close
అవీ.. ఇవీ..
విజయ్‌ ఆంటోనితో అక్షర హాసన్‌

అక్షరహాసన్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘వివేగం’, ‘కడారం కొండాన్‌’ చిత్రాల్లో నటించి మెప్పించిన కమల్‌ రెండో గారాలపట్టి అక్షర హాసన్‌ త్వరలోనే విజయ్‌ ఆంటోని చిత్రంలో కనిపించనుంది. మూడర్‌కూడం ఫేమ్‌ నవీన్‌ దర్శకత్వంలోని చిత్రంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘అగ్ని సిరగుగల్‌’ అని పేరు పెట్టారు. ఇందులో అరుణ్‌ విజయ్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. షాలినిపాండే కథానాయిక. నాజర్‌, ప్రకాశ్‌రాజ్‌, మీరా మిథున్‌, కలైయరసన్‌లు ఇతర తారాగణం. ఇప్పుడు ఈ జట్టులో నటి అక్షరహాసన్‌ కూడా చేరింది. తాజాగా ఈ చిత్ర బృందంతో అక్షరహాసన్‌ ఫొటో దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అంతేకాకుండా ఈ బృందం చిత్రీకరణ కోసం రష్యా బయలుదేరింది. అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌ జరుగనుందని సమాచారం. మాస్‌ కమర్షియల్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్రవర్గాలు ప్రకటించనున్నాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.