స్మార్ట్‌గా మేకప్‌

అలంకరణ కిట్‌లో వస్తువులు అందుబాటులో లేకపోతే ఏం చేయాలి? ఉన్నవాటినే స్మార్ట్‌గా ఎలా వాడుకోవాలి? తెలుసుకోండి...

Published : 19 Jul 2021 01:36 IST

అలంకరణ కిట్‌లో వస్తువులు అందుబాటులో లేకపోతే ఏం చేయాలి? ఉన్నవాటినే స్మార్ట్‌గా ఎలా వాడుకోవాలి? తెలుసుకోండి...

* అలంకరణ తొలగించడానికి క్లెన్సర్‌ లేకపోతే... మేకప్‌ రిమూవర్‌నీ వాడొచ్చు. అలానే టోనర్‌కి బదులు యాపిల్‌సిడార్‌ వెనిగర్‌ని వినియోగించొచ్చు. ఐలైనర్‌ బదులు మస్కారాలో సన్నని బ్రష్‌ ముంచి లైనర్‌గా వాడండి.

* ఫెర్‌ఫ్యూమ్‌ ఎక్కువ సేపు పరిమళం వెదజల్లేందుకు కొంతమంది కణతలపై, చెవి వెనుక చల్లుతుంటారు. ముందు అక్కడ కొంత పెట్రోలియం జెల్లీ రాసుకుంటే పరిమళం ఎక్కువ సేపు గుబాళిస్తుంది.

* పెదాలకు లిప్‌స్టిక్‌ రాయడం నచ్చనివారు... బీట్‌రూట్‌ రసంలో తేనె కలిపి రాసుకుంటే సరి. ఉదయానికి లేతరంగుతో మెరిసిపోతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్