అలా నడవలేకపోతే...

ఎత్తు చెప్పులు వేసుకుని నడవడం నిజంగా ఒక కళ. అయితే వాటిని వేసుకున్నప్పుడు తడబడకుండా నడవాలంటే కొన్ని మెలకువలు పాటించి చూడండి....

Updated : 09 Dec 2022 13:23 IST

ఎత్తు చెప్పులు వేసుకుని నడవడం నిజంగా ఒక కళ. అయితే వాటిని వేసుకున్నప్పుడు తడబడకుండా నడవాలంటే కొన్ని మెలకువలు పాటించి చూడండి.
*ఎత్తు చెప్పులు కొత్తయితే మొదట్లోనే ఎక్కువ ఎత్తు ఉన్న వాటి జోలికి పోకూడదు. కొత్తలో ఒకటీ, ఒకటిన్నర అంగుళాల కన్నా ఎక్కువ ఎత్తు లేకుండా చూసుకోవాలి. ముందు వైపు కప్పి ఉండే హీల్‌ , వెనుక వైపు ఆసరా ఉండే బెల్ట్‌ రకాలను ఎంచుకుంటే కాళ్లకు కాస్త పట్టు ఉంటుంది. వాటికి అలవాటు పడ్డాక ఇతర రకాలు ప్రయత్నించొచ్చు.
* అడుగు వేసేటప్పుడు తడబడకుండా ఉండాలంటే చెప్పు వెనకభాగం... అంటే హీల్‌ నేలను తాకి, ఆ తరువాత చెప్పు ముందుభాగం నేలను తాకాలి. దానివల్ల పడిపోతామనే భయం ఉండదు. వీలైతే ఇంట్లో ఏవయినా పాటలు పెట్టుకుని వాటికి అనుగుణంగా నడుస్తూ సాధన చేస్తే కొంతవరకూ అలవాటు అవుతుంది.
* ఎత్తు చెప్పులు వేసుకోవాలనుకున్నప్పుడు ట్రెండ్స్‌ కంటే సౌకర్యమే ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలానే మీ పాదానికి సరిగ్గా నప్పేవాటినే ఎంచుకోవాలి. అంటే పాదం కంటే  కాస్త పెద్దా, లేదంటే చిన్న వాటిని వేసుకోవడం వల్ల అడుగులు తడబడతాయి. మడమలూ నొప్పి పుడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్