Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!

ఏటా రాఖీ పండగొస్తుందనగానే.. కొన్ని వారాల ముందు నుంచే మార్కెట్లో విభిన్న రాఖీలు దర్శనమిస్తుంటాయి. అయితే ఒకప్పుడు రాఖీ అంటే మణికట్టు నిండుగా ఉన్న డిజైన్‌ని ఎంచుకోవడానికే .....

Published : 10 Aug 2022 20:03 IST

ఏటా రాఖీ పండగొస్తుందనగానే.. కొన్ని వారాల ముందు నుంచే మార్కెట్లో విభిన్న రాఖీలు దర్శనమిస్తుంటాయి. అయితే ఒకప్పుడు రాఖీ అంటే మణికట్టు నిండుగా ఉన్న డిజైన్‌ని ఎంచుకోవడానికే ఆసక్తి చూపేవారు. కానీ ప్రతి అంశంలోనూ వైవిధ్యానికి ప్రాధాన్యమిచ్చే ఈ కాలపు అమ్మాయిలు రాఖీల విషయంలోనూ వెరైటీగా ఉండాలనే ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏటికేడు సరికొత్త రాఖీలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇక పర్యావరణ హితాన్ని కోరుకునే వాళ్ల కోసం ఎకో-ఫ్రెండ్లీ రాఖీలు సైతం మార్కెట్లో కొలువుదీరాయి.

ఈ క్రమంలో వెదురు, ఆవు పేడ, చెక్క.. వంటి వస్తువులు ఉపయోగించి విభిన్న ఆకృతులు, డిజైన్లలో రూపుదిద్దుకున్న రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. ఇక కాస్త ఓపిక ఉన్న గృహిణులైతే.. ఇంట్లో మిగిలిపోయిన రంగు రంగుల కట్‌పీసెస్‌, కుందన్లు, రాళ్లు, ప్లాస్టిక్‌ పూలు, రంగురంగుల దారాలతో అల్లిన అందమైన రాఖీలు తయారుచేసి తాము ఉపయోగించుకోవడం, మార్కెట్లో విక్రయించడం పరిపాటే! ఇలా పెద్దవారికే కాదు.. చిన్న పిల్లల మనసు దోచుకునే బొమ్మల రాఖీలు, చాక్లెట్‌ రాఖీలు సైతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇవన్నీ వద్దు.. మాకంటూ ప్రత్యేకంగా కావాలనుకుంటే.. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, అభిరుచుల మేరకు.. ఫొటోఫ్రేమ్‌, పేర్లతోనూ స్పెషల్‌గా రాఖీలు తయారుచేయించుకోవచ్చు. మరి, ఈ ఏడాది రాఖీ పండక్కి సరికొత్తగా ముస్తాబై మన ముందుకొచ్చిన అలాంటి కొన్ని రాఖీల్ని ఇక్కడ చూసేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్