వెయిట్ లిఫ్టర్ మమ్మీ @ 68 !

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది కొంత వయసు వచ్చాక తాము వ్యాయామం చేయలేమని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తుంటారు. ఈ జాబితాలో రోషిణీ దేవి సంగ్వాన్ (68) ముందు వరుసలో ఉంటారు.

Updated : 09 Aug 2023 18:02 IST

(Photos: Instagram)

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది కొంత వయసు వచ్చాక తాము వ్యాయామం చేయలేమని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తుంటారు. ఈ జాబితాలో రోషిణీ దేవి సంగ్వాన్ (68) ముందు వరుసలో ఉంటారు. ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడిన ఆమెకు తీవ్ర గాయమైంది. ఇతరుల సహాయం తీసుకోనిదే నడవలేవని డాక్టర్లు చెప్పడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయినా కొడుకు ఇచ్చిన ధైర్యంతో వ్యాయామం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు తన సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు ఈ వయసులో సైతం కష్టమైన వ్యాయామాలు చేస్తున్నందుకు గాను పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

కొడుకు సలహాతో..

68 ఏళ్ల రోషిణి ఓ రోజు అనుకోకుండా బాత్‌రూంలో జారిపడ్డారు. దాంతో ఆమెకు పెద్ద గాయమైంది. ఇందుకోసం రెండు నెలల పాటు ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నారు. అయితే ఆమెకు అంతకుముందు నుంచే మోకాళ్ల నొప్పి ఉండడంతో డాక్టర్లు మెట్లు ఎక్కద్దని, నడిచేటప్పుడు ఇతరుల సహాయం తీసుకోమని చెప్పారు. దాంతో ఆమె తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రోషిణి కొడుకు అజయ్‌ సంగ్వాన్‌ జిమ్‌ ట్రైనర్‌. అతను తన తల్లికి ధైర్యం చెప్పడంతో పాటు వ్యాయామం చేయమని సలహా ఇచ్చాడు. అందుకు మొదట నిరాకరించిన ఆమె.. తర్వాత కొడుకు ఇచ్చిన స్ఫూర్తితో వ్యాయామం చేయడం మొదలు పెట్టారు. అలా రెండు నెలల వ్యవధిలోనే తన సమస్యను దూరం చేసుకున్నారు.

నెటిజన్ల ప్రశంసలు..

అజయ్‌ సంగ్వాన్‌ తన తల్లి చేసే వ్యాయామాలను అందరితో పంచుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో @weightliftermummy (వెయిట్ లిఫ్టర్ మమ్మీ) పేరుతో ఖాతాను తెరిచాడు. ఈ క్రమంలోనే జూన్‌ 9న తన తల్లి చేసిన మొదటి వ్యాయామాన్ని పోస్ట్‌ చేశాడు. ఆ రోజు ఆమె వివిధ రకాల నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయినా కొడుకు ఇచ్చిన స్ఫూ్ర్తితో వివిధ రకాల వ్యాయామాలు చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత సైతం క్రమం తప్పకుండా వివిధ రకాల వ్యాయామాలు చేశారు. అలా రెండు నెలల వ్యవధిలోనే పెద్ద పెద్ద బరువులు ఎత్తడంతో పాటు క్వాట్స్‌, ప్లాంక్స్‌ వంటి వ్యాయామాలను సైతం సులభంగా చేసేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలను అజయ్‌ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేవాడు. అందులో కొన్ని వైరలయ్యాయి. ఒక వీడియోలో రెండు నిమిషాల పాటు ప్లాంక్‌ పొజిషన్‌లో ఉండి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు రోషిణి. ఈ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘ఈ వయసులో వ్యాయామాల పట్ల మీకున్న మక్కువకు, మీరు పడుతున్న కష్టానికి హ్యాట్సాఫ్‌’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి..!








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్