మొటిమలతో బాధపడుతున్నారా?

'అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే..' అంటూ తన ప్రేయసిని పొగుడుకున్నాడో హీరో! కానీ ఆ మొటిమలు, మచ్చలు అమ్మాయిలకి ఎంత సమస్యను సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కా మీ కోసమే!

Published : 06 Mar 2022 18:31 IST

'అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే..' అంటూ తన ప్రేయసిని పొగుడుకున్నాడో హీరో! కానీ ఆ మొటిమలు, మచ్చలు అమ్మాయిలకి ఎంత సమస్యను సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కా మీ కోసమే!

వేప అనగానే.. 'ఛీ.. చేదు..' అనేస్తాం మనమంతా.. కానీ అది చేసే మేలు అంతా ఇంతా కాదు.. మన ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా వేప చక్కగా ఉపయోగిస్తుంది. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలను తొలగిస్తుంది. ఇంతకీ వేపను ఎలా వాడాలంటారా? అక్కడికే వస్తున్నాం..

స్కిన్ టోనర్

దాదాపు 50 వేపాకులను తీసుకొని రెండు లీటర్ల నీటిలో మరిగించండి. ఆకులు రంగు మారి నీళ్లంతా ఆకుపచ్చగా మారే వరకు నీటిని వేడి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో దాదాపు 100 మి.లీ మిశ్రమాన్ని కలిపి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్‌హెడ్స్‌తో పాటు వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి.. దీన్ని స్కిన్ టోనర్‌గానూ వాడచ్చు.. వేప నీటిలో ఓ కాటన్ బాల్‌ని ముంచి ప్రతి రోజూ రాత్రి ముఖాన్ని తుడుచుకోండి. దీని వల్ల పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు వంటివన్నీ తగ్గిపోతాయి.

వేప ప్యాక్..

ఓ పది వేపాకులను తీసుకొని, దానికి కొన్ని నారింజ తొక్కలను కలిపి కొద్దిపాటి నీటిలో గుజ్జులా మారే వరకు మరిగించండి. దాన్లో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు వంటివి కలపండి. దీన్ని వారానికి మూడుసార్లు మొహానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.. ఫలితంగా మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్