అలాంటి పిల్లలతో నెగ్గుకురావాలంటే..

పదేళ్ల అనిరుధ్.. ఎవరు ఏమడిగినా పొగరుగా సమాధానమిస్తాడు.. ఆరేళ్ల రష్మి అమ్మకు తెలియకుండా ఇంట్లో ఉన్న చాక్లెట్లన్నీ తినేస్తుంది. పన్నెండేళ్ల లతికకు స్కూల్‌కి వెళ్లమంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది.. ఇలాంటి పెంకి పిల్లలను మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం.. మనింట్లోనే అలాంటి పిల్లలున్నా....

Updated : 05 Nov 2023 11:12 IST

పదేళ్ల అనిరుధ్.. ఎవరు ఏమడిగినా పొగరుగా సమాధానమిస్తాడు.. ఆరేళ్ల రష్మి అమ్మకు తెలియకుండా ఇంట్లో ఉన్న చాక్లెట్లన్నీ తినేస్తుంది. పన్నెండేళ్ల లతికకు స్కూల్‌కి వెళ్లమంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది.. ఇలాంటి పెంకి పిల్లలను మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం.. మనింట్లోనే అలాంటి పిల్లలున్నా ఆశ్చర్యం లేదు.. మరి ఇలాంటి పిల్లలతో ఎలా నెగ్గుకురావాలి??

అడగకుండా బయటకు వెళ్లడం, నలుగురిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం, పొగరుగా మాట్లాడటం ఇలాంటి చాలా లక్షణాలు పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల కొన్నిసార్లు నలుగురిలో మనం ఇబ్బంది పడాల్సిన సందర్భాలు కూడా ఎదురవుతాయి. అందుకే పిల్లల్లో ఎదురయ్యే ఇలాంటి లక్షణాలను మొగ్గలోనే తుంచేయడం మంచిది.

పొగరుగా మాట్లాడటం

చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులతోనే కాదు.. ఇతరులతో కూడా చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. కొద్దిరోజులకు తగ్గిపోతుందిలే అని తల్లిదండ్రులు వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి వారు తమ ప్రవర్తన వల్ల స్నేహితులు, టీచర్లతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు అలాగే వదిలేయకుండా వాళ్ల తప్పేంటో పిల్లలకు వివరించి చెబితే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. అది మొదట్లోనే అయితే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది.

అడగకపోవడం

చిన్నపిల్లల్లో ఇది మనది, ఇది మనది కాదు.. ఇది చేయొచ్చు. ఇది చేయకూడదు.. అనే విచక్షణ రాకముందు ఇలాంటి తప్పులు ఎక్కువగా జరుగుతుంటాయి. తమకు నచ్చిన వస్తువు అడగకుండా తీసుకోవడం, అడగకుండా ఎక్కడికైనా వెళ్లిపోవడం వంటివి చేస్తూ ఉంటారు పిల్లలు.. ఇలాంటి పనులను పట్టించుకోకపోతే అవి పెరుగుతూ పోతాయి. ఇలాంటప్పుడు పిల్లలకు కొన్ని రూల్స్ పెట్టి అవి పాటించాల్సిన అవసరాన్ని వాళ్లకు వివరించడం మంచిది.

అబద్ధాలాడటం

చిన్న, చిన్న విషయాల్లో పిల్లలు అబద్ధాలాడుతూ ఉంటారు. తమకు నచ్చని పనులు చేయాలంటే ఇబ్బందిగా ఉండో, లేదా ఇతరుల ముందు తమ విలువ పెంచుకోవడానికో పిల్లలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇది తప్పని పిల్లలకు ప్రారంభంలోనే వివరించి చెబితే మంచిది. అలా చేయడం వల్ల కొద్ది రోజుల తర్వాత తాను నిజం చెప్పినా ఆ విషయాలను ఎవరూ పట్టించుకోరని చెప్పడం వల్ల వాళ్లు ఈ ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉంది.

మధ్యలో మాట్లాడటం

ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి. పెద్దవాళ్లు మాట్లాడుతుంటే పిల్లలు మధ్యలో మాట్లాడటం మంచి విషయం అనిపించుకోదు. దీని గురించి పిల్లలను కూర్చోబెట్టుకొని మాట్లాడటం మంచిది. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోకూడదని, కాసేపు ఆగిన తర్వాత పర్మిషన్ తీసుకొని మాట్లాడాలని వారికి వివరించడం వల్ల ఇతరుల ముందు మీ పిల్లలు సభ్యతగా వ్యవహరించడం అలవాటు చేసుకుంటారు.

ఇలా పిల్లల ప్రవర్తనను మాటలతో మార్చే అవకాశం ఉంది. తిట్టడం, కొట్టడం వల్ల వారి ప్రవర్తన మారదు సరి కదా.. వాళ్లు ఇంకా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకు నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పి మార్చుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్