పాదాల సంరక్షణకు ‘ఫుట్‌ క్లెన్సర్‌’!

పాదాలే కదా.. అని చాలామంది వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తద్వారా వాతావరణ కాలుష్యం, దుమ్ము-ధూళి పాదాలపైకి చేరి అక్కడి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. ఫలితంగా పాదాలు, మడమలపై మృతకణాలు పెరిగిపోయి ఆనెలు ఏర్పడడం, చర్మం ఊడిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ వేసవిలో వేడికి....

Published : 27 Mar 2022 10:29 IST

పాదాలే కదా.. అని చాలామంది వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తద్వారా వాతావరణ కాలుష్యం, దుమ్ము-ధూళి పాదాలపైకి చేరి అక్కడి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. ఫలితంగా పాదాలు, మడమలపై మృతకణాలు పెరిగిపోయి ఆనెలు ఏర్పడడం, చర్మం ఊడిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ వేసవిలో వేడికి కొంతమంది పాదాలు, మడమలు పొడిబారిపోయి పగులుతుంటాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొంది.. పాదాల్ని సంరక్షించుకోవాలంటే ఈ గ్యాడ్జెట్‌ ప్రయత్నించి చూడండి!

ఫుట్ క్లెన్సర్ షవర్ స్లిప్పర్

పాదాలపై ఏర్పడిన మృత చర్మం దగ్గర్నుంచి మడమల్లో పగుళ్ల వరకు.. అన్ని సమస్యలు ఒకేసారి తొలగిపోతే బాగుంటుంది కదా! అలాంటి ఆల్‌ ఇన్‌ వన్‌ గ్యాడ్జెటే ఈ ‘ఫుట్ క్లెన్సర్ షవర్ స్లిప్పర్’. అచ్చం ఫుట్‌వేర్ మాదిరిగానే ఉండే ఈ స్లిప్పర్‌కి అడుగున, పైభాగంలో మృదువైన పొడవాటి బ్రిజిల్స్ ఉంటాయి. మడమ భాగంలో ప్యూమిస్ స్టోన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ స్లిప్పర్‌లో కాలు పెట్టి.. పై నుంచి ఫుట్‌ వాష్ లిక్విడ్‌ను పోస్తూ కాలును ముందుకు, వెనక్కి జరుపుతుండాలి. ఈ క్రమంలో బ్రిజిల్స్ పాదాలు, అరికాళ్లలోని చర్మాన్ని శుభ్రం చేస్తే.. ప్యూమిస్ స్టోన్ మడమల్లోని పగుళ్లను తొలగిస్తుంది. ఇలా పెద్దగా శ్రమ పడకుండానే.. అదీ ఇంట్లోనే స్వయంగా పాదాల్ని శుభ్రం చేసుకోవచ్చు.. భలే ఉంది కదండీ ఈ గ్యాడ్జెట్‌!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్