పిల్లల్లేరు.. తనలో ఏ లోపం లేదంటున్నాడు!

మాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. పిల్లల్లేరు. నేను వైద్య పరీక్షలు చేయించుకుంటే ఏ లోపం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే నా భర్తను పరీక్షలు చేయించుకోమంటే ఒప్పుకోవడం లేదు. ఆయనకు అహంకారం ఎక్కువ. తనలో ఏ లోపం లేదని అంటున్నాడు.

Published : 12 Mar 2024 20:23 IST

(Representational Image)

మాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. పిల్లల్లేరు. నేను వైద్య పరీక్షలు చేయించుకుంటే ఏ లోపం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే నా భర్తను పరీక్షలు చేయించుకోమంటే ఒప్పుకోవడం లేదు. ఆయనకు అహంకారం ఎక్కువ. తనలో ఏ లోపం లేదని అంటున్నాడు. మా అత్తమామలు కూడా ఆయనకే సపోర్ట్‌ చేస్తున్నారు. పిల్లలు లేకపోవడంతో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. మావారు పరీక్షలకు ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలియడం లేదు. కౌన్సెలింగ్‌ ద్వారా అతనిలో మార్పు వస్తుందా?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా మీ భర్త మనసు కచ్చితంగా మారుతుంది. ఈ సమస్యలకు ఇన్‌ఫెర్టిలిటీ కౌన్సెలర్లు పరిష్కారం చూపుతారు. కొన్ని సంతాన సాఫల్య కేంద్రాల్లోనూ ఇలాంటి కౌన్సెలర్లు ఉంటారు. వారి దగ్గరకు మీ భర్తను తీసుకెళ్లండి. అయితే తను పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. కాబట్టి, మీలో సమస్య ఉందని చెప్పి అతడిని వాళ్ల దగ్గరికి తీసుకెళ్లండి. ఆపై వాళ్లు వివరాలు తెలుసుకొని ఎక్కడ సమస్య ఉందో గుర్తిస్తారు. దీనికంటే ముందుగా మీరు ఒంటరిగా ఆ సెంటర్‌కు వెళ్లండి. మీ భర్త టెస్ట్‌లకు నిరాకరిస్తున్న విషయాన్ని వారికి వివరించండి. ఫలితంగా ఆపై మీ భర్తతో కలిసి వెళ్లినప్పుడు సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

కొంతమంది పురుషులకు అహంకారం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తల్లిదండ్రులు కూడా ఎక్కువ శాతం తమ సంతానం వైపే మొగ్గు చూపుతుంటారు. కాబట్టి, వారి నుంచి మీకు సహాయం లభించే అవకాశం తక్కువ. ఈ క్రమంలో కౌన్సెలర్లు, ఇన్‌ఫెర్టిలిటీ నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. అయితే మీరు పరీక్షలు చేయించుకుంటానని చెప్పి అతనిని తీసుకెళ్లినప్పుడే పరిష్కారం దిశగా తొలి అడుగు పడుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్