close
బాలీవుడ్
అమ్మా.. ఐ లవ్యూ: జాన్వి కపూర్‌

శ్రీదేవి జయంతి.. జాన్వి పోస్ట్‌

ముంబయి: దివంగత నటి శ్రీదేవి 54వ జయంతి నేడు. ఈ నేపథ్యంలో ఆమె పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ తన తల్లిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మా.. ఐ లవ్యూ’ అని పోస్ట్‌ చేస్తూ.. శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్‌’లోని ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు కూడా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ‘మిమ్మల్ని మిస్సవుతున్నాం మేడమ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి కన్నుమూశారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌ రూమ్‌ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తుపడి తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా, నటి ప్రియాంక చోప్రా తదితరులు కూడా ఆమెతో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పోస్ట్‌లు పెట్టారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.