ముఖం, ఛాతీపై మచ్చలు.. తగ్గేదెలా?

మేడమ్.. నాకు ౨౬ ఏళ్లు. రెండేళ్ల క్రితం పెళ్లైంది. నాది జిడ్డు చర్మం. దీనితో పాటు మొటిమలు, మచ్చల సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ముఖం, చేతులు, ఛాతీ, వీపు భాగంలో కూడా ఈ సమస్యలున్నాయి. నా చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించడానికి.. మొటిమలు, మచ్చలు తగ్గడానికి.....

Published : 02 Apr 2023 11:42 IST

మేడమ్.. నాకు ౨౬ ఏళ్లు. రెండేళ్ల క్రితం పెళ్లైంది. నాది జిడ్డు చర్మం. దీనితో పాటు మొటిమలు, మచ్చల సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ముఖం, చేతులు, ఛాతీ, వీపు భాగంలో కూడా ఈ సమస్యలున్నాయి. నా చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించడానికి.. మొటిమలు, మచ్చలు తగ్గడానికి శాశ్వత పరిష్కారం తెలియజేయగలరు. - ఓ సోదరి

మొటిమలు, మచ్చలు తగ్గడానికి:

ఆలివ్ ఆయిల్‌ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని మచ్చలు ఉన్న చోట మృదువుగా మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మచ్చలు మాయమవుతాయి.

మచ్చలు ఉన్న చోట తేనె అప్లై చేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.

గంధం పొడి - 1 చెంచా, రోజ్‌వాటర్- 2 చెంచాలు.. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కలబంద గుజ్జు - 1 చెంచా, రోజ్‌వాటర్ - 1 చెంచా,  పసుపు - 1 చెంచా..

ఈ మూడింటినీ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

టొమాటో రసం- 2 చెంచాలు, ముల్తానీ మట్టి- 1 చెంచా.. ఈ రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం తిరిగి కాంతివంతంగా మారుతుంది.

ఈ జాగ్రత్తలు కూడా!

నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఎప్పటికప్పుడు చర్మం మీద పేరుకునే జిడ్డుని తొలగించుకోవాలి.

బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్