అందానికి.. కొబ్బరిపాలు!

నోరూరించే వంటకాల తయారీలోనే కాదు.. సౌందర్య సంరక్షణలో కూడా కొబ్బరి పాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అదెలా అనుకుంటున్నారా? అయితే కొబ్బరి పాలను ఎలా ఉపయోగిస్తే సౌందర్యపరమైన ప్రయోజనాలు సొంతమవుతాయో....

Published : 17 Mar 2023 21:05 IST

నోరూరించే వంటకాల తయారీలోనే కాదు.. సౌందర్య సంరక్షణలో కూడా కొబ్బరి పాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అదెలా అనుకుంటున్నారా? అయితే కొబ్బరి పాలను ఎలా ఉపయోగిస్తే సౌందర్యపరమైన ప్రయోజనాలు సొంతమవుతాయో తెలుసుకుందాం రండి..

కొబ్బరిపాలలో విటమిన్ ఎ, సి, క్యాల్షియం, ఐరన్, సహజ ప్రొటీన్స్.. ఇలా ఎన్నో పోషకాలు ఉండటం వల్ల వీటిని సౌందర్య సంరక్షణకు నిస్సందేహంగా ఉపయోగించవచ్చు.

స్క్రబ్‌లా..!

చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి మనం స్క్రబ్‌ను ఉపయోగిస్తాం. కొబ్బరిపాలను ఉపయోగించి కూడా చాలా చక్కని స్క్రబ్‌ను తయారుచేసుకోవచ్చు. దీనికోసం మనం చేయాల్సిందల్లా కొద్దిగా కొబ్బరిపాలు తీసుకుని అందులో తగినన్ని ఓట్స్ వేసి 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా చేసుకుని స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు. దీన్ని శరీరానికి, ముఖానికి కూడా అప్త్లె చేసుకోవచ్చు. మృతకణాలను తొలగించడమే కాకుండా చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

సహజ మాయిశ్చరైజర్‌గా..

పొడిచర్మం సమస్యతో బాధపడుతున్న వారికి కొబ్బరిపాలు చాలా చక్కని పరిష్కారం. వీటిని నేరుగా చర్మానికి అప్త్లె చేసి గుండ్రంగా మసాజ్ చేస్తూ 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రం చేసేసుకుంటే సరి. మృదువైన, మెత్తని చర్మం సొంతమవుతుంది.

స్నానానికి కూడా..

స్నానానికి ఉపయోగించే గోరువెచ్చని నీటిలో ఒక కప్పు కొబ్బరిపాలు, కప్పు గులాబీపూల రేకలు, అరకప్పు రోజ్‌వాటర్ కలపాలి. 15 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అంది పొడిబారిన చర్మం సమస్య నుంచి క్రమంగా బయటపడచ్చు.

చర్మం ప్రకాశవంతంగా మారడానికి..

కొబ్బరిపాలలో కొద్దిగా తేనె, కొన్ని కుంకుమపువ్వు రేకలు, చందనం పౌడర్ కలపాలి. ఇవన్నీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి అవసరమయ్యే పోషణ, తేమ అంది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్