తనలో ఓ అందమైన ప్రపంచం దాగి ఉంది!

వెండితెరైనా... నిజ జీవితమైనా ‘మేడ్‌ ఫర్ ఈచ్‌ అదర్‌’ అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు దీపికా పదుకొణె-ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌. సందర్భమేదైనా, వేదికేదైనా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడరీ లవ్లీ కపుల్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ జంట తమ ముచ్చటైన ఫొటోలు, వీడియోలను అందులో పోస్ట్‌ చేస్తుంటారు. తద్వారా నేటి తరం దంపతులకు రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతుంటారు.

Published : 07 Jul 2021 20:18 IST

వెండితెరైనా... నిజ జీవితమైనా ‘మేడ్‌ ఫర్ ఈచ్‌ అదర్‌’ అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు దీపికా పదుకొణె-ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌. సందర్భమేదైనా, వేదికేదైనా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడరీ లవ్లీ కపుల్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ జంట తమ ముచ్చటైన ఫొటోలు, వీడియోలను అందులో పోస్ట్‌ చేస్తుంటారు. తద్వారా నేటి తరం దంపతులకు రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతుంటారు. తాజాగా తన సతీమణిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు రణ్‌వీర్‌. దీపిక భర్త అయినందుకు తానెంతో గర్వపడుతున్నానంటూ మురిసిపోయాడు.

పెళ్లికి ముందు ‘రామ్‌ లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ వంటి సినిమాల్లో జంటగా కనిపించి కనువిందు చేశారు దీపిక-రణ్‌వీర్. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకుని నిజ జీవితంలోనూ అన్యోన్య దంపతులుగా మారిపోయారు. 2018లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ పెళ్లి తర్వాత కూడా ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమను తెలుపుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకించి ఈ విషయంలో దీపిక కంటే రణ్‌వీర్‌ కాస్త ముందున్నాడని చెప్పుకోవచ్చు. తాను భార్యా విధేయుడినని... తన సతీమణి సంతోషమే తనకు ప్రాధాన్యమంటూ పలుసార్లు తన అర్ధాంగిపై ప్రేమను ఒలకబోశాడు రణ్‌వీర్‌. తాజాగా దీపిక తన వృత్తిగత, వ్యక్తిగత వివరాలకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులకు అందుబాటులో ఉంచేందుకు www.deepikapadukone.com పేరుతో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీపిక గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు, లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన వివరాలన్నీ ఇందులో పొందుపరచారు. తాజాగా ఈ వెబ్‌సైట్‌ లాంఛింగ్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో దీప్‌వీర్‌తో పాటు ఫరాఖాన్‌, కబీర్‌ ఖాన్‌, సవ్యసాచి తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి తన తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించాడు రణ్‌వీర్.

ఆమెలో ఓ అందమైన ప్రపంచం దాగుంది!

‘నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి దీపిక. ఆమె నా అర్ధాంగి కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు. దీపిక తనలో తాను ఓ అద్భుతమైన, అందమైన ప్రపంచాన్ని కలిగి ఉంది. ప్రేమ, కరుణ, దయ, తెలివితేటలు, అందం, ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, సహృదయత... అన్నీ ఆమెలో అంతర్గతంగా దాగి ఉన్నాయి. ఈ లక్షణాలే తనను ఓ అద్భుతమైన వ్యక్తిగా, ట్యాలెంటెడ్‌ నటిగా తీర్చిదిద్దాయి. ఆమె ప్రపంచంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరు. అంతర్గత బలం, పట్టుదల, మానసిక స్థైర్యం మెండుగా ఉండే దీపిక స్వచ్ఛతకు, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే ఎవరైనా ఆమెకు గౌరవమివ్వాలనుకుంటారు. నేనైతే తన ఆరాధనలో పడి ఒక్కోసారి ఆమెను చూస్తూ అలా ఉండిపోతుంటాను. దీపిక ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఆమె పుట్టిందే ఇలా గొప్పగా నిలబడేందుకు. అందుకే ప్రపంచంలో కెల్లా నేను అత్యంత గర్వపడే భర్తనని ధైర్యంగా చెప్పుకోగలను’ అంటూ తన సతీమణిపై ప్రేమను కురిపించాడీ హ్యాండ్సమ్‌ హీరో.

పెళ్లి తర్వాత ఆన్‌స్ర్కీన్‌పై జంటగా కనిపించని దీప్‌వీర్‌ ‘83’ చిత్రంలో మళ్లీ జోడీగా దర్శనమివ్వనున్నారు. కపిల్దేవ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరెక్కిన ఈ సినిమాలో కపిల్‌ సతీమణి రోమీ భాటియా పాత్రలో కనిపించనుంది దీపిక. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్