పాదాల పగుళ్లా..

రోజూ స్నానం సమయంలో ప్యూమిస్‌ స్టోన్‌తో పాదాలను శుభ్రం చేయాలి. ఆ తర్వాత తడి పోయేలా తుడవాలి. కాలి వేళ్ల మధ్య తేమ ఉండిపోతే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

Published : 02 Jul 2021 01:08 IST

* రోజూ స్నానం సమయంలో ప్యూమిస్‌ స్టోన్‌తో పాదాలను శుభ్రం చేయాలి. ఆ తర్వాత తడి పోయేలా తుడవాలి. కాలి వేళ్ల మధ్య తేమ ఉండిపోతే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
* కాలి పగుళ్లతో బాధపడేవారు ఫ్లిప్‌ - ఫ్లాప్స్‌, ఎత్తు మడమలకు దూరంగా ఉండాలి. ఇవి వేసుకుని రోడ్డుపై నడిస్తే మొత్తం దుమ్ము, ధూళి మీ కాలివేళ్లు, అరికాళ్లపైనే పేరుకుంటుంది.
* కాస్తంత చక్కెరలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌, కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్‌ వేసి పాదాల పగుళ్లపై మర్దనా చేయాలి. కాసేపాగి కడిగేయాలి. చక్కెర మృత కణాలను తొలగిస్తే నూనెలు చర్మానికి తేమను అందిస్తాయి. నెలలో ఒకట్రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్