం.తరువాయి

హర్ట్ అయినా సరే.. పెద్ద మనసుతో క్షమించేద్దాం!
స్నేహితుల మధ్య గొడవలు.. ప్రేమికుల మధ్య మనస్పర్థలు.. భార్యాభర్తల మధ్య అపార్థాలు.. ఇలా సందర్భమేదైనా ఇద్దరిలో ఒకరు ఇంకొకరిని హర్ట్ చేయడం, ఆ కోపంతో మనల్ని బాధపెట్టిన వారిని దూరం పెట్టడం, వారితో మాట్లాడడం పూర్తిగా మానేయడం.. వంటివి చాలామంది విషయంలో జరుగుతూనే ఉంటాయి.తరువాయి

ఆ సాన్నిహిత్యం చక్కటి శృంగారానికీ సోపానం!
వైవాహిక జీవితంలో శృంగారం కీలక ఘట్టం. అయితే రాన్రానూ చాలా జంటల్లో ఈ ఆసక్తి క్రమంగా తగ్గుతోందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా వివాహ బంధాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నామని చాలామంది దంపతులు అసంతృప్తికి గురవుతున్నారట! వాస్తవానికి వివాహ బంధం దృఢంగా ఉండడానికి శృంగారం ఒక్కటే సాధనం కాదు.తరువాయి

స్నేహానికి కేరాఫ్ అడ్రెస్
అమ్మా నాన్నా, జీవిత భాగస్వామి, తోడబుట్టిన వాళ్లు, స్నేహితులు.. ఇలా మన జీవితంలో ఎందరెందరో ఉంటారు. కానీ అందరితో అన్ని విషయాలూ చెప్పుకోలేం. మనసు లోతుల్లోని బాధను దాపరికం లేకుండా పంచుకోవాలన్నా, సినిమాలూ షికార్ల గురించి హాయిగా జోకులేసుకోవాలన్నా అందుకు అనువైన వాళ్లు కచ్చితంగా కజిన్సే. ఎందుకంటే...తరువాయి

Love-Dating: తప్పుదోవ పట్టకుండా పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి?
రోజూ స్కూల్లో/కాలేజీలో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకుంటాం.. పాఠ్యాంశాల్లో సందేహాలుంటే నివృత్తి చేస్తాం. ఇలా తల్లిదండ్రులుగా పిల్లల ప్రతి అడుగులోనూ కీలక పాత్ర పోషిస్తాం. అయితే ప్రేమ, డేటింగ్ దగ్గరికొచ్చేసరికి మాత్రం అవేవో తప్పుడు విషయాలన్నట్లు వాటి గురించి మాట్లాడడానికి నిరాకరించడం, చాటుమాటుగా గుసగుసలాడడం..తరువాయి

ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?
అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.తరువాయి

కాలేజీ ప్రేమ పెళ్లిపీటలెక్కింది!
అందం, తరగని ఆస్తిపాస్తులున్నా.. ఆమె సింప్లిసిటీ అతనికి నచ్చింది.. గుర్రపు పందేల్లో రాణిస్తూ రికార్డులు కొల్లగొడుతోన్న అతని మనసు ఆమెను కట్టిపడేసింది. దాంతో చదువుకునే వయసులోనే ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు వారిద్దరూ. అభిరుచులతో పాటు మనసులు కూడా కలవడంతో తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు.
తరువాయి

బంధాలను నిలిపే ఆర్థిక స్వాతంత్య్రం
రాశి జీతాన్ని భర్తకే ఇచ్చేస్తుంది. అవసరమైనప్పుడు అడిగి తీసుకుంటుంది. అత్యవసర సందర్భాల్లో తన బ్యాగులో రూపాయి కూడా లేకపోవడం ఆమెను వేదనకు గురిచేస్తోంది. ఆ మాటే భర్తతో అంటే నీకేం ఖర్చులుంటాయి అంటాడు. ఇటువంటివే బంధాన్ని బీటలు వారుస్తాయని అంటున్నారు మానసిక నిపుణులు.తరువాయి

నచ్చిన వ్యక్తికి ఇలా దగ్గరవ్వండి..!
మనలో చాలామంది ఒక వ్యక్తిని ప్రేమించడం కంటే.. ప్రేమిస్తోన్న విషయాన్ని ఆ వ్యక్తికి తెలియజేయడమే చాలా కష్టమైన పనిగా భావిస్తుంటారు. దీనికి కారణం ఎదుటి వ్యక్తి మన ప్రేమను అంగీకరిస్తే సరే.. లేదంటే అప్పటివరకు తమ మధ్య ఉన్న పరిచయం, స్నేహం ఎక్కడ పాడవుతాయో అని భయంతో చెప్పకుండా ఆగిపోతుంటారు.తరువాయి

ఈ చిన్న పనులే మిమ్మల్ని దగ్గర చేస్తాయి!
పిల్లలకు స్కూలు, పెద్దవాళ్లకు ఆఫీస్.. ఉదయం లేవగానే ఇలా ఎవరి హడావిడి వాళ్లకుంటుంది. పోనీ సాయంత్రమన్నా ఖాళీ దొరుకుతుందా అంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికే ఆలస్యమవుతుంటుంది. దీంతో మీరు మీ పిల్లల్ని మిస్సవడం, వాళ్లు మిమ్మల్ని మిస్సవడం.. వంటివి జరుగుతుంటాయి. ఇదే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి ప్రేమ తగ్గిపోయేలా చేస్తుందంటున్నారు నిపుణులు.తరువాయి

మలి వయసులో మళ్లీ ప్రేమను వెతుక్కున్నారు!
‘ప్రేమకు సరిహద్దులు లేవు... ప్రేమకు వయసుతో సంబంధం లేదు’... సినిమాల్లో వినిపించే ఈ మాటలు... ఈ మధ్య కాలంలో నిజ జీవితంలోనూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మలి వయసులో భార్య/భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన వారు మళ్లీ తమకంటూ ఓ తోడును వెతుక్కొంటున్నారు.తరువాయి

Alimony: విడాకులు తీసుకున్నప్పుడు భరణం ఎందుకు వద్దంటున్నారు?
వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకునే క్రమంలో భర్త నుంచి భార్యకు నగదు/ఆస్తుల రూపంలో ఎంతో కొంత భరణంగా దక్కడం మనకు తెలిసిందే! అప్పటిదాకా వెన్నంటే ఉండి తన బాధ్యతల్ని చూసుకున్న భర్త.. ఇకపై తన వెంట లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకాకూడదన్నది దీని ముఖ్యోద్దేశం.తరువాయి

మోడ్రన్ దంపతులారా.. కలతలకు ఇలా కళ్లెం వేయండి!
సంసారమన్నాక మనస్పర్థలు, గొడవలు సహజమే! అయితే దంపతుల్లో ఎవరో ఒకరు రాజీపడి వీటిని సద్దుమణిగేలా చేస్తేనే కాపురం సజావుగా ముందుకు సాగుతుంది. కానీ ఇలా అర్థం చేసుకునే తత్వమున్న దంపతులు ఈ కాలంలో చాలా అరుదుగానే కనిపిస్తున్నారంటున్నారు నిపుణులు. ఇందుకు ఆర్థిక స్వాతంత్ర్యం, అసూయాద్వేషాలు, పురుషాధిపత్యం..తరువాయి

నూరేళ్ల బంధం ఎందుకు వీగిపోతోంది?
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు.. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు.తరువాయి

అతని చావుకి నేనే కారణమంటున్నారు.. ఏం చేయాలి?
హాయ్ మేడమ్.. నా వయసు 26. మా బంధువులబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని విసిగించేవాడు. అతని ప్రేమను నేను చాలాసార్లు తిరస్కరించాను. దాంతో అతను సూసైడ్ చేసుకున్నాడు. ‘నా చావుకి కారణం ప్రేమ విఫలమవడమే’ అని సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఇప్పుడు మా బంధువులందరూ నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు.తరువాయి

నా భర్త హోమోసెక్సువల్... అందుకే అలా చేశా!
'నేను తప్పు చేశానని నాకు తెలుసు.. కానీ ఆ విషయం చెప్పాలంటే నాకు ధైర్యం చాల్లేదు. అందుకే ఇన్నాళ్ల నుంచీ మౌనంగా ఉండిపోయా. నిన్ను ఇబ్బందిపెట్టా.. నన్ను క్షమించు.. కావాలంటే నువ్వు నాకు విడాకులు ఇవ్వొచ్చు..' అంటూ రాహుల్ నన్ను అభ్యర్థిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక అలాగే కూలబడిపోయాను.తరువాయి

పాప కారణంగా మా మధ్య దూరం పెరుగుతోంది.. ఏం చేయాలి?
మేడం.. ప్రస్తుతం నేను 11నెలల వయసున్న బిడ్డకు తల్లిని. మా పాప చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ నాతో ఆడుతూనే ఉంటుంది. ఉదాహరణకు పాప ఒక 40ని|| నిద్రపోతే 4గం||పాటు నాతో ఆడుకునేందుకే మొగ్గుచూపుతుంది. రాత్రిళ్లు కూడా అర్ధరాత్రి 2 లేదా 3గం|| వరకు మాత్రమే పడుకుంటుంది.తరువాయి

అతను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడా??
'ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే..' ఏంటీ మీ బాయ్‌ఫ్రెండ్ కూడా మిమ్మల్ని చూసి ఇలాగే పాడుతున్నాడా?? మరి అతను చూపించేది నిజమైన ప్రేమైతే సంతోషమే.. లేదంటే తర్వాత బాధపడాల్సింది మాత్రం మీరే. ప్రేమించడం, ప్రేమించబడడం ఎవరి జీవితంలోనైనా మర్చిపోలేని అనుభూతే.తరువాయి

మౌనమే మేలోయి
సంసారమన్నాక సమస్యలు ఉంటాయి. సంతోషాలు పంచుకున్నప్పుడు రాని అహం... చిన్న విషయంలో మాట పడాల్సి వచ్చినా అడ్డం పడిపోతుంది. అది మీ మధ్య గోడకట్టేయకుండా కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. సరదాగా వచ్చే సమస్యలైనా, మాట తూలినందుకు ఫలితం అయినా సమస్యను సమస్యగానే చూడండి. దాన్ని పాత పొరబాట్లతో ముడిపెట్టొద్దు. సమస్య ఎవరి వల్ల వచ్చినా ముందు మీరే చొరవ తీసుకునితరువాయి

పిల్లలు ఫోన్ వదలడం లేదా?
మూడేళ్ల పిల్లల దగ్గర్నుంచీ ముప్పయ్యేళ్ల అమ్మాయిల దాకా టీవీ, ఫోన్లకు అతుక్కుపోతున్నారనేది మనందరికీ తెలిసిన సంగతే. చిన్నారులైతే చదువుకు ఆటంకం కలుగుతుందని, ఎదిగిన పిల్లలయితే వృత్తి ఉద్యోగాల్లో పైకి రాలేరని అమ్మలందరి బాధా భయమూ.. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కొన్ని నియమాలు పెట్టి కొంత కఠినంగా వ్యవహరించక తప్పదంటున్నారు మానసిక నిపుణులు.తరువాయి

ఇద్దరి మధ్యా ఆ దూరం పెరుగుతోందా?
నిండు నూరేళ్ల దాంపత్య బంధంలో ఆలుమగల్ని కలిపి ఉంచడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. వాటిలో శృంగారం ఒకటి. కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా, ఎమోషనల్‌గా ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేస్తుందిది. అయితే ప్రస్తుతం చాలామంది దంపతుల మధ్య ఇది కొరవడుతుందని, దాంతప్య బంధంలో గొడవలకు ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులుతరువాయి

ఆ ఫొటోలతో బెదిరించాడు.. అలా బుద్ధి చెప్పా!
ఓ అబ్బాయి.. అమ్మాయి.. గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం అమ్మాయి ఇంట్లో తెలిసి ముందు చదువుపై దృష్టి పెట్టమన్నారు.. దాంతో ఆ అమ్మాయి భవిష్యత్తుపై దృష్టి పెడుతూనే ప్రియుడితో అప్పుడప్పుడూ మాట్లాడేది. కానీ అతని ప్రవర్తనలో మార్పు వచ్చాక క్రమంగా ప్రియుడి నుంచి దూరం జరగడం మొదలుపెట్టింది.తరువాయి

చనిపోతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు.. మా పెళ్లికి ఎలా ఒప్పించాలి?
నమస్తే మేడమ్.. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మాది, వాళ్లది ఒకటే కులం. కానీ మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కారణం కూడా చెప్పడం లేదు. అతను జాబ్ చేస్తున్నాడు. వాళ్లది మంచి కుటుంబం.. పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. కానీ మా తల్లిదండ్రులే ఒప్పుకోవడం లేదు.తరువాయి

Teen Career : తల్లిదండ్రులూ.. ఇవి గుర్తుపెట్టుకోండి!
తెలిసీ తెలియని వయసులో పిల్లలు.. ‘నేను పెద్దయ్యాక డాక్టరవుతా.. ఆస్ట్రోనాట్ అవుతా..’ అని చెబుతుంటారు. కానీ పెరిగే కొద్దీ చాలామందిలో కెరీర్ ప్రాథమ్యాలు మారుతుంటాయి. నిజానికి టీనేజ్‌లోకి అడుగుపెట్టాకే అసలు వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారోనన్న స్పష్టమైన అవగాహన వారిలో వస్తుంది.తరువాయి

మా పెళ్లైపోయింది.. హనీమూన్కెళ్లాం..!
ఈ కరోనా ఏమో గానీ అందరినీ పిలిచి ఆడంబరంగా చేసుకోవాల్సిన వివాహాలు కాస్తా నిరాడంబరంగా జరిగిపోతున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పంచుకుంటే తప్ప ఫలానా వాళ్ల పెళ్లైపోయిందన్న విషయం తెలియట్లేదు. బబ్లీ బ్యూటీ విద్యుల్లేఖా రామన్ పెళ్లి విషయం కూడా అందరికీ ఇలాగే తెలిసింది.
తరువాయి

Couple Equality: అలా భార్య ఆశీర్వాదం తీసుకున్నారు!
మన హిందూ సంప్రదాయపు పెళ్లిళ్లలో భార్యలు భర్తల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం పరిపాటే! అయితే భార్యాభర్తలిద్దరూ సమానమైనప్పుడు భర్త కూడా భార్య ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదంటున్నారు ఈ తరానికి చెందిన కొందరు భర్తలు. మాటల్లో చెప్పడం కాదు.. ఆచరించి చూపించారు కూడా!తరువాయి

అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!
విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది.తరువాయి

ఆ దేశాల్లో పిల్లల్ని ఎలా పెంచుతారో తెలుసా?
పిల్లల్ని చిన్నతనం నుంచి పెంచే విధానాన్ని బట్టే పెద్దయ్యాక వాళ్ల ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నది చాలామంది నమ్మకం. ఈ క్రమంలోనే ఎంతో క్రమశిక్షణతో పెంచుతుంటాం. రెండేళ్లు దాటగానే బడికి పంపడం, చిన్న పొరపాటుకే చీవాట్లు పెట్టడం, ఎప్పుడు చూసినా చదువు చదువు అంటూ వాళ్ల వెంట పడడం..తరువాయి

ఇలా చేస్తే అత్తిల్లూ పుట్టిల్లే..!
అప్పటిదాకా పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా, గారాబంగా పెరిగిన ఆడపిల్ల పెళ్లయ్యాక అత్తింట్లో అడుగుపెట్టగానే ఆమెపై ఎన్నో బరువు బాధ్యతలు వచ్చిపడతాయి. మరి, వాటన్నింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగితేనే అటు పుట్టింటి గౌరవాన్ని, ఇటు మెట్టినింటి అనురాగాన్ని సొంతం చేసుకోవచ్చు.తరువాయి

అప్పుడు తప్పుగా ఊహించుకున్నాం!
ప్రేమ విషయంలో ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’కు ఎంతో ప్రాధాన్యముంది. తొలిచూపులోనే ఒకరికొకరు ఇష్టపడడం, అభిప్రాయాలు పంచుకోవడం...ఇలా ప్రేమకు కావాల్సిన పునాది అంతా తొలి పరిచయంలోనే జరుగుతుందంటారు. అయితే తన ప్రేమ విషయంలో మాత్రం ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’కు అంత ప్రాధాన్యం లేదంటున్నాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.తరువాయి

ఇష్టం లేని మొగుడితో సంసారం చేయించాలని చూశారు!
ముక్కుపచ్చలారని వయసులో బలవంతంగా మూడుముళ్లు వేయించుకుని, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో ఇంటెడు చాకిరీ చేస్తూ, చదువుకోవాల్సిన వయసులో చంకన చంటి బిడ్డనెత్తుకొని.. ఇలా బాల్య వివాహపు ఊబిలోకి కూరుకుపోయిన ఆడపిల్లల వెతలు ఇప్పటికీ అడపాదడపా కనిపిస్తూనే ఉంటాయి.తరువాయి

ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిందా?
‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’ అన్నాడో సినీ కవి. శాశ్వతమనుకున్న స్నేహబంధం కూడా అప్పుడప్పుడూ చిక్కుల్లో పడచ్చు.. చినికి చినికి గాలి వానలా మారి ఇద్దరూ విడిపోయేదాకా రావచ్చు. మరి, అప్పటిదాకా మన అనుకున్న వాళ్లే మన నుంచి దూరమైతే ఆ బాధను తట్టుకోగలమా? వాళ్ల జ్ఞాపకాల నుంచి బయటపడగలమా?తరువాయి

అప్పుడు ప్రేమ కోసం రాచరికాన్నే వద్దనుకుంది... ఇప్పుడు అది కూడా!
ప్రేమ అనే రెండక్షరాల మధురమైన బంధం కోసం ఆస్తులు, అంతస్తులేంటి.. సర్వం వదులుకోవడానికైనా సిద్ధపడతారు నిజమైన ప్రేమికులు. ఆ బంధంలో అంతటి మాధుర్యం ఉంది మరి..! అందుకేనేమో ఒక సామాన్యుడి ప్రేమ కోసం ఏకంగా తన రాచరిక హోదానే వదులుకోవాలనుకుంది జపాన్ యువరాణి మాకో. పుట్టినప్పటి నుంచి తాను గడిపిన విలాసవంతమైన జీవితాన్ని వద్దని ఒక మాములు వ్యక్తితో పెళ్లిపీటలెక్కాలనుకుంటోంది.తరువాయి

అమ్మాయిలకు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదట!
అమ్మానాన్నలనే చూస్తూ.. వారి బాటలోనే పయనమంటూ చాలా విషయాల్లో తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకుంటారు అమ్మాయిలు. ఇక పిల్లల ఆనందమే పరమావధిగా భావించే పేరెంట్స్ కూడా తమ కూతుళ్ల భవిష్యత్ గురించే నిత్యం ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ రకాల సూచనలు, సలహాలు అందజేస్తుంటారు.తరువాయి

మాటలతో.. గాయపరచొద్దు!
వివాహబంధం సున్నితమైంది. సంసారమన్నాక చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయి. అంత మాత్రాన కోపం, ఆవేశం లాంటి వాటిని ఎదుటి వారిపై చూపొద్దు. కోపంలో లేదా హేళనగా మీరనే ఓ చిన్నమాట భాగస్వామి మనసును నొప్పించొచ్చు. ఇది కొనసాగితే మీ బంధం బలహీనమవ్వొచ్చు. చాలా జంటలు గొడవలు పడ్డప్పుడు ఒకరంటే మరొకరికి ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడుకుంటారు. మీరూ ఆ కోవకి చెందిన వారా..తరువాయి

అమ్మ గురించి ఆ బిడ్డకు తెలియాలని..!
లాస్ ఏంజెలిస్‌కు చెందిన జేమ్స్‌కు తన భార్య యెసెనియా అంటే ఎంతో ప్రేమ. తమ ఆలుమగల బంధానికి ప్రతీకగా ఓ చిన్నారిని తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు కూడా రడీ అయ్యారు. పుట్టబోయే బుజ్జి పాపాయిని ఊహించుకుంటూ ఎంతో ఉత్సాహంగా మెటర్నిటీ ఫొటోషూట్ తీయించుకున్నారు. ఇలా భార్యా పిల్లలతో తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న జేమ్స్ జీవితం ఓ యాక్సిడెంట్‌తో పూర్తిగా తలకిందులైంది.తరువాయి

లవ్ మ్యారేజే.. అయినా తన సంప్రదాయాలే పాటించాలంటున్నాడు!
నమస్తే మేడమ్.. నా వయసు 29 సంవత్సరాలు. మాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతోంది. మాది మతాంతర వివాహం. ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైన ఆరు నెలలకి మా అత్తింటివారితో జరిగిన గొడవ వల్ల బయటకు వచ్చేశాం. అప్పటినుంచి నా భర్త మత సంప్రదాయాలను నేను పాటించడం లేదు.తరువాయి

అల్లరి గడుగ్గాయిలను అదుపు చేద్దామిలా..!
ఇలాంటి చిచ్చరపిడుగులను ప్రస్తుతం చాలామంది ఇళ్లలో చూస్తూనే ఉంటాం. సాధారణంగా చిన్నారులు ఎదిగే కొద్దీ పెద్దలు చెప్పే మాటలు వింటూ బుద్ధిగా నడుచుకుంటారు. కానీ కొందరు మాత్రం అసలు పెద్దవాళ్లు చెప్పే మాటలేవీ పట్టించుకోరు. ముఖ్యంగా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించే పిల్లతైతే మరీనూ!తరువాయి

Financial Abuse: ఆ విషయంలో మోసపోయారా?
అవగాహన లోపమో లేదంటే అంతా ఆయన చూసుకుంటారన్న అతి విశ్వాసమో.. కొంతమంది మహిళలు తమ డబ్బు నిర్వహణ బాధ్యతలు తమ భర్తల చేతుల్లో పెడుతుంటారు. అయితే మొదట్లో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మీకు తెలియకుండానే ఖాతాల్లోంచి వేలకు వేలు మాయమవడం, మిమ్మల్ని వారి గుప్పిట్లో పెట్టుకొని డబ్బు విషయంలో హింసించడం, మీ పేరిటతరువాయి

కంటే కొడుకునే కనమని టార్చర్ చేస్తున్నాడు.. నేను చేసింది తప్పా?
అమ్మ కావాలి.. తోబుట్టువు కావాలి.. భార్య కావాలి.. కానీ కూతుర్ని మాత్రం కనొద్దనుకుంటారు కొందరు ప్రబుద్ధులు. పుత్రుడైతే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని, తమ ఆస్తిపాస్తులను కాపాడే సంరక్షకుడవుతాడని భ్రమ పడుతుంటారు. ఈ నెపంతో కట్టుకున్న ఇల్లాలిని హింస పెట్టే మూర్ఖులూ లేకపోలేదు.తరువాయి

రెండోసారి ప్రేమలో... ఆ తప్పు మళ్లీ జరక్కుండా చూసుకోండి!
‘ఓసారి ప్రేమించాక.. ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా.. ఓసారి కలగన్నాక.. ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా..’ అవును.. ప్రేమంటే అదే మరి! కానీ వ్యక్తిగత కారణాలు, చిన్న చిన్న మనస్పర్థలే ప్రస్తుతం చాలామంది ప్రేమికుల మధ్య చిచ్చుపెడుతున్నాయి.తరువాయి

నా దృష్టిలో రక్షా బంధన్ అంటే అదే!
అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈరోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. అన్నాతమ్ముళ్లు ఉంటే ఓకే.. మరి సోదరులు లేని అక్కాచెల్లెళ్లు ఈ పండుగను జరుపుకోకూడదా? అంటే నిస్సందేహంగా జరుపుకోవచ్చంటోంది బాలీవుడ్ బ్యూటీ భూమీ పెడ్నేకర్.తరువాయి

అతిగా ఆందోళన చెందేవారితో ఎలా ఉండాలంటే...?
మన చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యక్తుల్లో ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా ఆలోచించేవారు, ఆందోళన చెందేవారు.. ఎందరో! సాధారణంగా ఇటువంటివారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు రిలేషన్షిప్ నిపుణులు. అందులోనూ ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ప్రస్తుతం దాని గురించి అందరిలోనూ విపరీతమైన భయాందోళనలు పెరిగిపోయాయి.తరువాయి

సమయం విలువ తెలపాలి
కరోనా వల్ల పిల్లలకి పాఠశాలలు లేవు. ఆన్లైన్ క్లాస్లున్నా అవయ్యాక వాళ్ల వీడియో గేమ్స్‌లో వాళ్లు బిజీ. తినే టైమ్ మారిపోతుంది. పడుకునే సమయం దాటిపోతుంది. ఇలాగే ఉంటే రేపు బడులు తెరిచాక చాలా ఇబ్బంది పడతారు. ఆహార మార్పుల వల్లా అనారోగ్యాల బారినా పడతారు. అందుకే వాళ్లకి సమయం విలువ తెలపాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే!తరువాయి

ప్రేమ మైకంలో కూరుకుపోయా.. కట్టుకున్నవాడికే దూరమయ్యా..
కన్న తల్లిదండ్రులనే పట్టించుకోని ఈ రోజుల్లో పిల్లనిచ్చిన అత్తామామలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునే మగవాళ్లు ఎంతమందుంటారు? మిగతా వాళ్ల గురించి నాకు తెలీదు కానీ.. మా ఆయన మాత్రం దేవుడు! మా పేరెంట్స్ విషయంలో ఆయన కన్న కొడుక్కన్నా ఎక్కువగా వ్యవహరించారు.తరువాయి

ఒంటరి పెంపకంలో...
అమ్మానాన్నలు వేర్వేరుగా ఉన్నప్పుడో లేదా ఒకరిని కోల్పోయినప్పుడో పిల్లలు రెండో వారి దగ్గరే పెరుగుతారు. ఇలాంటి పిల్లల్లో ఆత్మనూన్యత, భయం ఉంటాయనుకుంటాం. కానీ వారిలో చిన్నప్పటి నుంచి బాధ్యతాయుతమైన గుణాలు పెంపొందుతాయని ‘2019-20 యునైటెడ్ నేషన్స్ వుమెన్’ అధ్యయనం తేల్చింది. మన దేశంలో 4.5 శాతం తల్లి లేదా తండ్రులు ఒంటరిగానే పిల్లలను పెంచుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ...తరువాయి

పెళ్లిలో ఫొటోషూట్ అందంగా ఇలా..!
అబ్బబ్బా.. ఈ గోలంతా ఏంటని అనుకుంటున్నారు కదూ.. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది కదా.. పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలు ఫొటోల మీద ఫొటోలు దిగడానికి సిద్ధమైపోతుంటారు. ఎందుకంటే పెళ్లిలో వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా!! పెళ్లి తంతును కవర్ చేయడం.. వధూవరులిద్దరినీ వేర్వేరు యాంగిల్స్‌లో ఫొటోల్లో బంధించడం.. ఇవన్నీ ఇప్పుడు ఫొటోషూట్ ప్యాకేజీలో భాగమే. ఈ క్రమంలో పెళ్లిలో వధూవరుల ఫొటోలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?తరువాయి

అది చూసే ఫిదా అయిపోయా!
సెలబ్రిటీలే అయినా కొందరు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ అందరితో పంచుకుంటే.. మరికొందరు మాత్రం వీటిని చాలా గోప్యంగా ఉంచుతుంటారు. లవ్‌బర్డ్స్ నయనతార-విఘ్నేష్ శివన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు..! తమ మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఎప్పుడూ ఫొటోల రూపంలో చెప్పడమే కానీ.. మాటల రూపంలో అధికారికంగా పంచుకుంది లేదు.
తరువాయి

Break Up : ప్రేమ లేనప్పుడు విడిపోవడానికి భయమెందుకు?
దాంపత్య జీవితంలో కలహాలు కామన్! అయితే ఇవి హద్దుల్లో ఉన్నంత వరకే ఇద్దరూ సర్దుకుపోగలరు. అదే హద్దు దాటినా, ‘ఇక తనతో వేగడం నా వల్ల కాదు’ అన్న ఆలోచన ఏ ఒక్కరి మనసులో వచ్చినా ఇక ఆ బంధం క్రమంగా బలహీనపడుతుంది. అప్పటికీ పిల్లల కోసమో, కుటుంబాల కోసమో.. బంధాన్ని కొనసాగించే వారూ లేకపోలేదు. కానీ విడిపోదామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రం వారిని కలిపి ఉంచడానికి ఇతరులు చేసే ప్రయత్నాలన్నీ వృథానే అవుతుంటాయి.తరువాయి

పిల్లల్లో సున్నితత్వాన్ని దూరం చేయండిలా..!
పిల్లలు సాధారణంగానే చాలా సున్నిత మనస్కులు. కొందరు పిల్లలైతే మరీనూ..! కాస్త గట్టిగా మాట్లాడితే చాలు.. నీళ్ల కుండ తలమీదే పెట్టుకున్నట్లు జలజలా కన్నీరు కార్చేస్తారు. ఇలాంటి స్వభావం ఉండే పిల్లలతో చాలా జాగ్రత్తగా మెలగాలి, మాట్లాడాలి. లేదంటే వారిలో ఒత్తిడి పెరిగి అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి మీ పిల్లలు కూడా సున్నిత మనస్కులా?? అయితే వాళ్లతో ఎలా మెలగాలి? తెలుసుకుందాం రండి..తరువాయి

ఒక్కరోజు కూడా మిస్సవ్వకుండా నిన్ను ప్రేమిస్తుంటాను!
ప్రేమికులకు ‘తొలి పరిచయం’ అనేది ఓ తీపి గుర్తు. తమ ప్రేమ బంధానికి పునాది వేసిన ఆ రోజును వారి జీవితాల్లో ఎంతో అపురూపమైనదిగా భావిస్తారు. అందుకే ఆ ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడల్లా ప్రేమికుల్లో ఒక రకమైన ఉత్సాహం, సంతోషం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే తేలియాడుతున్నారు అవికా గోర్-మిలింద్ చంద్వానీ. తమ ప్రేమబంధం చిగురించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వెకేషన్‌కి వెళ్లారీ లవ్ బర్డ్స్. ఈ సందర్భంగా అక్కడి అందమైన ప్రదేశాల్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయారు.తరువాయి

పేరెంటింగ్ ఓకే... షేరెంటింగ్ వద్దు !
ముద్దుగా ఉన్నాయని మీ బాబు మాట్లాడే ప్రతి మాటను ఫేస్బుక్లో పెడుతున్నారా ? బాగా చదువుతోందనో, డ్యాన్స్ చేస్తోందనో మీ పాప ప్రతి కదలికను పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నారా ? అయితే జాగ్రత్త ! వాటివల్ల తెలీకుండానే మీ పిల్లలు వివిధ ఇబ్బందులకు లోనవ్వచ్చు. పిల్లలే లోకంగా బతికే ప్రతి తల్లీదండ్రీ తమ పిల్లల గురించి జనం తెలుసుకోవాలని ఉవ్విళ్లూరడం సహజం. అయితే ఇది శృతి మించి 'షేరెంటింగ్'గా మారి పిల్లల భవితవ్యానికి భారంగా మారుతుందని మీకు తెలుసా ? అసలు ముందు ఈ షేరెంటింగ్ అంటే ఏంటంటారా ? అయితే వివరాలలోకి వెళ్లాల్సిందే !తరువాయి

ఆ నవ్వును చూడగానే ప్రపంచాన్ని మర్చిపోతున్నా!
కొన్నేళ్ల క్రితం వరకు విరాట్ కోహ్లీ అంటే దూకుడుకు మారు పేరు. అది ఆన్ ఫీల్డ్ అయినా...ఆఫ్ ఫీల్డ్ అయినా..! అందుకే ‘క్రికెట్ రారాజు’గా పేరు తెచ్చుకున్నప్పటికీ దుందుడుకు స్వభావం కారణంగా కొన్ని విమర్శలూ మూటగట్టుకున్నాడు. అయితే అనుష్కతో పెళ్లయ్యాక ఉన్నట్లుండి కూల్‌గా మారిపోయాడీ టీం ఇండియా కెప్టెన్. మైదానంతో పాటు బయట కూడా ఎంతో ప్రశాంతంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు.తరువాయి

మీ భాగస్వామి తరచూ నిందిస్తున్నారా..?
భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడూ మాటామాటా అనుకోవడం సహజం. అయితే ఎప్పుడో ఒకసారి కాకుండా తరచూ మీ భాగస్వామి మిమ్మల్ని నిందిస్తుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఇవి భార్యాభర్తల మధ్య బంధాన్ని బీటలు వారేలా చేయడమే కాకుండా, ఒకింత అభద్రతా భావాన్ని కూడా కలిగించే అవకాశాలున్నాయట! ఈ నేపథ్యంలో భాగస్వామి తరచూ మిమ్మల్ని నిందిస్తుంటే ఏం చేయాలి?తరువాయి

అతను ఎలాంటి వాడు? ముందే తెలుసుకోండి..!
అమ్మాయికి పెళ్లి కుదిరిందని తెలిస్తే చాలు.. 'చక్కందాల చుక్క.. కుదిరిందే పెళ్లెంచక్కా..' అంటూ బంధువులంతా ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. మూడుముళ్ల బంధంతో, ఏడడుగుల ప్రయాణంతో మొదలయ్యే వైవాహిక జీవితం కడవరకూ సంతోషంగా సాగిపోవడానికి మనం ఎంపిక చేసుకునే భాగస్వామి సహకారం కూడా తప్పనిసరని గుర్తుంచుకోవాలి.తరువాయి

ప్రేమించానన్నాడు.. పెద్దల ముందు వంచించాడు..!
ప్రస్తుతం ప్రేమ కథలు చాలా ఎక్కువైపోయాయి.. అయితే ప్రతి ప్రేమకథా విజయవంతం అవ్వాలని లేదు. అలా విఫలమైన ఓ ప్రేమకథతో మన ముందుకొచ్చిందో అమ్మాయి.. ప్రేమించే వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉంటేనే వారి ప్రేమను అంగీకరించండి.. లేదంటే వారిపై మీకు ప్రేమ ఉన్నా.. వారిని మర్చిపోవడమే సరైన మార్గమంటోందామె. మరి, తను ఎందుకిలా చెబుతోందో తెలియాలంటే తన కథేంటో మనం తెలుసుకోవాల్సిందే..తరువాయి

ఉమ్మడి కుటుంబం.. పిల్లలకెన్ని ప్రయోజనాలో!
వృత్తి ఉద్యోగాల రీత్యా, ప్రైవసీ కొరవడుతుందని, స్వేచ్ఛగా ఉండలేమని.. ఇలా కారణాలేవైనా ఉమ్మడి కుటుంబంలో కంటే వేరుగా ఉండడానికే చాలా జంటలు ఆసక్తి చూపుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం అందరితో కలిసున్నప్పుడే ఆనందం రెట్టింపవుతుందని నమ్ముతారు. నిజానికి వేరుగా ఉండడం కంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడే కొన్ని అదనపు ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు రిలేషన్షిప్ నిపుణులు.తరువాయి

పిల్లలకు ఇమ్యూనిటీని పెంచే సప్లిమెంట్స్ ఇవ్వచ్చా?
కరోనా మహమ్మారి బారిన పడకూడదంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరం అన్న విషయం తెలిసిందే! అయితే ఇందుకోసం కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ వాడుతున్నారు. అయితే మనలాంటి పెద్ద వాళ్ల పరిస్థితి సరే.. మరి, చిన్న పిల్లల సంగతేంటి? వారికి ఇన్‌స్టంట్‌గా ఇమ్యూనిటీని పెంచే ఈ సప్లిమెంట్స్ ఇవ్వచ్చా? అనడిగితే.. ఐదేళ్ల లోపు పిల్లలకైతే వద్దే వద్దంటున్నారు పిడియాట్రీషియన్స్.తరువాయి

సింగిల్‌గా ఉంటే తప్పేంటి?!
నిజానికి సింగిల్‌గా ఉంటే స్వేచ్ఛగా, తమకు నచ్చినట్లుగా ఉండచ్చని కొందరు సంబరపడిపోతే.. మరికొందరు మాత్రం.. ఒంటరిగా ఉంటున్నామంటే ఏదో తప్పు చేసిన భావనతో, సమాజం తమ పట్ల చెడు దృష్టితో చూస్తుందన్న ప్రతికూల ఆలోచనల్ని మనసులో నింపుకుంటారు. దీనివల్ల మానసిక ఆందోళనలు తప్ప మరే ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు. అయినా సింగిల్‌గా ఉంటే వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. కాస్త దీర్ఘంగా ఆలోచించాలే కానీ.. ఒంటరితనాన్నీ ఎంజాయ్ చేయచ్చంటున్నారు.తరువాయి

అవును.. మేం భార్యా విధేయులమే!
నాలుగ్గోడల మధ్య ఎలా ఉన్నా.. నలుగురిలోకి వెళ్లినప్పుడు మాత్రం భార్యలకు ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి, సపర్యలు చేయడానికి కొంతమంది భర్తలు మొహమాటపడుతుంటారు. మరి, నలుగురి మధ్యలో ఉన్నప్పుడు కూడా తమ భార్యలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ, ఎలాంటి మొహమాటం లేకుండా అన్ని పనుల్లోనూ వారికి సాయపడుతూ భార్యాభర్తలిద్దరూ సమానమేనని చాటే భర్తలూ లేకపోలేదు. ఆ లిస్టులో తన భర్త రితేశ్ కూడా ఉన్నాడంటోంది బాలీవుడ్ బ్యూటీ జెనీలియా.తరువాయి

ఎవరేమనుకున్నా, ఎవరెలా చూసినా.. అమ్మగా అది మన హక్కు!
చంటి బిడ్డ ఆకలి తీర్చడం తల్లి ప్రథమ కర్తవ్యం.. అది ఎక్కడైనా, ఎప్పుడైనా సరే?! అయితే ఈ విషయంలో చాలామంది అమ్మలు వెనకబడే ఉన్నారని చెప్పాలి. ఇంట్లో నాలుగ్గోడల మధ్య స్వేచ్ఛగా తన చిన్నారికి పాలిచ్చే తల్లులు.. నలుగురిలోకి వచ్చేసరికి మాత్రం మొహమాటపడుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్ల వెకిలి చూపులు వాళ్లను ఇబ్బందికి గురి చేయడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. అయితే ఎవరేమనుకున్నా, ఎవరెలాంటి దృష్టితో చూసినా ఇంటా బయటా తల్లులు చిన్నారులకు పాలివ్వడానికి అస్సలు వెనకాడకూదని చెబుతున్నారు కొందరు తారామణులు.తరువాయి

తొలి ప్రేమ విఫలమైందా..? ఇలా చేసి చూడండి!
ప్రేమ.. ఇది ఎంతటి మధురానుభూతుల్ని పంచుతుందో.. విఫలమైతే అంతకంటే ఎక్కువగా బాధపెడుతుంది. అమ్మాయిలైతే ఈ విషయాన్ని మనసు మీదకు తీసుకొని మరింతగా కుంగిపోతుంటారు. ఇదిగో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే ఆచితూచి అడుగేయాలంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. అప్పుడే ప్రేమలో విఫలమైనా అక్కడే ఆగిపోకుండా.. జీవితంలో ముందుకెళ్లచ్చంటున్నారు. అలాకాకుండా ఏమాత్రం క్షణికావేశానికి లోనైనా జీవితమే ప్రశ్నార్థకమవుతుందంటున్నారు.తరువాయి