Updated : 29/06/2021 19:35 IST

76 ఏళ్ల వయసులోనూ ‘సోషల్‌ మీడియా స్టార్’ అవుతోంది!

‘ఆసక్తి, అభిరుచి ఉంటే ఏ పని చేయడానికైనా వయసుతో నిమిత్తం లేదు... మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే’.. ఈ మాటలను నిరూపిస్తూ ఎందరో మహిళలు లేటు వయసులో మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారు. వయసు, ఎవరేమనుకుంటారోనన్న సందేహాలను పక్కన పెట్టి ఒకప్పుడు కోల్పోయిన అవకాశాలను తిరిగి సంపాదించి, నచ్చిన రంగంలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో మలి వయసులోనూ తమ కలలను సాకారం చేసుకుంటూ స్ఫూర్తినిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన శాంతావర్మ. ఏడు పదుల వయసున్న ఆమె ఫ్యాషన్‌కు వయసుతో సంబంధం లేదంటూ లేటెస్ట్ అండ్‌ మోడ్రన్‌ దుస్తులు ధరించి నేటి తరం అమ్మాయిలకు సవాలు విసురుతున్నారు.

76 ఏళ్ల వయసులో!

సాధారణంగా 70 ఏళ్లు పైబడిన మహిళలు విశ్రాంతి తీసుకునేందుకే ప్రాధాన్యమిస్తుంటారు. పైగా ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది కాబట్టి ఇంట్లోనే మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన 76 ఏళ్ల శాంతా వర్మ మాత్రం తన మనవరాలి సహాయంతో సోషల్‌ మీడియాను ఎలా ఉపయోగించాలో క్షుణ్ణంగా నేర్చుకున్నారు. మోడ్రన్‌ దుస్తులలో ఫొటోలు దిగుతూ, వీడియోలు చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తున్నారు. తద్వారా అతికొద్ది సమయంలోనే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూ సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయారు.

ఫాలోయింగ్‌ పెరుగుతోంది!

గతేడాది ఏప్రిల్‌లో తన భర్తతో కలిసి ‘మిస్టర్ అండ్‌ మిసెస్‌ వర్మ’ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేశారు శాంత. అప్పటి నుంచి క్రమం తప్పకుండా తన ఫ్యాషన్‌ అండ్‌ గ్లామరస్‌ ఫొటోలు, ఫన్నీ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూనే ఉన్నారామె. దీంతో రోజురోజుకీ సోషల్‌ మీడియాలో ఈ బామ్మకు ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 16 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

‘షూ ఫ్లిప్ ఛాలెంజ్‌’తో సూపర్‌ క్రేజ్‌!

మిసెస్‌ వర్మ ఇన్‌స్టా బయోలో ‘ప్లేయింగ్‌ కూల్‌ ఆఫ్టర్‌ 70’ అనే క్యాప్షన్‌ ఉంటుంది. దీంతో పాటు వినోదం, నవ్వులు పంచడానికి వయసు అడ్డంకి కాదని ఓ సందేశం రాసి ఉంటుంది. ఇందుకు తగ్గట్టే తన ఫన్నీ వీడియోలతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నారీ గ్రాండ్‌ మామ్‌. ఇటీవల ‘షూ ఫ్లిప్ ఛాలెంజ్‌’ అంటూ ఆమె పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. వీడియోలో భాగంగా మొదట వైట్‌ కుర్తీ అండ్‌ బ్లాక్‌ కలర్‌ పలాజోలో సింపుల్‌గా కనిపించిన బామ్మ తన బ్లాక్‌ కలర్‌ స్టిలెట్టో హీల్‌ను గాలిలోకి ఎగరేస్తుంది. అంతే కళ్లు మూసి తెరిచే లోపు వైట్ కలర్‌ షర్ట్‌ అండ్‌ బ్లాక్‌ కలర్‌ స్కర్ట్‌లో దర్శనమిస్తుంది. ‘మూస ధోరణులను బద్దలు కొడదాం’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియోను 18 లక్షల మందికి పైగా చూడగా, 1.52 లక్షల మంది లైకులు కొట్టారు.

అంతకు ముందు తన భర్త, మనవరాలితో చేసిన చికెన్‌ డ్యాన్స్‌ వీడియోకు కూడా 7.5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇలా అద్భుతమైన వీడియోలు, అందుకు తగ్గ క్యాప్షన్లతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నారు మిసెస్‌ వర్మ. ఈ క్రమంలో తన వీడియోల కారణంగా తనకు వస్తోన్న గుర్తింపుతో తెగ సంబరపడిపోతున్నారీ ఓల్డ్‌ వుమన్‌.

15 ఏళ్ల వయసులో పెళ్లైంది!

‘నాకు 15 ఏళ్ల వయసులోనే వివాహమైంది. దీంతో అత్తామామాలు, పిల్లలు, కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. పెళ్లికి ముందు కూడా అంతే. అమ్మానాన్నలతో పాటు తోబుట్టువుల బాధ్యతలన్నీ నా భుజాల పైనే వేసుకున్నాను. అయితే లాక్‌డౌన్‌ సమయంలో నా మనవరాలు ఇన్‌స్టాగ్రామ్‌ ఎలా ఉపయోగించాలో నాకు నేర్పించింది. అప్పటి నుంచి ఇన్‌స్టా నాకు బాగా అలవాటైపోయింది. ముందుగా ట్రెండీ దుస్తులు ధరించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత నా భర్తతో కలిసి ప్రాంక్‌ వీడియోలు కూడా చేశాను. వాటికి మంచి స్పందన రావడంతో మరికొన్ని వీడియోలు చేశాను. మనకు నచ్చిన పనులు చేయడానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదనే విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను. ఇక దుస్తులకు సంబంధించి గతంలో పెద్దగా వెరైటీలు ఉండేవి కావు. కేవలం చీరలు, సూట్స్‌ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఎన్నో రకాల దుస్తులు అందుబాటులో ఉంటున్నాయి. గతేడాది నుంచే వాటిని ధరించడం అలవాటు చేసుకున్నాను. ఈ విషయంలో నా మనవరాలు నాకు బాగా సహాయం చేస్తోంది’ అని చెబుతోందీ ఓల్డ్‌ వుమన్‌.

మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న శాంతా వర్మ ఇన్‌స్టా పోస్టులపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
CGmQDW0hB2c

Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి